విద్యా రంగంలో కీలక మార్పు - ఉన్నత విద్యా మండలి నిర్ణయం

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ దళం పూర్తి మెజారిటీ సాధించి రాష్టంలో బలమైన అధికార పక్షంగా కొలువు తీరడంతో కేసీఆర్ తన రథాన్ని రుయ్ మంటూ పరుగులు పెట్టిస్తున్నారు. పాలనలో తనదైన ముద్రను కనబరిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి అనూహ్యమైన రీతిలో పవర్‌లోకి రెండోసారి వచ్చింది. థంబింగ్ మెజారిటీని సాధించి ఔరా అనిపించింది. రైతులకు ప్రయోజనం కలిగించేలా పెన్షన్ సౌకర్యాన్ని , ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం ..మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదుపు తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశమంతటా మానవ వనరుల అభివృద్ధి సంస్థ పరిధిలోకి విద్యా శాఖ వస్తుంది. ఇందులో భాగంగా యూనివర్శిటీలు, ఇతర కాలేజీలలో కామన్ సిలబస్ వుండాలని నిర్ణయించింది. ప్రతి విశ్వ విద్యాలయంలో కామన్ సిలబస్ ఉండేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. క్రెడిట్స్, గ్రేడింగ్, ఎగ్జామ్ సిస్టం మొత్తం ఒకే రకంగా ఉండాలని , డిగ్రీ విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. థర్డ్ ఇయర్ లోను లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ తప్ప...