ట్రావెలర్స్ కోసం నిఘా యాప్


ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా, టెక్నాలజీలో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నా మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల లైంగిక వేధింపులు మరీ ఎక్కువై పోయాయి. తాజాగా డ్యూటీల కోసం ప్రతి ఒక్కరు ప్రైవేట్ రూట్ ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. కాగా క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ అడపా దడపా ఫిర్యాదులు వస్తున్న విషయం తెల్సిందే. విదేశాల్లో డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీల నెట్‌వర్క్‌ కలిగిన ‘ఉబర్‌’ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టబోతోంది. అదే వాయిస్‌ ఆడియో రికార్డింగ్‌ ఫీచర్‌. ఎందుకంటే డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడం కోసం. దీన్ని ముందుగా ప్రయోగాత్మకంగా వచ్చే నెల నుంచి లాటిన్‌ అమెరికా దేశాల్లో ప్రవేశ పెట్టి, ఆ తర్వాత అమెరికాకు విస్తరిస్తామని ఉబర్‌ యాజమాన్యం తెలిపింది. కారులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ ఫీచర్‌ ఉపయోగ పడుతుందని పేర్కొంది.

అదే విధంగా ఈ ఆడియో రికార్డింగ్‌ డ్రైవర్‌కు గానీ, ప్రయాణికులకు గానీ అందుబాటులో ఉండదని, ట్రిప్పు ముగియ గానే ప్రయాణం సౌకర్యంగానే జరిగిందా, అన్న ప్రశ్న ప్రయాణికులకు వెళుతుందని, వారి నుంచి సానుకూలమైన సమాధానం వచ్చి నట్లయితే ఆడియో స్క్రిప్టును ప్రయాణికుల మాటలను విశ్లేషించే అనుబంధ ఏజెంట్‌కు పంపుతారని, ప్రయాణికులకు, డ్రైవర్‌ మధ్య ఇబ్బందులు, ఘర్షణ పరిస్థితి ఏర్పడితే పోలీసులకు అంద జేయడం కోసం ఆడియో రికార్డింగ్‌ను భద్ర పరుస్తామని ఉబర్‌ యాజమాన్యం వెల్లడించింది.

అనవసరంగా ఎవరి ప్రైవసీని దెబ్బ తీయమని తెలియ జేసింది. అమెరికాలో ప్రజల ప్రైవసీకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు చట్టాలున్నాయని, డ్రైవర్, ప్రయాణికుల మాటలను రికార్డు చేయాలంటే వారిరువురి అనుమతి తప్పనిసరని మీడియా ఉబర్‌ యాజమాన్యం దృష్టికి తీసుక పోగా, అప్పటికీ ఒకే జాతీయ చట్టం రావచ్చేమోనని వ్యాఖ్యానించింది. ప్రయోగాత్మకంగా అమెరికాలో కూడా ఆడియో రికార్డింగ్‌ ఫీచర్‌ విజయవంతం అయితే ఇతర దేశాలకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని యాజమాన్యం వెల్లడించింది.

కామెంట్‌లు