ఏ దేవి వరము నీవు..!

ఎన్నిసార్లు విన్నా ఇంకా ఏదో మిగిలే ఉంటోందన్న భావన నిలవనీయడం లేదు. సంగీతానికి ..పాటకు ఎనలేని శక్తి ఉంది. జనాన్ని సమ్మోహితులను చేసి..జాగృతం చేసి..నిద్రలోకి జారుకునేలా చేసే మహత్తు ఒక్క పాటకే ఉందనేది కాదనలేని సత్యం. తెలుగు సినిమా సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన గేయ రచయితలలో వేటూరి సుందర రామ్మూర్తి తర్వాతే ఎవరైనా. ఆ కలంలోంచి వచ్చిన ప్రతి పాటా ఓ ఆణిముత్యమే. లలితమైన పదాలతో ..అద్భుతమైన అర్థాన్ని ఇమిడేలా చేయగల సత్తా ఆయనకు మాత్రమే ఉన్నది. భౌతికంగా మనమధ్య లేక పోయినా ఆ మహానుభావుడు సృష్టించిన పాటలు అన్నీ ఇన్నీ కావు. కాశీనాథుని విశ్వనాథ్ ఓ సీత కథ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆయన కలం వెనుతిరిగి చూడలేదు. వేల పాటలు రాశారు. తొలినాళ్లల్లో పాత్రికేయుడిగా పనిచేసిన వేటూరి 8 నందులతో పాటు ఒక జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన ఘనత వేటూరిదే. సంగీత జ్ఞానాన్ని వంట బట్టించుకున్న ఆయన సినిమా పాటకు వోణీ వేయించారు. అడవి రాముడు, శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం, స...