ఇంజనీరింగ్ వేస్ట్..పకోడీ బిజినెస్ బెస్ట్

ప్రతి ఒక్క స్టూడెంట్ కల ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కావడం. ఐపీ ఎక్స్‌పర్ట్స్‌గా కోట్లాది రూపాయలు సంపాదించాలని కలలు కంటారు. ఆ దిశగా రేయింబవళ్లు శ్రమిస్తారు. లక్షలు వెచ్చించి కోచింగ్ సెంటర్లు, కాలేజీ క్యాంపస్‌లలో కుస్తీలు పడుతుంటారు. ఐటీ పుణ్యమా అంటూ ఇండియా వ్యాప్తంగా యమ క్రేజ్ పెరిగింది ఈ కోర్సులకు. ఆల్ ఇండియాలో ఆయా ఇంజనీరింగ్ కాలేజీలకు ఎనలేని డిమాండ్. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్ ఐ టీలు, త్రిబుల్ ఐటీలు, ఐఐటీహెచ్‌లకు ప్రయారిటీ ఎక్కువ. ఎందుకంటే వీటిల్లో సీటు దొరకితే చాలు ఇక లైఫ్ లో బోర్ అంటూ ఉండదు..ఫుల్ ఎంజాయ్. నాలుగేళ్లు కష్టపడాల్సిన పనిలేదు. మూడో ఏటనే కంపెనీలు వచ్చి వాలిపోతాయి. జెమ్స్ లాంటి కుర్రాలను ఎంపిక చేసుకుంటాయి. వారికి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తాయి. అందుకే వాటిపై అంత మోజు. ఇంజనీరింగ్ సీటు వచ్చిందంటే ఓ యుద్ధం చేసినట్లు లెక్క. ఎక్కడలేనంతటి ఆనందం కూడా. కానీ ఇది మాత్రం డిఫెరెంట్ స్టోరీ. ఎవరైనా గేట్ లో ర్యాంక్ వస్తే అదే చాలనుకుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ కుర్రాడు సాగర్ మాత్రం ఇంజనీరింగ్ చేసే కంటే రోడ్డుపై పకోడీ వ్యాపారం బ...