పోటెత్తునున్న వరదలు..పొంగుతున్న నదులు..నిండుకుండలా ప్రాజెక్టులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు జనం విలవిలలాడి పోతున్నారు. భారీగా వస్తున్న వరద నీటికి ప్రాజెక్టులు జలకళను సంతరించు కున్నాయి . తుంగభద్ర ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది జూరాల ప్రాజెక్ట్ ఇప్పటికే నిండి పోయింది . దీంతో నీటిని దిగువకు వదిలారు . మరో వైపు గోదావరి ఉగ్ర రూపం దాల్చింది . భద్రాచలం వద్ద రెండో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. కృష్ణమ్మ నీటితో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పోయింది . నాలుగు గేట్లను తెరిచారు . అక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. నాగార్జున సాగర్ కు నీళ్లు ప్రవహిస్తున్నాయి .
అది కూడా రెండు మూడు రోజుల్లో నిండుకునే వీలుంది . తెలంగాణ, ఏపీలలో విస్తారంగా వర్షాలు కురిశాయి . ఇంకొన్ని చోట్ల వానలు పడుతున్నాయి . ఇక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తో పాటు ఉత్తరాదిన నదులు పొంగి పొర్లుతున్నాయి. అకాల వర్షాల దెబ్బకు దేశ వ్యాప్తంగా 50 మందికి పైగా మృతి చెందారు. మరి కొన్ని చోట్ల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది . ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది . ఆల్మట్టి , నారాయణపూర్ ల నుండి జూరాల ప్రాజెక్ట్ కు 6 లక్షల 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది . 6 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం కు వదులుతున్నారు . జూరాల ఎడమ, కుడి కాలువలకు నీటిని వదిలారు .
మరో వైపు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది . నీరు సమృద్ధిగా ఉండడంతో భీమా -1 , భీమా -2 కు నీటిని వదిలారు . నెట్టెంపాడు, కోయిల్ సాగర్ కు కూడా నీళ్లను వదిలారు . కుర్షిణా నది ప్రవాహం పెరగడంతో నాదీ పరివాహక ప్రాంతాల దగ్గర ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు . వరద ఉధృతి పెరగడంతో సాగర్ కు వెళ్లే లాంచీలను నిలిపి వేశారు . నిన్నటి దాకా నీటి కోసం అల్లాడిన జనం ఇప్పుడు వరదల దెబ్బకు ఇక వానలు ఆగి పోతే బావుండునని కోరుతున్నారు . రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులు , ఎట్టి పోతల పథకాలు నీళ్లతో నిండి పోయాయి . కృష్ణా , గోదావరి నదుల తాకిడి పెరగడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి