పోస్ట్‌లు

డిసెంబర్ 22, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అంతిమ పోరులో అద్భుతం

చిత్రం
విండీస్ పై అసాధారణ రీతిలో టీమిండియా విజయం సాధించినా అంతిమంగా ఇరు జట్లు సమ ఉజ్జీగా గెలుపు కోసం చివరి వరకు పోరాడాయి. నువ్వా నేనా అన్న రీతిలో గెలుపు దోబూచులాడింది. ఈ ఉత్కంఠ పోరులో ఇండియా తమ ముందు ఉంచిన బిగ్ టార్గెట్ ను ఈజీగా ఛేదించింది. ప్రత్యర్థి జట్టు కూడా తానేమీ తీసి పోనంటూ అద్భుతమైన రీతిలో ప్రదర్శించింది. ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. చివరి మూడో వన్డే మాత్రం మరింత పోటీని పెంచింది. చివరకు ఇండియా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 316 పరుగులు చేసింది. బరిలోకి దిగిన ఇండియా 48.4 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 89 బంతుల్లో 77 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 63 బంతుల్లో 63 పరుగులు చేశాడు. వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టక మైదానం లోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.   కేవలం 81 బంతుల్లో 85 పరుగులు చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఉన్నట్టుండి కోహ్లీ అవుటయ్యాడు. ఈ సమయంలో ఫాస్ట్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశ...

జయహో సుందర్ పిచాయ్

చిత్రం
ప్రపంచం ఇప్పుడు గూగుల్ జపం చేస్తోంది. అది లేకుండా ఈ లోకాన్ని చూడలేం. వినలేం. మనల్ని మనం పరిచయం చేసుకోవాలన్నా, ఏ విషయమైనా సరే నిమిషాల్లో కావాలంటే వెంటనే కోట్లాది మందిని ప్రభావితం చేసేది ఈ సెర్చింగ్ దిగ్గజ కంపెనీదే. ఈ అమెరికా ఐటీ కంపెనీ ఇప్పుడు వరల్డ్ లోనే మోస్ట్ టాప్ వన్ గా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో దీనిని దాటి వెళ్లేందుకు మిగతా దిగ్గజ కంపెనీలు సైతం ప్రయత్నం చేస్తున్నాయి. అయినా గూగుల్ తో పోటీపడలేక పోతున్నాయి. ఎందుకంటే గూగుల్ ప్రపంచం కంటే ముందు వరుసలో ఉంటోంది. ఏ కంపెనీ తన దరిదాపుల్లోకి అల్లంత దూరంలో నిలిచి ఉన్నది. దీనిని అందు కోవాలంటే ఇప్పుడు కష్ట సాధ్యమైన పని. గూగుల్ కంపెనీకి ఇండియాకు చెందిన చెన్నై కుర్రాడు సుందర్ పిచాయ్ సిఇఓ గా ఉన్నారు. ఇప్పటికే సుందర్ వరల్డ్ లోనే అత్యంత ఎక్కువ వేతనం తీసుకుంటున్న ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాదు వేతన జీవుల్లో టాప్ వన్ గా నిలిచి అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నాడు. ప్రస్తుతం గూగుల్ కె కాకుండా సుందర్ ఆల్ఫా బెట్ ఐటీ కంపెనీకి సైతం సిఇఓగా కొనసాగనున్నాడు. అత్యంత శక్తి మంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా నిలిచిన పిచాయ్‌ ఇపుడు అతి పెద్ద స్టాక్...

మళ్ళీ మెరిసిన మహానటి

చిత్రం
పాలమూరు కుర్రాడు నాగ్ అశ్విన్ ఎంతో మనసు పెట్టి అలనాటి నటీమణి సావిత్రి కోసం తీసిన మహానటి మళ్ళీ మెరిసింది. సినీ రంగానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతి అవార్డు, పురస్కారం కోసం ఎంతో వేచి చూస్తారు. ప్రతి సినీ టెక్నీషియన్ కోరిక కూడా ఇదే. ద‌క్షిణాది చ‌ల‌న చిత్ర‌ సీమ‌కు చెందిన ప్రతిష్టాత్మక అవార్డుల‌లో ఫిలిం ఫేర్ ఒక‌టి. ఎంతో ఉన్నతంగా భావించే ఈ అవార్డుల కార్య‌క్ర‌మం చెన్నైలో జ‌రిగింది. నటీ నటులు సందీప్‌ కిష‌న్‌, రెజీనా ఈ వేడుక‌కి వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. 2018లో ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన ప‌లు సినిమాలు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఈ అవార్డుల‌ను అందించారు. తెలుగులో 2018 ఏడాదికి గానూ మ‌హాన‌టి ఉత్త‌మ‌ చిత్రంగా ఎన్నికైంది. ఇక నటుడు రామ్ చరణ్ సినీ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా భావించే సుకుమార్ దర్శకత్వంలో నటించిన రంగస్థలం అద్భుత ప్రదర్శనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా అవార్డుల పరంగా చూస్తే, బెస్ట్ సినిమా కేటగిరీలో మహానటి సినిమాను ఎంపిక చేసింది అవార్డుల ఎంపిక కమిటీ. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, ఉత్తమ నటి గా మహానటి సినిమాలో నటించి మనసు దోచుకున్న కీర్తి సురేష్ ను అవార్డు...

పీకే సెన్సేషన్ కామెంట్స్

చిత్రం
పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మరోసారి పొరసత్వ సవరణ చట్టంపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యూహకర్త ఇదే అంశంపై మరింత ఎక్కువగా స్పందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటికే పలువురు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండి పడుతున్నారు. ఉన్నత విద్యాలయాలలో అల్లకల్లోలం జరుగుతోంది. విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ చట్ట సవరణ పూర్తి భారత రాజ్యాంగానికి, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ ఆందోళన బాట పడ్డారు. అన్ని వర్గాల ప్రజలు సైతం నిరసన స్వరం వినిపిస్తున్నారు. తాజాగా నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌, పౌరసత్వ సవరణ చట్టంపై ప్రశాంత్‌ కిషోర్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఎన్‌ఆర్‌సీ అడ్డు కోవటం కోసం ప్రజలు, రాజకీయ నాయుకులు రెండు బలమైన మార్గాలను ఎంచుకోవాలని పీకే సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఓ వైపు తమ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే ఆ పార్టీఐకి చెందిన వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ మాత్రం తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆ...