చిన్మయి సీరియస్ కామెంట్స్
సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ సెలెబ్రెటీగా పేరొందిన ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఏది మాట్లాడినా, లేదా ఏదైనా పోస్టు చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో, పడుతున్నారో ఇటీవలే చెప్పింది. అంతే కాదు సినీగేయ రచయిత వైరముత్తు పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గొప్ప సింగర్ గా ఉన్న చిన్మయి సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తుంది. అంతే కాకుండా బాధితులకు మద్దతుగా తాను నిలబడుతుంది. దీంతో ఆమె ఫైర్ బ్రాండ్ విమెన్ గా పేరు తెచ్చుకున్నారు.
తాజాగా మగాళ్లు ఆడవాళ్ళ విషయంలో చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యింది. మగాళ్ల చూపులన్నీ మహిళల వక్షోజాలపైనే ఉంటుందా అంటూ ప్రశ్నించింది. ఓ మహిళ ఎదుర్కొన్న షాకింగ్ ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఓ యువతి వద్దకు వెళ్లాడు. అయితే ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన ఆ యువతిని చూసి అన్నీ కనిపిస్తున్నాయి చున్నీ కప్పుకోండి అన్నాడట. దీంతో ఆమెకు ఒళ్లుమండింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి పేర్కొంది. స్విగ్గీ.. మీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి పని వారు చేసుకుంటే మంచిది అని చెప్పండి.
మీ సంస్థకు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ పార్సిల్ ఇవ్వడానికి వచ్చి చున్నీ కప్పుకో అని నాకు చెప్పి సలహా ఇచ్చి వెళ్తున్నాడు. నా ఇంట్లో నేను ఎలా ఉండాలో చెప్పడానికి అతను ఎవరు. అసలు నేనెలా ఉంటే ఏమిటి. వారికి ఇతరులతో ఎలా నడుచుకోవాలో కూడా మేమే నేర్పించాలా అని మండిపడింది. కొద్ది సేపట్లోనే ఆమె ట్వీట్ వైరల్ అయింది. కొందరు నెటిజన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తే మరికొందరు కామెంట్స్ చేశారు. తనను ఎగతాళి చేస్తున్న వారిపై స్పందిస్తూ..ఈ ఘటన గురించి ఎవరైనా జోక్‌గా కామెంట్లు చేస్తే అందరినీ బ్లాక్ చేస్తాను అని బెదిరించింది.
ఈ ట్వీట్స్‌పై చిన్మయి శ్రీపాద ఘాటుగా స్పందించారు. ఆ మహిళకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేశారు. మహిళల వక్షోజాలను చూసే మగాళ్లను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, వారు చిన్నప్పుడు తల్లి వద్ద పాలు తాగి ఉండరు. ఓ మహిళ చున్నీతో తన ఒళ్లు కప్పు కోకపోతే వాటి వల్లే రేప్స్ జరుగుతాయి అనుకుంటారు. కొంతమంది డెలివరీ ఏజెంట్‌ను సపోర్ట్ చేస్తున్నారు. ఒక డెలివరీ ఏజెంట్‌కు అతను ఫుడ్ తీసుకెళ్లే ఇళ్లన్నీ ఆఫీసులతోనే సమానం. మన దగ్గర డ్రైవర్‌గా, సర్వెంట్స్‌గా పని చేసే వారికి మన ఇళ్లు ఆఫీసులే అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి