మళ్ళీ మెరిసిన మహానటి
పాలమూరు కుర్రాడు నాగ్ అశ్విన్ ఎంతో మనసు పెట్టి అలనాటి నటీమణి సావిత్రి కోసం తీసిన మహానటి మళ్ళీ మెరిసింది. సినీ రంగానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతి అవార్డు, పురస్కారం కోసం ఎంతో వేచి చూస్తారు. ప్రతి సినీ టెక్నీషియన్ కోరిక కూడా ఇదే. దక్షిణాది చలన చిత్ర సీమకు చెందిన ప్రతిష్టాత్మక అవార్డులలో ఫిలిం ఫేర్ ఒకటి. ఎంతో ఉన్నతంగా భావించే ఈ అవార్డుల కార్యక్రమం చెన్నైలో జరిగింది. నటీ నటులు సందీప్ కిషన్, రెజీనా ఈ వేడుకకి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 2018లో ప్రేక్షకుల మన్ననలు పొందిన పలు సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను అందించారు.
తెలుగులో 2018 ఏడాదికి గానూ మహానటి ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. ఇక నటుడు రామ్ చరణ్ సినీ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా భావించే సుకుమార్ దర్శకత్వంలో నటించిన రంగస్థలం అద్భుత ప్రదర్శనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా అవార్డుల పరంగా చూస్తే, బెస్ట్ సినిమా కేటగిరీలో మహానటి సినిమాను ఎంపిక చేసింది అవార్డుల ఎంపిక కమిటీ. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, ఉత్తమ నటి గా మహానటి సినిమాలో నటించి మనసు దోచుకున్న కీర్తి సురేష్ ను అవార్డు వరించింది. సినీ విమర్శకులు ఎంపిక చేసిన ఉత్తమ నటి, నటుడు గా గీత గోవిందం సినిమా నుంచి రష్మిక మందాన, మహానటిలో నటించిన దుల్కర్ సల్మాన్ ను ఎంపిక చేసింది.
అత్యుత్తమ దర్శకుడిగా మహానటి సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ అందుకోగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ సహాయ నటుడిగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలో నటించిన జగపతి బాబు, ఉత్తమ సహాయ నటిగా రంగస్థలం సినిమాలో నటించిన అనసూయ అందుకున్నారు. మరో వైపు ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాంగ్ ఎంత సక్కా గున్నావే రాసిన చంద్ర బోస్ ఉత్తమ గేయ రచయితగా అవార్డు అందుకున్నారు. బెస్ట్ సింగర్ గా గీత గోవిందం సినిమాలో ఇంకేం ఇంకేం కావాలె పాట పాడిన సిద్ శ్రీరామ్, ఉత్తమ గాయనిగా భాగమతి సినిమాలో పాట పాడిన శ్రేయా ఘోషల్ పురస్కారం అందుకుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి