టాప్ పొజిషన్ లో ఐఐటి బాంబే

ఓ వైపు ఆర్ధిక మాంద్యంతో తల్లడిల్లుతున్న భారత్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు ఉన్నత విద్యను అందించడంలో ఆయా విశ్వ విద్యాలయాలతో పాటు ఐఐటీలు ఆశించిన దానికన్నా ఎక్కువగా ఆసక్తికరమైన ఫలితాలను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఐఐటీలు ప్రపంచ దేశాలను విస్తు పోయేలా చేస్తున్నాయి. నాణ్యమైన విద్యను బోధించడంలోనూ, వసతి సౌకర్యాలను కల్పించడం లోనూ అన్నిటికంటే ముందంజలో ఉన్నాయి. ఈ ఐఐటీలతో పాటు యూనివర్సిటీస్ కూడా తామేమి తీసి పోమంటూ విద్యా అభివుద్దిలో దూసుకు పోతున్నాయి.
వీటిలో చదివిన విద్యార్థులకు భారీ ప్యాకేజీలు ఇస్తూ నియమించుకుంటున్నాయి ఐటీ, కార్పొరేట్ కంపెనీలు.
ఇదిలా ఉండగా కోర్సులు పూర్తి కాకుండానే ఆయా ఇన్సిట్యూట్స్ దగ్గరకు వెళ్లి క్యాంపస్ సెలెక్షన్స్ చేసుకుంటున్నాయి. యూనివర్సిటీల మాటేమిటో కానీ ఇండియాలోని ఐఐటీలకు ఎనలేని డిమాండు ఉంటోంది. ఇందులో సీట్స్ రావాలంటే భారీగా ఖర్చు చేయడంతో పాటు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ చదువుకున్న వారు దేశాన్ని నిర్దేశించే స్థాయికి చేరుకుంటున్నారు. కోట్లాది మందిని ప్రభావితం చేసేలా తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. కాగా 2020 సంవత్సరానికి గాను క్యూఎస్‌ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో ఎప్పటి లాగే ఐఐటి బాంబే టాప్ లో మొదటి ప్లేస్ లో నిలిచింది. అయితే హెచ్‌సీయూ వరుసగా రెండోసారి టాప్‌ టెన్‌ జాబితాలో నిలిచింది.
ఐఐఎస్‌సీ బెంగళూరు రెండో స్థానం చేజిక్కిచ్చు కోగా ఐఐటీ ఢిల్లీ మూడో స్థానం పొందింది. హెచ్‌సీయూ 8వ స్థానం సాధించింది. దేశంలోని వంద విద్యా సంస్థలను పరిశీలించి ర్యాంకింగ్స్‌ ఇచ్చారు. స్టాఫ్‌ విత్‌ పీహెచ్‌డీ కేటగిరీలో బెస్ట్‌ స్కోర్‌ ఇండికేటర్‌ను హెచ్‌సీయూ సాధించడం మరో విశేషం. ఈ ర్యాంకింగ్స్‌లో ముఖ్యంగా ఫ్యాకల్టీ, స్టూడెంట్స్‌లో 26.9 పాయింట్లు, ఫర్‌ ఫ్యాకల్టీ లో 40.5, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ 3.4, ఇంటర్నేషనల్‌ ఫ్యాకల్టీ 2.5, ఎంప్లాయర్‌ రెప్యూటేషన్‌ 5.3, అకాడమిక్‌ రెప్యూటేషన్‌లో 10.8 పాయింట్లు సాధించింది. వీటి ఆధారంగానే ర్యాంకింగ్స్‌ను ఖరారు చేసింది ఈ సంస్థ.

కామెంట్‌లు