అగ్రికల్చర్ కోర్సుకు ఎనలేని డిమాండ్ - భారీ ఎత్తున ఫీజుల మోత
వ్యవసాయం దండుగ కాదు పండుగ అంటూ ఏనాడైతే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించాడో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ జపం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ ఫార్మింగ్, టిష్యూ కల్చర్, హార్టికల్చర్, నేచురల్ ఫార్మింగ్, పండ్ల తోటలు, అగ్రి బిజినెస్ అంటూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. మరో వైపు మహేష్ బాబు తాజా సినిమాలు వ్యవసాయం ప్రధానంగా బేస్ చేసుకుని తీయడంతో జనమంతా ఆ వైపు చూస్తున్నారు. అగ్రికల్చర్ యూనివర్శిటీ కొత్త కోర్సులకు శ్రీకారం చుడుతోంది. ఎక్కడలేని డిమాండ్ ఉంటోంది. పొద్దస్తమానం భూమినే నమ్ముకుని కొన్నేళ్లుగా సాగు చేసుకునే రైతుల గోస పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. రైతు బంధు పథకం పేరుతో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నా..ఆ డబ్బులన్నీ తాగేందుకే ఖర్చు చేస్తున్నారు. సాగును పక్కన పెట్టారు.
ఇక జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఫస్ట్ టైమ్ అగ్రికల్చర్ కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఈ ఏడాది నుంచే ఈ కోర్సు అందుబాటులోకి రానుంది. ఎంసెట్ ర్యాంకుల ద్వారా 75 సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రవాస భారతీయుల కోటాలో 25 సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో పేమెంట్ సీట్లకు గేట్లు బార్లా తెరిచారు. ఈ ఘనత వీసీ ప్రవీణ్ రావుకు దక్కింది. ఓ వైపు వేలాది ఖాళీలు ఉన్నా భర్తీ చేయకుండా ప్రభుత్వానికి భజన చేసుకుంటూ గడపడంలోనే ఆయన తన కాలాన్ని వెచ్చిస్తున్నారు. ఎంసెట్ లో సాధించిన ర్యాంకుల ఆధారంగానే వీటిని భర్తీ చేస్తారు. రాజేంద్రనగర్, జగిత్యాల, అశ్వార్వావుపేటలోని వ్యవసాయ కళాశాలల్లో పేమెంట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్లలో 40 శాతం సీట్లను రైతుల కోటా కింద వారి పిల్లలకు కేటాయిస్తారు.
మరో వైపు, ఎంసెట్ నుంచి మెడిసిన్‌ను వేరు చేశారు. నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ మాత్రం ఎంబీబీఎస్ సీటు కోసం నీట్, అగ్రికల్చర్, ఫార్మసీ సీటు కోసం ఎంసెంట్ రాసారు. ఒకవేళ ఎంబీబీఎస్ లో సీటు రాకున్నా అగ్రికల్చర్ లో సీటు వస్తుందని దీనిని ఎంచుకున్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ప్రతి ఏటా తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలలోని కాలేజీలకు వెళ్లి జాయిన్ అవుతున్నారు. అక్కడ 10 నుంచి 20 లక్షలు కడుతున్నారు. సౌకర్యాలు, బోధన సరిగా లేకున్నా అగ్రికల్చర్ కు డిమాండు ఉండడంతో నానా ఇబ్బందులు పడుతూ చదువుతున్నారని వీసీ తెలిపారు. దీనిని దృష్టిలో వుంచుకుని భారీ ఎత్తున ఫీజులు నిర్ణయించారు. అగ్రికల్చర్ కోర్సుకు 14 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా అయితే 34 లక్షలు కేటాయించారు.
ఒకరకంగా అక్కడ ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఇక్కడ ఫీజుల వసూలుకు తెర లేపింది యూనివర్శిటీ. పేమెంట్ సీట్ల కోసం 100 సీట్లను క్రియేట్ చేశారు. ఎంబీబీఎస్ తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సుకు గిరాకీ ఉంది. ఆరు అగ్రికల్చర్ కాలేజీల్లో 663 సీట్లున్నాయి. వీటిలో 432 సీట్లను ఎంసెంట్ ర్యాంకులు, మిగతా సీట్లను ఐకార్ ఎంట్రన్స్ టెస్ట్, వ్యవసాయ డిప్లొమాలు ఉన్న వారికి కేటాయిస్తున్నారు. తొలిసారిగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) పేమెం ట్ సీట్లు ప్రవేశపెట్టిం ది. మొత్తం 100 పేమెం ట్ సీట్లను సృష్టించారు. అందుకనే నీట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేం దుకు కౌన్సెలిం గ్ నిర్వహిం చాలని నిర్ణయించింది. మొత్తం మీద ప్రతి ఏటా ఈ కోర్సుల పేరుతో జోరుగా దందా మాత్రం జరుగుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి