మేం క్షేమం..అజ్ఞాతంలో లేం
కల్కి పేరుతో కలియుగంలో వెలసిన దేవుళ్లుగా ప్రచారం చేసుకుంటూ భక్తుల బలహీనతలు క్యాష్ చేసుకుంటూ కోట్లాది రూపాయలతో పాటు లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టి, ఆశ్రమాల పేరుతో అడ్డగోలు దందా చేపట్టిన ఆశ్రమ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. తాజాగా ఏకకాలంలో కల్కి ఆశ్రమాలపై ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. కోట్లాది రూపాయల నోట్ల కట్టలు, ఫారిన్ కరెన్సీ, కేజీల కొద్దీ ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్స్ బయట పడ్డాయి. ఐటీ శాఖకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించక పోవడం, సమర్పించిన వాటిలో తేడాలు రావడంతో ఐటీ రంగంలోకి దిగింది.
వారు విస్తు పోయేలా ఆశ్రమాలలో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు, విలువైన వస్తువులు దొరికాయి. తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వీరు అందుబాటులో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం ఓ వీడియోను విడుదల చేసింది. తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయ్‌కుమార్ దంపతులు పేర్కొన్నారు. తాము దేశం విడిచి వెళ్లి పోయామంటూ కథనాలు వస్తున్నాయని, కానీ, తాము వెళ్లలేదని, ఇక్కడే హాయిగా ఉన్నామంటూ వదంతులు నమ్మ వద్దని కోరారు. అయితే కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.
భక్తి ముసుగులో పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్కి ఆశ్రమంలో ఇటీవల జరిగిన ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిత్యం వివాదాలకు కల్కి ఆశ్రమాలు కేంద్రంగా మారాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు హైదరాబాద్ లోనూ కల్కి ఆస్తులపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో బంగారు బిస్కట్లు, ఆస్తులు, కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి