సుభాష్ చంద్ర గుడ్ బై

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఛైర్మన్‌ సుభాష్ చంద్ర తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి రానుంది. అయతే బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఆయన కొనసాగనున్నారు .అలాగే ఆయనతో పాటు పునీత్‌ గోయంకా కూడా ఎస్సెల్‌ గ్రూపు ప్రతినిధులుగా బోర్డులో కొనసాగుతారు. కొత్తగా ఏర్పాటైన జీ బోర్డు ఆరుగురిని ఇండిపెండెంట్‌ డైరెక్టర్లగా నియమించుకుంది. వాటాదారుల మార్పుల దృష్ట్యా, సుభాష్ చంద్ర  చేసిన రాజీనామాను బోర్డు అంగీకరించింది. తాజా ఒప్పందం ప్రకారం, రెగ్యులేషన్ 17 ఎల్‌బీ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

మరోవైపు సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ మానిటరీ అథారిటీ తమ మొత్తం హోల్డింగ్‌ను 8.44 శాతానికి పెంచిందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. నవంబర్ 21 న జీల్‌లో  2.9 శాతానికి సమాన మైన మొత్తం 2.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జీ 16.5 శాతం వాటాను ఇన్వెస్కో ఒపెన్‌ హైమర్ ఫండ్‌కు 4,224 కోట్లకు విక్రయించ నున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విక్రయం ద్వారా సమ కూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించు కోనుంది. ఈ 16.50 శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్‌సీ గ్లోబల్‌ చైనా ఫండ్‌కు 2.3 శాతం వాటాను విక్రయించనుంది.

ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిటెడ్ లో 8.7శాతం వాటాను కలిగి ఉంది. ఆసియాలోనే మొట్ట మొదటి సారి సాటిలైట్ ఛానల్స్ ను ప్రవేశ పెట్టిన ఘనత జీ టెలివిజన్ గ్రూప్ దే. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సుభాష్ చంద్ర మొదట్లో బియ్యం వ్యాపారం చేశారు. అనుకోని రీతిలో వినోద రంగంలోకి ఎంటర్ అయ్యారు.  మీడియా మొఘల్ గా పేరు పొందారు. దేశమంతటా జీ గ్రూప్ ను విస్తరించేలా చేశారు. తెలుగు వాకిట జీ టీవీ ఓ సంచలనం. జీ గ్రూప్ కు కోట్లాది ఆదాయాన్ని సమకూర్చి పెట్టాడు. ఇప్పుడు పోటీ తీవ్రం కావడంతో జీ కొంత మేర నష్టాలను చవి చూసింది. అయినా దెబ్బ తిన్న పులిలా సుభాష్ చంద్ర ఓటమిని ఒప్పుకోరు. ఆయనకు గెలవడం అంటే సరదా.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!