పోస్ట్‌లు

నవంబర్ 25, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

చిన్మయి సీరియస్ కామెంట్స్

చిత్రం
సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ సెలెబ్రెటీగా పేరొందిన ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఏది మాట్లాడినా, లేదా ఏదైనా పోస్టు చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో, పడుతున్నారో ఇటీవలే చెప్పింది. అంతే కాదు సినీగేయ రచయిత వైరముత్తు పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గొప్ప సింగర్ గా ఉన్న చిన్మయి సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తుంది. అంతే కాకుండా బాధితులకు మద్దతుగా తాను నిలబడుతుంది. దీంతో ఆమె ఫైర్ బ్రాండ్ విమెన్ గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మగాళ్లు ఆడవాళ్ళ విషయంలో చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యింది. మగాళ్ల చూపులన్నీ మహిళల వక్షోజాలపైనే ఉంటుందా అంటూ ప్రశ్నించింది. ఓ మహిళ ఎదుర్కొన్న షాకింగ్ ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఓ యువతి వద్దకు వెళ్లాడు. అయితే ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన ఆ యువతిని చూసి అన్నీ కనిపిస్తున్నాయి చున్నీ కప్పుకోండి అన్నాడట. దీంతో ఆమెకు ఒళ్లుమండింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి పేర్కొంది. స్వ...

సుభాష్ చంద్ర గుడ్ బై

చిత్రం
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఛైర్మన్‌ సుభాష్ చంద్ర తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి రానుంది. అయతే బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఆయన కొనసాగనున్నారు .అలాగే ఆయనతో పాటు పునీత్‌ గోయంకా కూడా ఎస్సెల్‌ గ్రూపు ప్రతినిధులుగా బోర్డులో కొనసాగుతారు. కొత్తగా ఏర్పాటైన జీ బోర్డు ఆరుగురిని ఇండిపెండెంట్‌ డైరెక్టర్లగా నియమించుకుంది. వాటాదారుల మార్పుల దృష్ట్యా, సుభాష్ చంద్ర  చేసిన రాజీనామాను బోర్డు అంగీకరించింది. తాజా ఒప్పందం ప్రకారం, రెగ్యులేషన్ 17 ఎల్‌బీ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మరోవైపు సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ మానిటరీ అథారిటీ తమ మొత్తం హోల్డింగ్‌ను 8.44 శాతానికి పెంచిందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. నవంబర్ 21 న జీల్‌లో  2.9 శాతానికి సమాన మైన మొత్తం 2.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జీ 16.5 శాతం వాటాను ఇన్వెస్కో ఒపెన్‌ హైమర్ ఫండ్‌కు 4,224 కోట్లకు విక్రయించ నున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విక్...

పిట్ట కొంచెం కూత ఘనం

చిత్రం
స్టార్ టీవీ ఏ ముహూర్తాన మా టీవీని కొనుగోలు చేసిందో ఇక అప్పటి నుంచి దాని స్వరూపమే పూర్తిగా మారి పోయింది. జనాన్ని మెస్మరైజ్ చేసేలా సీరియల్స్, రియాల్టీ షోస్, ఆకట్టుకునే రీతిలో ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తోంది. బుల్లితెరపై స్టార్ మా టీవీ ఇప్పుడు నంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంది. మరో వైపు జీ తెలుగు, జెమిని కూడా మా తర్వాతే ఉంటున్నాయి. ఇటీవల టెలికాస్ట్ చేసిన బిగ్ బాస్ ప్రోగ్రాం ఏకంగా ఇండియాలోనే టాప్ ప్రోగ్రాం గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఎక్కువ ప్రేక్షకాదరణ కలిగిన సీరియల్ గా కార్తీక దీపం నిలిచింది. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరు ఒక్క రోజులోనే స్టార్స్ గా మారి పోయారు. ఈ సీరియల్ లో ఎక్కువగా సౌందర్య, దీప్తి, డాక్టర్ బాబు పాత్రలు ఆకట్టుకోగా పిల్లలుగా నటించిన చిన్నారులు ఎక్కువగా పాపులర్ అయ్యారు. నేను నీ కూతుర్నే అని ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు డాక్టర్ బాబూ, అసలు నేనేం తప్పు చేశాను, మీరే మా నాన్న అని, అమ్మా చెప్పలేదు. మీరు చెప్పలేదు. నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్ ఎవ్వరూ చెప్పలేదు. నాన్న కోసం ఎంతగా వెతికానో అందరికీ తెలుసు కదా. ఎందుకు నాన్నా.. మీకు అమ్మ అంటే అంత కోపం. మీకెందుకు ఇష్టం ఉండదు. మీల...

దుమ్ము రేపిన రిలయన్స్ జియో

చిత్రం
ఇండియన్ టెలికాం సెక్టార్ లో మరోసారి రిలయన్స్ జియో సత్తా చాటింది. ఇండియన్ మార్కెట్ లో మరోసారి తనకు సాటి లేదని చాటి చెప్పింది ప్రత్యర్థి కంపెనీలకు. తాజాగా జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో ఇన్ఫో కామ్ రెవెన్యూ మార్కెట్ వాటాను మరింత పటిష్టం చేసుకుంది. ముఖ్యమైన మెట్రో నగరాల్లో, గ్రామీణ ప్రాంతాలలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఫలితంగా ఈ అంశంలో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని భారతి ఎయిర్‌టెల్‌ షాక్‌ ఇచ్చి టాప్‌లోకి దూసుకు వచ్చింది. ఈ మేరకు బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఈ నివేదికను వెల్లడించింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ డేటా ప్రకారం ముకేశ్‌ అంబానీ నేతృ‍త్వంలొని జియో సెప్టెంబర్ త్రైమాసికంలో బలమైన 348 బేసిస్ పాయింట్ల తో ఆర్‌ఎంఎస్‌ 35 శాతానికి చేరుకోగా, భారతి ఎయిర్‌టెల్ 32.1 శాతం ఆర్‌ఎంఎస్‌తో ఈ త్రైమాసికంలో 70 బీపీఎస్‌లు సాధించింది. అయితే మొదటి స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా సెప్టెంబరు త్రైమాసికంలో 66 బీపీఎస్‌, 27.2 శాతం క్షీణతను నమోదు చేసింది. మొత్తం 22 ప్రధాన మార్కెట్లతో 20 సర్కిల్స్‌లో మార్కెట్ వాటాను ...

మొబైల్ లవర్స్ కు బంపర్ ఆఫర్

చిత్రం
స్మార్ట్ ఫోన్స్ కంపెనీలు మొబైల్ లవర్స్ కు ఆఫర్ల మీద ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఆయా మొబైల్స్ తయారీదారుల కంపెనీల మధ్య కాంపిటీషన్ పెరిగి పోయింది. దీంతో వినియోగదారులు ఏది కొనాలో తెలియక టెన్షన్ కు తికమక పడుతున్నారు. ఆకట్టుకునే డిజైన్స్, లెక్కలేనన్ని ఫీచర్స్ తో మెస్మరైజ్ చేసేస్తున్నాయి. మొబైల్స్ లవ్లీ కలర్స్, వండర్ ఫుల్ లుక్స్ తో దుమ్ము రేపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్స్ మార్కెట్ లో ఏకంగా చైనాకు చెందిన కంపెనీల వాటా 50 శాతానికి ఉందంటే వాటి సత్తా ఏపాటిదో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఓ దిగ్గజ టెక్ సంస్థ ఇటీవల ఎక్కువగా అమ్ముడు పోతున్న మొబైల్స్ ఏవో ప్రకటించింది. వీటిలో ఒక్క శామ్ సంగ్, యాపిల్ కంపెనీలు వుంటే మిగతా ఎనిమిది స్థానాల్లో చైనా స్మార్ట్ ఫోన్స్ జాబితాలో చోటు దక్కించుకుని దిగ్గజ మొబైల్ కంపెనీలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాయి. తాజాగా వివో, షావో మీ, రియల్ మీ, టెక్నో, హువావే స్మార్ట్ మొబైల్స్ అమ్మకాల్లో దుమ్ము రేపుతున్నాయి. ఇండియన్ మార్కెట్ ను పరుగులు పెట్టిస్తున్నాయి. అటు ఆఫ్ లైన్ లో ఇటు ఆన్ లైన్ లో అమ్మకాలు లక్షల్లో ఉన్నాయి. దీంతో చైనా మొబైల్స్ అమ్మకాలకు చెక్ పెట్టేందుకు దిగ్గజ కంపెనీల...

గవర్నర్ తో సీఎం కీలక భేటీ

చిత్రం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు ఈ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ యాక్ట్‌, ఆర్టీసీ ప్రైవేటీకరణతో పాటు పలు అంశాలపై గవర్నర్‌తో కేసీఆర్‌ చర్చించారు. ప్రధానంగా ఆర్టీసీపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను కేసీఆర్‌ గవర్నర్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా కేసీఆర్‌ గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. తమిళిసై సౌందరరాజన్‌ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు రావడం ఇదే తొలిసారి. మేడం బాధ్యతలు చేపట్టాక ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. 26 డిమాండ్లతో సమ్మెకు దిగారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో, సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. స్వచ్చందంగా ముందు నిలిచారు. అప్పటి ఉద్యమ నాయకుడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచారు. సంస్థను కాపాడుకుంటామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ఈ సందర్బంగా జరిగిన మీటింగ్ లో సీఎం హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్టీసీలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ట్రేడ...

ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ

చిత్రం
ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల జేఏసీ మరోసారి వెనక్కి తగ్గింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కీలక ప్రకటన చేశారు. సమ్మె విరమిస్తున్నట్టు వెల్లడించారు. కార్మికులంతా విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. అలాగే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకు రావాలని కార్మికులకు సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అశ్వత్థామరెడ్డి చెప్పారు. డిపోల వద్దకు వెళ్లిన కార్మికులను అడ్డు కోవద్దని యాజమాన్యాన్ని కోరారు. కార్మికులదే నైతిక విజయమని ఆయన అభివర్ణించారు. ఈ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలువలేదని వ్యాఖ్యానించారు. అలాగే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఇక నుంచి విధులకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండగా ఉంటుందని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థను రక్షించడంతో పాటు, కార్మికుల హక్కుల రక్షణ కోసమే పోరాటం చేశామని ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించిన కార్మికులకు, రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది పోరాటానికి నాంది మాత్రమేనని పేర్కొన్నారు. హైకోర్ట...

దిగ్గజ కంపెనీలు డీలా..చైనా కంపెనీలు భళా

చిత్రం
ప్రపంచాన్ని స్మార్ట్ ఫోన్స్ శాసిస్తున్నాయి. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, అపరిమితమైన వేగంతో డేటా అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు మొబైల్స్ వాడడం తప్పనిసరిగా మారింది. ఎన్నో కంపెనీల మొబైల్స్ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా పలు బ్రాండ్ కంపెనీల మొబైల్స్ తమ హవాను చెలాయిస్తున్నాయి. మొత్తం టాప్ టెన్ స్మార్ట్ ఫోన్స్ లలో చైనాకు చెందిన కంపెనీల మొబైల్స్ ఎక్కువగా చోటు సంపాదించుకున్నాయి. ఇదే కంట్రీకి చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ టెక్నో టాప్ వన్ లో నిలిచింది. మొత్తం అమ్మకాల్లో మార్కెట్ షేర్ ను కూడా ఈ కంపెనీ పెంచుకుంది. గత ఏడాది మూడో త్రైమాసికంలో ఈ సంస్థకు చెందిన 46 లక్షల ఫోన్లు అమ్ముడు పోగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. దాదాపు ఆరు లక్షలు ఎక్కువగా అమ్ముడయ్యాయి. అలాగే మార్కెట్ షేర్ లో వాటా కూడా 1.2 నుంచి 1.3 నుంచి పెరిగింది. ఇండియన్ మార్కెట్ పై టెక్నో దృష్టి పెడితే మరింత ఆదాయాన్ని పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. యాపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీలు హవా కొనసాగినా టెక్నో మొబైల్స్ అమ్మకాలను అడ్డు కోలేక పోయాయి. తన స్థానాన్ని మాత్రం ఈ కంపెనీ కోల్పోలేదు. మరో వైపు దక్షిణ కొరియాకు చెందిన ది...