గూగుల్ సెన్సేషనల్
ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ మరోసారి జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికే టెక్నాలజీ పరంగా ఎక్కువ శాతం గూగుల్ క్రియేట్ చేసిన క్రోమ్ ను వాడుతున్నారు. లక్షల్లో అనుకుంటే పొరపాటు పడినట్టే. ఏకంగా ప్రతి రోజు ట్రిలియన్స్ లలో ఉంటున్నారు. ఇందులో భాగంగా ఈ ఐటీ కంపెనీ తాజాగా గూగుల్ అసిస్టెంట్‌లో అద్భుతమైన ఫీచర్ ను ప్రవేశ పెట్టింది. ఇక నుంచి గూగుల్ అసిస్టెంట్‌లో ఇంటర్‌ప్రెటర్ మోడ్ అందరికీ అందుబాటులో రానుంది. ఈ రియల్ టైమ్ ట్రాన్సలేషన్ ఫీచర్‌ను వాడుకొని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడవచ్చు. మన దేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్, తెలుగు, ఉర్దూ తదితర తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్ పనిచేస్తోంది.
మనకు వచ్చిన భాషలో మాట్లాడితే చాలు.. అది వెంటనే మనకు కావాల్సిన భాషలో అనువాదం చేసి పెడుతోంది. విదేశీ పర్యటనకు, పక్క రాష్ట్రాలకు వెళితే.. అక్కడి భాష తెలియనివారికి ఈ ఫీచర్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కొత్త భాషలు నేర్చుకునే వారికి ఈ ఫీచర్ ఎంతో హెల్ప్ ఫుల్‌గా ఉండ నుంది. ఈ ఏడాది కన్జుమర్ ఎలక్ట్రానిక్ షో లో ఇంటర్‌ప్రెటర్ మోడ్ గురించి గూగుల్ మొదట పరిచయం చేసింది. తమ కంపెనీకి చెందిన గూగుల్ హోమ్ డివైజెస్, స్మార్ట్ డిస్‌ప్లేలలో ప్రవేశ పెట్టింది. ఇప్పుడు ఈ స్మార్ట్ టెక్నాలజీని అన్ని స్మార్ట్ ఫోన్లలో అందుబాటు లోకి తెచ్చింది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఇక ఫీచర్ పనిచేస్తుంది. అండ్రాయిడ్ ఫోన్‌లలో బైడిఫాల్ట్‌గా గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఐఫోన్‌లలో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ అసిస్టెంట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని..ఈ ఫీచర్‌ను ఐఫోన్‌లో కూడా ఎంచక్కా వాడు కోవచ్చు. ఇంటర్‌ప్రెటెర్ మోడ్‌ను వాడటం చాలా సులువు. మీ స్మార్ట్‌ఫోన్లలోని గూగుల్ అసిస్టెంట్‌ను తెరిచి.. ఇంటర్‌ప్రిటెర్ మోడ్‌ను డైరెక్ట్‌గా వాడొచ్చు. ఓకే గూగుల్ లేదా హే గూగుల్ అనే వాయిస్ కమాండ్‌తో గూగుల్ అసిస్టెంట్‌ను తెరవచ్చు. లేదా అండ్రాయిడ్ ఫోన్లలో పవర్ బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతోంది. మీకు ఏ భాష రాకుంటే.. ఆ భాషలో ఇంటర్‌ప్రెటెర్ మోడ్‌ను ఓపెన్ చేసి సంభాషించడమే. మీకు వచ్చిన భాషలో మాట్లాడితే.. కావాల్సిన భాషలోకి గూగుల్ అసిస్టెంట్ అనువాదం చేసి ఇస్తుంది. కొత్త కొత్త భాషలు నేర్చు కోవాలనుకునే వారికి ఇదెంతో పనికొచ్చే ఫీచర్ అని చెప్పవచ్చు. మొత్తం మీద భాష రాదన్న బెంగ ఇక తీరి పోయినట్లే. హ్యాట్స్ ఆఫ్ గూగుల్. జీతే రహో..సుందర్ పిచాయ్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి