స‌మాజ సంక్షేమం..రైతు రాజ్యం..మోదీ ప్ర‌భుత్వం

ఊహించ‌ని రీతిలో కోట్లాది ప్ర‌జ‌లు అద్భుత‌మైన ..చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని న‌రేంద్ర మోదీకి అందించారు. మోదీ, షాల వ్యూహాలు..మూడొంతుల మెజారిటీని సాధించేలా చేసింది. ఏ పార్టీపై ఆధార‌ప‌డ‌కుండానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింది. దీంతో 57 మంది జింబో టీంతో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు మోదీ. త‌న‌దైన మార్క్‌ను ప్ర‌ద‌ర్శించారు. తెలంగాణ నుంచి ఒక్క‌రికే చోటు ద‌క్కింది. మిగ‌తా అంతా యుపీ, నార్త్ ప్రాంతాల నుండే ఎక్కువ‌గా మంత్రివ‌ర్గంలో కొలువు తీరారు. త‌న‌కు రెండోసారి ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేలా చేసినందుకు కృత‌జ్ఞ‌త‌గా తాను ఏమిచ్చి రుణం తీర్చుకోగ‌ల‌నంటూ ఉద్వేగానికి లోన‌య్యారు మోదీజీ. ఆక‌లిని తీర్చి అన్నం పెట్టే రైతుల‌కు ఏదైనా చేయాల‌ని సంక‌ల్పించారు. ఏకంగా వారు జీవిత‌కాలంలో మ‌రిచి పోలేని విధంగా సాయాన్ని ప్ర‌క‌టించారు. 

ప్ర‌తి రైతుకు ఎక‌రాకు ఏడాదికి 6 వేల రూపాయ‌ల చొప్పున ఇవ్వ‌నున్నారు. అంతేకాకుండా 60 ఏళ్లు నిండిన ప్ర‌తి రైతుకు పెన్ష‌న్ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌నున్నారు. ఇది ఒక చారిత్రాత్మ‌క నిర్ణ‌యంగా భావిస్తున్నాయి బీజేపీ శ్రేణులు. భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీజి ప్ర‌క‌టించిన ఈ రైతు ప‌థ‌కం ..దేశ వ్యాప్తంగా 14 కోట్ల మందికి పైగా రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స్కీమ్‌కు స‌వ‌ర‌ణ చేశారు. ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన రైతు స్కీంలో కేవ‌లం రెండు ఎక‌రాల ప‌రిమితి విధించింది. ఎందుక‌నో ఆ నిబంధ‌న‌ను తొల‌గించారు మోదీ. మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు పీఎం. రైతుల‌తో పాటు షాప్ కీప‌ర్లు, రిటైల్ ట్రేడ‌ర్ల‌కు నెల నెలా పెన్ష‌న్ వ‌ర్తింప చేయ‌నున్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. 

దీని వ‌ల్ల 5 కోట్ల మంది అన్న‌దాత‌ల‌కు మేలు చేకూరుతుంది. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో చేర్చింది. ఆ మేర‌కు ఇవాళ సంత‌కం చేస్తున్న‌ట్లు మోదీ తెలిపారు. ఇందు కోసం ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ పెన్ష‌న్ స్కీం ద్వారా అంద‌జేయ‌నున్న‌ట్లు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తోమ‌ర్ వెల్ల‌డించారు.
దాదాపు 10 వేల కోట్ల‌కు పైగా ఈ స్కీం కింద ఖ‌ర్చు చేయ‌నున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు క‌లిగిన రైతులు ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. వాళ్ల‌కు 60 ఏళ్లు వ‌చ్చాక నెల‌కు 3000 వేల పెన్ష‌న్ బ్యాంకులో నెల‌నెలా జ‌మ అవుతుంద‌న్నారు. ల‌బ్ధిదారు అనుకోని రీతిలో ప్ర‌మాదానికి లోనైనా లేదా స‌హ‌జ మ‌ర‌ణం చెందినా వారి కుటుంబంలో ఒక‌రికి 50 శాతం పెన్ష‌న్ వ‌చ్చేలా చేశామ‌న్నారు. 

కేంద్ర స‌ర్కార్ కొంత జ‌మ చేస్తే..రైతులు త‌మ త‌ర‌పున మ‌రికొంత డ‌బ్బులు జ‌మ చేయాల్సి ఉంటుంద‌న్నారు. వాలంట‌రీ అండ్ కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు తోమార్. గుంట‌లు, ఎక‌రాల‌తో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క రైతుకు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా..ల‌బ్ధి అందేలా ఈ ప‌థ‌కాన్ని డిజైన్ చేశామ‌ని మోదీ వెల్ల‌డించారు. ప్ర‌తి ఏటా ఈ ప‌థ‌కం అమ‌లు చేయాలంటే స‌ర్కార్‌కు ఏడాదికి 87 వేల కోట్లు కావాల్సి వ‌స్తుంది. ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తి ఒక్క‌రికి చేర్చాల‌ని అనుకున్నా ..కొన్ని రాష్ట్రాలు స‌రైన డేటా ఇవ్వ‌లేక పోయాయ‌ని ..మోదీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా షాప్ కీప‌ర్స్, రిటైల్ ట్రేడ‌ర్స్, స్వంత ఉపాధితో బ‌తుకుతున్న వాళ్ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరేలా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు ప్ర‌ధాన‌మంత్రి. 

వీళ్లంద‌రికి పెన్ష‌న్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల 3 కోట్ల మందికి ల‌బ్ధి ల‌భించ‌నుంది. ఏడాదికి 1.5 కోట్ల కంటే త‌క్కువ ట‌ర్నోవ‌ర్ క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రు ఈ ప‌థ‌కానికి అర్హుల‌వుతారు. ఇది కూడా వాలంట‌రీ , కాంట్రిబ్యూట‌రీ స్కీం కింద‌కు వ‌స్తుంది. వీరితో పాటు అమ‌ర జ‌వాన్ల పిల్ల‌ల స్కాల‌ర్ షిప్‌లు పెంచుతున్న‌ట్లు మోదీ ప్ర‌క‌టించి త‌న ఔదార్యాన్ని చాటుకున్నారు. మొత్తం మీద కేసీఆర్ తెలంగాణ‌లో తీసుకున్న రైతుబంధు ప‌థ‌కం ఇవాళ దేశ వ్యాప్తంగా అమ‌ల‌య్యేందుకు స్ఫూర్తిగా నిలిచింది. 

కామెంట్‌లు