ఇండియాకు యుఎస్ షాక్ - అబ్బా..ట్రంప్ ..దెబ్బ ..!


కేంద్రంలో కొలువు తీరిన కొత్త స‌ర్కార్‌కు అమెరికా స‌ర్కార్ దెబ్బ కొట్టింది. ఇండియాకు జీఎస్టీ ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏకంగా 2 వేల వ‌స్తువుల‌పై బాదుడుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అగ్ర‌రాజ్యం అన్నంత ప‌ని చేసింది. రెండు నెల‌ల కింద‌ట అమెరికా సెనేట్‌లో వెల్ల‌డించిన విధంగా మ‌న దేశానికి ప్రాధాన్య వాణిజ్య హోదాను తొల‌గిస్తున్న‌ట్లు ఆ దేశ అధ్య‌క్షుడు వెల్ల‌డించారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే ఈ నెల 5వ తేదీ నుంచే అమ‌లులోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించింది. త‌మ మార్కెట్ల‌కు స‌మాన‌మైన‌, హేతుబ‌ద్ధ‌మైన అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో భార‌త్ వైఫ‌ల్యం చెంద‌డం వ‌ల్ల‌నే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని యుఎస్ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

జీఎస్టీ ర‌ద్దు వ‌ల్ల ఇక నుంచి ఇండియా 5.6 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఎగుమ‌తుల‌పై సుంకాలు చెల్లించాల్సి వ‌స్తుంది. దీంతో 38 వేల 964 కోట్ల రూపాయ‌ల భారం మ‌న‌పై ప‌డుతుంది. ఇదే త‌గిన స‌మ‌యమ‌ని తాము భావిస్తున్నందు వ‌ల్ల‌నే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స‌మావేశంలో ప్ర‌క‌టించారు. మే 5 నుంచే ఈ నిర్ణ‌యం తీసు కోవాల‌ని అనుకున్నామ‌ని..అయితే ఏ ప్ర‌భుత్వం కేంద్రంలో అధికారంలోకి వ‌స్తుందో తెలియ‌క పోవ‌డంతో ..ఫ‌లితాలు వ‌చ్చేంత దాకా ఆగింది యుఎస్ స‌ర్కార్. కొత్త స‌ర్కార్ వ‌చ్చేంత వ‌ర‌కు సుంకాల ప‌న్ను విధించొద్దంటూ కాంగ్రెస్ స‌భ్యులు సూచించారు. దీంతో ట్రంప్ త‌న నిర్ణ‌యాన్ని కొన్ని రోజుల వ‌ర‌కు నిలిపి వేశారు.

ఇపుడు ఆ నిర్ణ‌యాన్ని త‌క్ష‌ణ‌మే ప్ర‌క‌టించ‌డంతో మోదీ ప్ర‌భుత్వం ఒకింత పున‌రాలోచ‌న‌లో ప‌డింది. ఇప్ప‌టికే ఆర్థిక వ్య‌వ‌స్థ గాడిన ప‌డ‌లేదు. ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఎక్స్ పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్ లెక్క‌ల ప్ర‌కారం ..2018లో ఇండియా 324.7 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన వ‌స్తువుల‌ను ఎగుమ‌తి చేసింది. వీటిలో 51.4 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన వ‌స్తువుల‌ను అమెరికాకు పంపించింది. వీటిలో 6.35 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఎగుమ‌తుల‌కు మాత్ర‌మే అమెరికా ప‌న్ను మిన‌హాయింపులు ఇచ్చింది. 1921 అమెరికా సుంకాల విధానం ప్ర‌కారం ఈ మిన‌హాయింపులు వ‌ర్తించాయి. జీఎస్టీని ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల ఇండియా వాణిజ్య రంగంపై స్వ‌ల్పంగానే ఉంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

దీనిని మోదీ ప్ర‌భుత్వం లైట్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అమెరికా తీసుకున్న నిర్ణ‌యంపై ఇండియా స్పందించింది. జీఎస్టీని ఉప‌సంహ‌రించుకున్న‌ప్ప‌టికీ తాము అమెరికాతో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌పంచ మార్కెట్‌లో ఇపుడు విప‌త్క‌ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది అమెరికా. ఓ వైపు వ‌ర‌ల్డ్ మార్కెట్‌ను చైనా దేశం శాసిస్తోంది. ఆర్థిక వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌వ‌స్థంగా మారింది. త‌మ దేశంలోని ప్ర‌జ‌ల నుంచి ట్రంప్ తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. స్థానికేత‌రులు త‌మ ఉద్యోగ అవ‌కాశాల‌ను కొల్ల‌గొడుతున్నారంటూ ఆందోళ‌న‌లు చేపట్టారు. ఆర్థిక సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తుండ‌డంతో మెల మెల్ల‌గా అమెరికా క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటోంది.

కానీ ట్రంప్ కు పూర్తి మెజారిటీ లేక‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్షం స‌హ‌కారం తీసుకోవాల్సి వ‌స్తుంది. వ‌ర్ధ‌మాన దేశాల ప‌రంగా చూస్తే ఇండియాను అమెరికా వ‌దులు కోలేదు. ఓ వైపు ర‌ష్యా ఇండియాకు మిత్ర దేశంగా ఉంటోంది. చైనాతో వైరం ఉండ‌డంతో ఆసియాలో త‌న ఆధిప‌త్యం స‌డ‌ల‌కుండా ఉండాలంటే భార‌త్‌తో ఎట్టి ప‌రిస్థితుల్లోను చెలిమి చేయాల్సిన ప‌రిస్థితి. యుఎస్ ఐటీ రంగంలో 30 నుంచి 40 శాతం దాకా ఇండియ‌న్స్ ప‌నిచేస్తున్నారు. 30 శాతం ఆదాయం వీరికే పోతోంది. దీనిని సీరియ‌స్‌గా తీసుకుంది యుఎస్. ఏది ఏమైనా యుఎస్ తీసుకున్న నిర్ణ‌యంపై ఇండియా వేచి చూసే ధోర‌ణిని అవ‌లంభిస్తుంటే..యుఎస్ మాత్రం డైల‌మాలో ప‌డిపోయింది.

కామెంట్‌లు