పాలమూరు పోరగాడు..పల్లెపాటల్లో మొనగాడు - జంగిరెడ్డి గానం జానపదమే ప్రాణం..!

పొలమారిన పాలమూరు జిల్లా తరాలు మారిన బతుకు సిత్రం మారలె. కానీ ఈ ప్రాంతం పోరాటాలకు పెట్టింది పేరు. చైతన్యానికి ..కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టే ధీరోదాత్తులను కన్నది ఈ నేల. ఎందరో మహానుభావులు ..మరికొందరు ఈ భూమి మీద లేకుండా పోయారు. కవులు, కళాకారులు, గాయనీ గాయకులు, రచయితలు, మేధావులు..జర్నలిస్టులు, అధ్యాపకులు, ఆర్టిస్టులు, నాటక ప్రయోక్తలు, గ్రాఫిక్ డిజైనర్లు.సాధువులు, యోగులు, ఆధ్యాత్మిక వేత్తలను ఈ ప్రాంతం నుండి వచ్చారు. తమ ప్రతిభకు పదును పెడుతూ..సృజనాత్మకతకు ప్రాణం పోస్తూ ..తమ పుట్టిన ఈ గడ్డకు ఎనలేని పేరు తీసుకు వస్తున్నారు. పల్లె పాటలకు పెట్టింది పేరు ఈ నేల. ఈ జాగలో దమ్ముందు..ధైర్యం ఉంది..అంతకంటే ఎనలేని ఆర్ద్రత ఉన్నది. మట్టి పొరల్లో ఇంకి పోయిన దుఖఃం గడ్డ కట్టుకు పోయి ఉన్నది. సంచార జీవులు..పకీర్లు..పీర్ల పండుగలో అలయి బలయిలు ..మైసమ్మలు..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పల్లె జానపదుల్లో లీనమై పోయింది. కళలకు ..పాటలకు ..జనపదాలకు..పెట్టింది పేరు పాలమూరు. ఎందరో కళాకారులు తమ ఆట పాటలతో ఆకట్టుకుంటున్నారు. తమదైన శ...