గూగుల్ సెన్సేషనల్

ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ మరోసారి జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికే టెక్నాలజీ పరంగా ఎక్కువ శాతం గూగుల్ క్రియేట్ చేసిన క్రోమ్ ను వాడుతున్నారు. లక్షల్లో అనుకుంటే పొరపాటు పడినట్టే. ఏకంగా ప్రతి రోజు ట్రిలియన్స్ లలో ఉంటున్నారు. ఇందులో భాగంగా ఈ ఐటీ కంపెనీ తాజాగా గూగుల్ అసిస్టెంట్‌లో అద్భుతమైన ఫీచర్ ను ప్రవేశ పెట్టింది. ఇక నుంచి గూగుల్ అసిస్టెంట్‌లో ఇంటర్‌ప్రెటర్ మోడ్ అందరికీ అందుబాటులో రానుంది. ఈ రియల్ టైమ్ ట్రాన్సలేషన్ ఫీచర్‌ను వాడుకొని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడవచ్చు. మన దేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్, తెలుగు, ఉర్దూ తదితర తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్ పనిచేస్తోంది. మనకు వచ్చిన భాషలో మాట్లాడితే చాలు.. అది వెంటనే మనకు కావాల్సిన భాషలో అనువాదం చేసి పెడుతోంది. విదేశీ పర్యటనకు, పక్క రాష్ట్రాలకు వెళితే.. అక్కడి భాష తెలియనివారికి ఈ ఫీచర్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కొత్త భాషలు నేర్చుకునే వారికి ఈ ఫీచర్ ఎంతో హెల్ప్ ఫుల్‌గా ఉండ నుంది. ఈ ఏడాది కన్జుమర్ ఎలక్ట్రానిక్ షో లో ఇంటర్‌ప్రెటర్ మోడ్ గురిం...