అశ్వత్థామ..ఆర్టీసీ ఆర్మీ

ఎవరీ అశ్వత్థామ రెడ్డి. నిన్న మొన్నటి దాకా కేవలం ఆర్టీసీకి సంబంధించిన కార్మికుల నాయకుడు. వృత్తి రీత్యా డ్రైవర్ . కానీ ఇప్పుడు తెలంగాణాలో విస్మరించలేని నాయకుడుగా ఎదిగాడు. అంతే కాకుండా వేలాది మంది కార్మికుల న్యాయపరమైన హక్కుల సాధన కోసం ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఢీకొంటున్నాడు. మొత్తం తెలంగాణాలో ఇప్పుడు టాప్ లీడర్లలో అశ్వత్థామ రెడ్డి ఒకరుగా నిలిచారు. గూగుల్ సర్చింగ్ లో సైతం మనోడి గురించే అధికంగా వెతుకుతున్నారు. ఇవ్వాళ తెలంగాణాలో నోరు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు. ఒక వేళ ఉన్నా కొంత మంది మాత్రమే నోరు మెదుపుతున్నారే తప్పా కేసీఆర్ తో నేరుగా ఢీకొనే స్థాయిలో లేరు. అయితే పోరాటానికి పెట్టింది పేరైన పాలమూరు జిల్లాకు చెందిన వారే కేసీర్ ను ఢీకొనడం యాదృచ్చికం అనుకోవాలి.

ప్రస్తుతం ఢీ అంటే ఢీ అంటూ ఇటు రాష్ట్రంలో అటు దేశంలో సెన్సేషన్ లీడర్లుగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. మోస్ట్ పాపులర్ లీడర్లుగా పేరొందిన వారిలో మొదటగా చెప్పు కోవాల్సింది రావుల చంద్ర శేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ భారత సింహ్మా రెడ్డి, ఎనుముల రేవంత్ రెడ్డి, వంశీ చందర్ రెడ్డి, థల్లోజు ఆచారి ఉండగా తాజాగా వీరందరి కంటే ఇటీవల మోస్ట్ పాపులర్ పర్సన్ గా, లీడర్ గా వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన  అశ్వత్థామ రెడ్డి ఎదిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ నాయకుడిగా, 49 వేల కార్మికులకు పెద్ద దిక్కుగా ఉన్నారు. అంతే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం , సీఎం కేసీఆర్ ఏ విధంగా కార్మికులను మోసం చేస్తున్నాడో, ఎలా సంస్థ ఆస్తులను ఇతరులకు అప్పగిస్తున్నాడో, ఎలా దోచుకుంటున్నారో వివరాలతో, ఆధారాలతో సహా బయట పెడుతున్నారు.

అంతే కాకుండా అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన ఘనత కూడా అశ్వత్థామ రెడ్డిదే. ఎవరికి వారే ఎమునా తీరే అన్న రీతిలో ఉండి పోయిన పార్టీలు, సంఘాలు తిరిగి ఒకే వేదికపైకి వచ్చేలా చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రస్తుత సర్కార్ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా సకల జనులను ఆయన కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న అన్యాయం గురించి దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశారు. ముఖ్యమంత్రి నియంతృత్వ పాలనపై ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని అయన పిలుపునిస్తున్నారు. ప్రైవేట్ బస్సుల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. అశ్వత్థామను నమ్ముకుని ఇవ్వాళ వేలాది మంది ఒకే ఒక్క మాట కోసం నిలబడ్డారు. అయన ఎప్పుడు పిలిచినా వస్తున్నారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ తాము సైతం సమిధలు అయ్యేందుకు రెడీ అంటున్నారు. మొత్తం మీద తెలంగాణాలో కేసీఆర్ ను ఢీకొనే మగాడుగా శ్వత్థామ రెడ్డి నిలిచారు.


కామెంట్‌లు