లోకల్ పాలనకే పవర్స్ .. అధికారాల బదలాయింపు..త్వరలో ఖాళీల భర్తీ..!

పల్లెల్లో పాలనకు పూర్తి పవర్స్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు . అంతే కాకుండా అధికారాల బదలాయింపు పూర్తిగా అప్పగిస్తామని పేర్కొన్నారు . నిధులు మంజూరు, పోస్టుల కుదింపు , విధులు , బాధ్యతలు కూడా తేల్చుతామని స్పష్టం చేసారు . గ్రామ పంచాయతీలు , జిల్లా పరిషత్ లు , మండల పరిషత్ లు నామ్ కె వాస్తేగా ఉన్నాయని, , వాటిని ప్రక్షాళన చేస్తే కానీ పాలన గాడిన పడదని అందుకే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఏయే పోస్టుల్లో ఎవరెవరు ఉండాలి , వారికి ఎలాంటి భాద్యతలు ఉండాలో కూడా నిర్ణయమిస్తామని తెలిపారు . కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ చట్టం వల్ల గ్రామాలు , మండలాలు , జిల్లా పరిషత్ లు మరింత బలోపేతం అవుతాయని కేసీఆర్ చెప్పారు .దీంతో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తి పారదర్శకత ఉండటం వల్ల పని చేసే వారికి ఇలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు , సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయో లేవో చూసేందుకు మానిటరింగ్ వ్యవస్థ చూసుకుంటుందన్నారు. ఈ మేరకు 60 రోజుల పాటు కొత్తగా కార్యాచరణ ప్రణాలికను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రోగ్రాం వల్ల...