మదుపరులకు భలే లాభం

భారతీయ మార్కెట్ లో మదుపరులకు భలే ఛాన్స్ దక్కనుంది. ఏ మేరకు భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ను స్టార్ట్ చేసింది. కానీ కొద్దీ కాలం పాటే ఈ అవకాశం అందుబాటులో ఉండడం మాత్రం ఇబ్బందికరం. ఎలాంటి రిస్క్‌ లేకుండా బ్యాంకు డిపాజిట్ల స్థాయిలో రాబడులు కోరుకునే వారు ఈ ఇష్యూను పరిశీలించొచ్చు. దీని ద్వారా కనీసం  7,000 కోట్ల వరకు సమీకరించాలన్నది ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇండియాలో ఇదే తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌   అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం. దేశీయ డెట్‌ మార్కెట్లో లిక్విడిటీని మరింత పెంచడం ఒకటి. రిటైల్‌ ఇన్వెస్టర్లు సులభంగా పాలు పంచుకునేలా చేయడం రెండోది. తక్కువ ఖర్చుకే బాండ్‌ ఈటీఎఫ్‌ను అందించడం.

ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను కొంచెం తక్కువ రేటుకే పొందే మార్గం కల్పించడం మరొకటి. ఈటీఎఫ్‌లు పనితీరుతో కూడినవి. అవి ఒక ఇండెక్స్‌ను అనుసరిస్తుంటాయి. రాబడులు కూడా ఆ ఇండెక్స్‌కు అనుగుణంగానే ఉంటాయి. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు సంబంధించి భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌   2023 - 2030 సూచీలను ఎన్‌ఎస్‌ఈ ఏర్పాటు చేసింది. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లతో కూడి ఉండడమే. మిగతా దంతా ఇతర ఈటీఎఫ్‌ల్లో మాదిరే ఉంటుంది. కాల వ్యవధి రెండు రకాలుగా ఉంటుంది. గడువు తీరాక అసలు పెట్టుబడి, ఆ మొత్తంపై వడ్డీ రాబడి చెల్లిస్తారు.

ఇందులో కేవలం గ్రోత్‌ ఆప్షన్‌ మాత్రమే ఉంది. రాబడులను ఎప్పటికప్పుడు చెల్లించే డివిడెండ్‌ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. లిస్ట్‌ అయిన తర్వాత యూనిట్ల రూపంలో కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. కనుక ట్రేడింగ్, డీమ్యాట్‌ అకౌంట్‌ ఉన్న వారు లావాదేవీలకు అర్హులు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం ఒక యూనిట్‌  1,000 రూపాయల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్టంగా 2 లక్షల వరకే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. భారత్‌బాండ్‌ డాట్‌ ఇన్‌ పోర్టల్‌కు వెళ్లి ఎన్‌ఎఫ్‌వో ఆఫర్‌ పత్రాన్ని పొందొచ్చు. దీనిని సమీపంలోని ఎడెల్‌వీజ్‌ కార్యాలయంలో సమర్పించడం ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

మూడేళ్ల ఈటీఎఫ్‌ రూపంలో కనీసం 3,000 కోట్లు, రెస్పాన్స్ బట్టి అదనంగా మరో 2,000 కోట్లు సమీక రించాలన్నది ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. అలాగే, పదేళ్ల ఈటీఎఫ్‌ ద్వారా కనీసం 4,000 కోట్లు, స్పందన అధికంగా ఉంటే మరో  2,000 కోట్ల వరకు సమీకరించనున్నారు. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ కచ్చితంగా ఏఏఏ రేటింగ్‌ కలిగిన ప్రభుత్వ రంగ కంపెనీల డెట్‌ సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. కనుక భద్రతకు ఢోకా ఉండదు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది. కనుక పెట్టుబడులకు ఎటువంటి రిస్క్‌ ఉండదు. ఇందులో పెట్టుబడి పెట్టేవాళ్లకు పన్ను భారం చాలా తక్కువ కూడా. ఇంకెందుకు ఆలశ్యం వెంటనే డబ్బులు పెట్టుబడి పెట్టండి ఇక. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!