అతడైతే ఆ ఒక్కటి ఓకే
ఆయన కోసం షరతులు సడలిస్తానంటోంది నటి తమన్నా. హీరోయిన్లకు ఒకటి కాదు, రెండు కాదు నాలుగు నాలుకలు ఉంటాయని ఈ అమ్మడి విషయంలో నిజమవుతోంది. ఎందుకంటే ఒకసారి కాదన్నదే మరోసారి అవునంటారు. తమన్నా తంతూ ఇదే. గ్లామరస్ పాత్రల తోనే స్టార్ హీరోయిన్ అయిన తమన్నా బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది. అవసరం అయితే అభినయం లోనూ సత్తా చాటు తానంటున్న తమన్నా ఇకపై గ్లామర్‌కు దూరంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటిస్తానని ఇటీవల చెప్పింది. అయితే ఆ నిర్ణయానికి కట్టుబడినట్లు కనిపించట్లేదు.
తాజాగా విశాల్‌తో జతకట్టిన యాక్షన్ చిత్రంతో తనకే సొంతమైన అందాలను తెరపై పరిచేసింది. లిప్ లాక్ సన్నివేశాల్లో ఇప్పుటి వరకూ నటించ లేదు, ఇకపై నటించను కూడా అని చెప్పేసింది కూడా. తాను చిత్రాలను అంగీకరించే ముందు దర్శక, నిర్మాతలకు విధించే షరతు ఇదేనని పేర్కొంది. అలాంటిది ఇప్పుడు ఆ షరతును ఒకే ఒక్క నటుడికి మినహాయింపు అంటోంది. ఆ లక్కీ నటుడెవరంటే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అట. ఆ నటుడితో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి అభ్యంతరం లేదని అంటోంది.
ఈ అమ్మడికి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించాలన్నది తీరని కోరిక గానే మిగిలి పోయింది. హిమ్మత్‌వాలా వంటి కొన్ని హిందీ చిత్రాల్లో నటించినా, అక్కడి ప్రేక్షకులు ఈ నటిని పట్టించు కోలేదు. ఇక తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకుని నటించేస్తోంది. దీంతో క్రేజీస్టార్ ఇమేజ్ కలిగిన హృతిక్ రోషన్‌తో రొమాన్స్ చేసి తన కెరీర్‌కు హిట్ బాటలోకి మళ్లించు కోవాలని భావిస్తోందని సమాచారం. అంతా బాగానే ఉంది. హృతిక్ రోషన్ కానీ, దర్శక, నిర్మాతలు గానీ పాపం తమన్నాను పట్టించు కోవడం లేదు. తమన్నా మాత్రం తనకు ఛాన్స్ వస్తుందనే నమ్మకంతో ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి