తాగినోళ్లకు తాగినంత..తెలంగాణలో మస్తు మజా
పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో మస్తుగ తాగుతున్నరు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నరు. ఎక్కడ బడితే అక్కడ ..ఎప్పుడు పడితే అప్పుడు మద్యం షాపులు ఉండడంతో ఖర్చు పెడుతున్నరు. తాగొచ్చి భార్యలను దంచుతున్నరు. రోడ్ల మీదనే పడి పోతున్నరు. ఇంకేం సర్కార్‌కు ఆదాయం రాబట్టే. జనమేమో దవఖానాల పడవట్టిరి. అయినా సోయి లేకుండా తాగొస్తుండడంతో మహిళలు లబోదిబోమంటున్నరు. గల్లీ గల్లీకి ఓ దుకాణం దర్శనమిస్తోంది. పొద్దున..రాత్రి దాకా బార్లా తెరవడంతో బాటిళ్లే బాటిళ్లు పగులుతున్నయి. బీర్లు, బ్రాందీలు, విస్కీలు, వోడ్కాలు , కల్లు మస్తుగ దొరుకుతుంది. ఇంతకు ముందైతే నిబంధనలుండేవి.
ఇపుడు అది కూడా ఎత్తేసిండ్రు. మందు బాబుల పంట పండుతోంది. పండ్లు తోమకుండానే దుకాణాల సంది తిరుగుతున్నరు. ఫుల్‌గా తాగి జై కేసీఆర్ అంటున్నరు. సారమ్మ సార..నా పాణమైతివి అంటూ పాడుతున్నరు. ఇరు రాష్టాల్లో తాగేందుకు నీళ్లు దొరుకతలేవు..సాగు చేద్దామంటే చుక్క నీరందుత లేదు. కానీ మద్యం మాత్రం కావాల్సినంత ..ఎంత తాగితే అంత స్టాకు ఉంటోంది. వళ్లు గుళ్లయినా పట్టించుకుంట లేరు. తాగి పడిపోతుంటే చూస్తలేరంటూ భార్యలు ఏడుస్తున్నరు. ఇదీ రెండు రాష్ట్రాలు సాధించిన ఘనత. లిక్కల్ తాగడంల ఏపీ ఫస్ట్ మనం సెకండ్ అంట. అబ్బ ఏం వార్త కద. జబర్దస్త్‌గ అనిపిస్తుంది కద.
బీరు, బ్రాందీ కంటే విస్కీ అంటేనే పాణమంటున్నరట మనోళ్లు. దానికే మందు బాబులు జిందాబాద్ అంటున్నరట. మందు వినియోగంలో ప్రపంచంలో మనమే టాప్ అట. అబ్బో భలేగుంది కద వార్త. వైజ్‌గాయ్ అనే సంస్థ ఎవరు ఎక్కువ తాగుతున్నరని ఇప్పట్ల సర్వే చేసిందంట. చూస్తే మనం తేలినమట తాగడంలో.
ఇగ మందు లెక్కలు చూస్తేగిట్ల..కళ్లు తిరుగుతయి. పేదోడు, పెద్దోడు అనే తేడా లేకుండా తాగుతున్నరు..ఊగుతున్నరు. సార్లేమో ఖాతాల్లో డబ్బులు ఏయబట్టిరి. వీరేమో తీయపట్టిరి..తాగబట్టిరి. 60 శాతం మంది దీంట్లనే మునుగుతున్నరు. మజా చేస్తున్నరు.
గత ఏడాది చూస్తే మద్యం ఆదాయం మన కాడికి ..20 వేల కోట్లు వచ్చిందట. ఇంకేం ..దుక్నంలు బార్లా తెరిస్తే తాగక ఏం చేస్తరు. ఛాయ్ కంటే ముందుగాలుగ గిదే తాగుతున్నరు. దీంతోనే కడుక్కుంటున్నరట. తాగేటందుకే సగటున 13 వేల దాకా ఖర్చు చేస్తున్నరంట. ఇంట్ల సరుకుల కంటే తాగేటందుకే ఫికర్ చేస్తున్నరట. తాగక పోతే పాణం సల్లబడతలేదని ఏడుస్తున్నరట. చుక్క పడక పోతే మంచం దిగుతలేరట. ఎన్నికలు జరిగినంత సేపు ..నిలబడ్డోలంత పోయిస్తే..మస్తుగ తాగిండ్రు. ఇంకేం సర్కార్‌కు లాభం.మద్యం బాబుల జేబులకు చిల్లు. బాగుందీ కథ కదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి