పార్టీకి పట్టం ..అమ్మకే అందలం
ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీకీ సోనియా గాంధీనే దిక్కయ్యింది. నిన్నటి దాకా తమ కుటుంబీకులు ఎవ్వరూ పార్టీ పగ్గాలు తీసుకునే పరిస్థితుల్లో లేమంటూ తల్లీ , కొడుకు , కూతురు స్పష్టం చేసారు. ఆమె గతంలో అదే పార్టీకి పూర్తిగా బాధ్యతలు చేపట్టారు. వయసు మీద పడటం, భాద్యతలు పెరగడంతో ఆమె అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు . తన కుమారుడు రాహుల్ గాంధీకి పదవిని కట్టబెట్టారు .రాహుల్ హయాంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకు వస్తారని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందింది. ఏకంగా పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదాను సైతం అందుకోలేక పోయింది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు .ఆయన నిర్ణయాన్ని తాము ఒప్పుకోబోమంటూ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు , సీనియర్లు స్పష్టం చేశారు.
సోనియా కుటుంబం నుంచి రాహుల్ గాంధీ కాకపోయినా కనీసం ప్రియాంకా గాంధీ కి పగ్గాలు ఇవ్వాలని మరి కొంత మంది కోరారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అమెధీలో రాహుల్ ఒడి పోగా . యూపీలో ప్రియాంక గాంధీ స్వతహాగా ప్రచారం చేసినా ఫలితం లేక పోయింది . జనం కాంగ్రెస్ పార్టీని ఆమోదించలేదు . ఘోరంగా తిరస్కరించారు .గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంత మేర రాహుల్ గాంధీ పార్టీని ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నం చేసారు. కానీ అది వర్కవుట్ కాలేదు . అడుగడుగునా పార్టీకి చెందిన పెద్దాలు అడ్డు పడ్డారు . ఆ పార్టీలో సీనియర్లే ఎక్కువగా ఉండటం తో కింది స్థాయిలో యువత ను పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో కొన్ని రాజులుగా అతి పెద్ద కేడర్ కలిగిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ లేకుండానే గడిచింది . ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక పార్టీకి పెద్ద దిక్కు అవసరం ఏర్పడింది .
పార్టీ అత్యవసర సమావేశం జరిగింది .
ఈ సమావేశం వాడిగా వేడిగా జరిగింది . రాహుల్ గాంధీ ఉండాలని సభ్యులు పట్టుబట్టారు . కానీ అందుకు తల్లీ , కొడుకు ఒప్పుకోలేదు . వారు అర్దాంతరంగా సమావేశం నుండి వెళ్లి పోయారు . రాత్రి 11 గంటల దాకా మీటింగ్ జరిగింది . తాను పగ్గాలు చేపట్టే స్థితిలో లేనని రాహుల్ జి స్పష్టం చేశారు . ఇక అన్నింటికీ అమ్మే అయినా సోనియా గాంధీకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని సభ్యులు తీర్మానం చేసారు . గడ్డు పరిస్థితుల్లో గట్టెక్కించే భాద్యతను తల్లి చేతుల్లో పెట్టారు. పార్టీని బలోపేతం చేసేందుకు సీనియర్లతో కమిటీలు ఏర్పాటు చేసారు . నార్త్ ఈస్ట్ కు అహ్మద్ పటేల్ , అంబికా సోని , హరీష్ రావత్ , కేసీ వేణు గోపాల్ , తరుణ్ గొగోయ్ కుమారి సెల్జా ఉండగా నార్త్ లో ప్రియాంకా గాంధీ , జ్యోతిరాదిత్యా , చిదంబరం ఉన్నారు . వెస్ట్ లో ఆజాద్, ఖర్గే , మోతీలాల్ ఓరా , సౌత్ లో మన్మోహన్ సింగ్ , ఆనంద్ శర్మ , ముకుల్ వాస్నిక్ , ఈస్ట్లో గెహ్లాట్ , సచిన్ , భాగేల్ , నారాయణ సామిని ఎంపిక చేసారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి