ట్రబుల్ షూటర్ కు సోనియా పరామర్శ

దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. ఒకప్పుడు అధికారాన్ని చెలాయించిన ఈ పార్టీకి చెందిన అతిరథ మహారథులు, దిగ్గజ నాయకులు ఒక్కరొక్కరు పార్టీని వీడడమో లేదా అరెస్టులు కావడమో జరుగుతోంది. పార్టీని ఒకే తాటిపైకి తీసుకు రాగలిగే నాయకత్వ లేమి కొరవడింది. దేశ మంతటా కాషాయ జెండాలు రెపరెప లాడుతున్నాయి. మోడీ చరిష్మా ముందు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీల ఇమేజ్ ఏ మాత్రం పని చేయడం లేదు. ఇప్పటికే రెండు మూడు చోట్ల తప్పా ఎక్కడా కాంగ్రెస్ పవర్ లో ఉన్న దాఖలాలు లేవు. రాహుల్ గాంధీ తోనైనా కాంగ్రెస్ గట్టెక్కుతుందనుకుంటే ఏకంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిల పడింది. ఇక కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకోలేక పోయింది ఆ పార్టీ. ఊహించని ఓటమితో రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేసే పనిలో పడ్డారు. పార్టీ పరంగా వత్తిళ్లు రావడంతో తన మనసు మార్చుకున్నారు. ప్రస్తుతం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని తల్లి సోనియా గాంధీ కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో అదును...