విద్యా రంగంలో కీలక మార్పు - ఉన్నత విద్యా మండలి నిర్ణయం
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ దళం పూర్తి మెజారిటీ సాధించి రాష్టంలో బలమైన అధికార పక్షంగా కొలువు తీరడంతో కేసీఆర్ తన రథాన్ని రుయ్ మంటూ పరుగులు పెట్టిస్తున్నారు. పాలనలో తనదైన ముద్రను కనబరిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి అనూహ్యమైన రీతిలో పవర్‌లోకి రెండోసారి వచ్చింది. థంబింగ్ మెజారిటీని సాధించి ఔరా అనిపించింది. రైతులకు ప్రయోజనం కలిగించేలా పెన్షన్ సౌకర్యాన్ని , ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం ..మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదుపు తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. దేశమంతటా మానవ వనరుల అభివృద్ధి సంస్థ పరిధిలోకి విద్యా శాఖ వస్తుంది.
ఇందులో భాగంగా యూనివర్శిటీలు, ఇతర కాలేజీలలో కామన్ సిలబస్ వుండాలని నిర్ణయించింది. ప్రతి విశ్వ విద్యాలయంలో కామన్ సిలబస్ ఉండేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. క్రెడిట్స్, గ్రేడింగ్, ఎగ్జామ్ సిస్టం మొత్తం ఒకే రకంగా ఉండాలని , డిగ్రీ విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. థర్డ్ ఇయర్ లోను లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ తప్పనిసరి చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. 2019 -20 సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. రాష్ట్రంలోని ఆరు యూనివర్శిటీలలో కామన్ సిలబస్ ఉంటే బావుంటుందని సూచించింది. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, పాలమూరు , మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్శిటీల పరిధిలోని 1151 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఒక్కో విశ్వ విద్యాలయంలో ఒక్కో సిలబస్ ను అమలు చేస్తున్నారు.
వాటికి వేర్వేరుగా రేటింగ్స్, గ్రేడింగ్స్ ఇస్తున్నారు. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని వల్ల వేరే పరీక్షలు రాయలేక పోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉన్నత విద్యా మండలి పలు మార్పులు చేసింది. అన్ని యూనివర్శిటీలలో కామన్ సిలబస్‌ను తప్పనిసరి చేయాలని దీని వల్ల పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది. గతంలో పలుమార్లు వీసీలతో సమావేశాలు జరిగినా ఇంత వరకు అమలు కాలేదు. తక్షణమే అమలు చేయాలంటూ యుజీసీ ఆదేశించడంతో గత్యంతరం లేక మండలి చర్యలకు దిగింది.
అన్ని సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులతో కమిటీలు వేసి..కామన్ సిలబస్‌ను తయారు చేసింది. యుజీసీ ఆదేశాల ప్రకారం 80 శాతం స్థానికతకు చోటు దక్కేలా ఉండాలి. ఎక్కడా మార్పు చేసేందుకు వీలుండదు. ఇక మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో సెకండియర్ వరకే లాంగ్వేజెస్ ఉండేవి. తాజా నిర్ణయంతో ఫైనల్ ఇయర్ లో కూడా లాంగ్వేజెస్ చదవాల్సి ఉంటుంది. పరీక్షల్లో స్టూడెంట్స్ సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌లు నిర్ణయిస్తారు. మొత్తం మీద యుజీసీ రంగంలోకి దిగడంతో నిద్రపోతున్న ఉన్నత విద్యా మండలి మేల్కొన్నట్లయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి