అమ్మకే అందలం ..కాంగ్రెస్‌కు రక్షణ కవచం
సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితికి నెట్టి వేయబడింది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ట్రబుల్ షూటర్ అమిత్ షా , రాజ్ నాథ్ సింగ్ ల దెబ్బకు కాంగ్రెస్ ఐసీయులోకి చేరుకుంది. 2014లోను, 2019లోను కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్ష పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోని స్థితిని కొనితెచ్చుకుంది. 543 లోక్‌సభ సీట్లకు గాను 52 సీట్లు మాత్రమే చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు కోట్లాది ప్రజలు. ఎంతో మంది అనుభవజ్ఞులు, దేశానికి దిశా నిర్దేశం చేసే నాయకులు ఎందరో ఆ పార్టీలో ఉన్నారు. కోట్లాది ఆస్తులు పోగేసుకున్న దిగ్గజాలు కలిగిన ఆ పార్టీ..ఇపుడు దిక్కులేనిదైంది.
అత్యంత బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీకి పగ్గాలు చేపట్టేందుకు యువ నాయకుడు రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారంటే ..అర్థం చేసుకోవచ్చు .కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ అత్యవసరంగా ఢిల్లీలో సమావేశమైంది. రాహుల్ తమకు వద్దంటూ ..నూతనంగా ఎన్నికైన ఎంపీలు తిరస్కరించారు. సోనియమ్మనే పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఓ వైపు తాను ఉండలేనని..తనకు ఆరోగ్య రీత్యా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేనని స్పష్టం చేశారు. కానీ ఎంపీలు ఒప్పుకోలేదు. మీరే ఉండాలని ముక్తకంఠంతో కోరారు. కోర్ టీం మీటింగ్‌లో వాడి వేడిగా చర్చలు జరిగాయి. తాను పార్టీకి నాయకత్వం వహించలేనని..ఒక నెల పాటు మీడియాకు దూరంగా ఉంటున్నానని..తనను డిస్ట్రబ్ చేయొద్దంటూ ఆ పార్టీకి చెందిన స్పోక్స్ పర్సన్ వెల్లడించారు.
భారీ ఓటమికి బాధ్యత వహిస్తూ తాను పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నానని..ఇక తన మానాన తనను ఉండనీయండంటూ రాహుల్ కోరారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. రాహుల్ తమకు కావాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున సోనియా గాంధీకి వినతులు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాహులే భావి భారత ప్రధాని అంటూ నినాదాలు కూడా చేశారు. అయినా ఫలితం లేక పోయింది. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, గులాంనబీ ఆజాద్, తదితరులు కాంగ్రెస్ పార్టీని బతికించ లేక పోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కోసమైనా సీట్లు పొందలేక పోయారు. కనీసం ఎన్నో ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీ ఇవాళ 100 సీట్లు కూడా సాధించలేక పోయింది. ప్రజలకు ఏం కావాలో పార్టీ గుర్తించ లేక పోయింది. దేశాన్ని పీడిస్తున్న సమస్యల గురించి ఏకరువు పెట్టలేదు. సుదీర్ఘమైన మేనిఫెస్టోను తయారు చేయలేక వెనుకడుగు వేసింది. మిత్రపక్షాలతో ఒప్పందం చేసుకోలేక పోయింది.
రాజకీయ నైపుణ్యం కలిగిన మేధావులను కూడగట్టలేక పోయింది. అంతేకాకుండా సోషల్ , డిజిటల్ మీడియాను అందుకోలేక పోయింది. ఒక రకంగా చెప్పాలంటే మోదీ, షా టీం కు 100 మార్కులకు 90 మార్కులు వేస్తే ..రాహుల్ అండ్ టీం కు 100 మార్కులకు గాను 20 మార్కులు మాత్రమే వేయాల్సి వస్తుంది. ఇంతలా దిగజారి పోయిన ఈ పార్టీని బతికించాలంటే తిరిగి దేశం స్వేచ్చ కోసం జరిగిన దండి, సత్యాగ్రహం కోసం పోరాటం చేయాలి. సీనియర్లను పక్కన పెట్టాలి. కొత్త రక్తాన్ని ఎక్కించాలి. యువతీ యువకులను పార్టీలోకి చేర్చుకోవాలి. కోర్ టీం
సభ్యులను మార్చేయాలి. మోదీకి షా, జగన్‌కు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీకి కావాలి. అప్పుడైతేనే కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కలుగుతుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కలగా మిగిలే ప్రమాదం పొంచి ఉంది. సోనియాకు పట్టాలు అప్పచెప్పితే కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కలిగే అవకాశం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి