మనోళ్లకు అండగా నిలుద్దాం

ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీం ఫైనల్ కు రావడం. ఒకప్పుడు వాళ్లు ఆడుతున్నారంటే పట్టించుకునే వాళ్లం కాదు. కపిల్ దేవ్, అజారుద్దీన్, సచిన్, గంగూలీ నుంచి నేటి కోహ్లి దాకా అంతా వాళ్ల గురించిన చర్చనే. ఇదే సమయంలో ఒక్కసారిగా హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ వచ్చాక భారతదేశంలో మహిళా క్రికెట్‌కు మరింత ఆదరణ పెరిగేలా చేసింది. క్రికెట్ అంటేనే పురుషులకు మాత్రమే చెందిందని అనుకునే రోజుల నుంచి ఇపుడు ప్రపంచమంతా మహిళలు కూడా ధీటుగా, ధాటిగా ఆడగలరని నిరూపించారు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏకంగా వారి కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. వాళ్లకు కాంట్రాక్టు సిస్టం ను ఇంట్రడ్యూస్ చేసింది. గంగూలీ బీసీసీఐ చీఫ్ అయ్యాక క్రికెట్ ఆటలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పాలనా పరంగా కొత్త పుంతలు తొక్కించాడు ఈ మాజీ క్రికెటర్. భారత దేశ ప్రధానమంత్రి నుంచి అంతా మన మహిళా జట్టు గెలవాలని కోరుకున్న వారే. కానీ సీన్ రివర్స్ అయింది. ఇండియా జట్టు భారీ తేడాతో ఓడిపోయింది. దీనికి బాధ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లో...