విప్లవ ధృవతార..ఈ తరం చేగువేరా

నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన యోధుడు. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా మారిన ధీరుడు. జనం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మానవుడు. తెలంగాణ మాగాణంపై మరిచి పోలేని చరిత్రకు నాంది పలికిన నాయకుడు. తాను దారుణ హత్యకు గురై 47 ఏళ్ళు అవుతున్నా, కొన్ని తరాలు గడిచినా, నాలుగు దశాబ్దాలు పూర్తయినా నేటికీ జార్జి రెడ్డి ప్రజల గుండెల్లో ప్రవహిస్తూనే వున్నాడు. జనాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. ఆయన మరణం లక్షలాది మందికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉన్నది. ఇంతలా వెంటాడుతున్న ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం నేటికీ ఉందంటూ మేధావులు, ప్రజాస్వామిక వాదులు చెబుతూనే వున్నారు. తాజాగా జార్జి రెడ్డి మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు టాలీవుడ్‌లో వీరుల కథల ట్రెండ్ నడుస్తోంది. తొలి స్వాతంత్ర్య సమర యోధుడు నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తీసిన సైరా నరసింహారెడ్డి చిత్రం సక్సెస్ సాధించింది. ప్రస్తుతం అదే కోవలో విప్లస్ఫూర్తి కలిగిన, మనం మరిచి పోయిన వీరుడు జార్జి రెడ్డి కథను దళం డైరెక్టర్ జార్జి రెడ్డి పేరుతో సినిమా తీశాడు. భగత్ సింగ్, చెగువేరా, మార్క్స్ పుస్తకాలు చదివాడు. అన్యాయాన్ని ప్రశ్నించాడు. న్యాయం కోసం నిలబడ్డాడు. సిద్ధాం...