ఆర్టీసీ కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు
తాను దమ్మున్న నాయకుడినని ప్రూవ్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. గత కొన్నేళ్లుగా వెట్టి చాకిరీ చేస్తూ, ఉద్యోగ భద్రత అంటూ లేకుండా నానా ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు కొండంత భరోసా ఇచ్చారు. అంతే కాదు మీకందరికీ తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. అంతే కాకుండా తాను ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని వంద శాతం నెరవేర్చాడు. ఇక ఏపీఎస్ ఆర్టీసీ లో పని చేస్తున్న 52 వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. జగన్ జగ మొండి..తాను మాట ఇచ్చాడంటే చాలు ఇక వెనుదిరిగి తీసుకోవడం అంటూ జరగదు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ముందుకు వెళ్లడమే. ఏకంగా అసెంబ్లీలో ఆర్టీసీని విలీనం చేస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి సభ సాక్షిగా ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఇక నుంచి ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ. ఇందులో పని చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగులే. వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మీరంతా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధం కావాలి. ఆర్టీసీని ఆదాయం గడించే సంస్థగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. వచ్చే ఏడాది మొదటి రోజు మీకందరికీ మరిచి పోలేని కానుక మీకిస్తున్న. అదే మీరంతా సర్కారు ఉద్యోగులే.
అధికారంలో ఉన్న అయిదేళ్ల పాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించు కోలేదన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండి పడ్డారు. ప్రైవేట్ రంగ సంస్థల్లోని ఉద్యోగులు..ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. 19997లో చంద్రబాబు తెచ్చిన చట్టం అడ్డంకిగా మారిందని, అందుకే ఆర్టీసీ విలీనం కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశ పెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో ఏపీ అంతటా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సంబురం చేసుకుంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి