భాగ్యనగరానికే బ్రాండ్ జిందా తిలిస్మాత్ .. ఏటా 12 కోట్ల టర్నోవర్ ..! -పేదలకు వరం దివ్య ఔషధం

ఏ ఊరుకు వెళ్లినా..ఏ ఇంటి తలుపు తట్టినా..ఏ సంతలో తచ్చట్లాడినా..ఏ జాతరను సందర్శించినా ..అందుబాటులో ఉండే దివ్యమైన ఔషధం జిందా తిలిస్మాత్. తెలంగాణ ప్రాంతానికి అరుదైన గౌరవంగా నిలుస్తోంది. తరతరాలుగా చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి అంగట్లో ..మందుల దుకాణంలో..కిరాణా కొట్టులో..పాన్ షాప్‌ల వద్ద ..ప్రతి చోటా తిలిస్మాత్ లభిస్తుంది. ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ మందు ధర చాలా తక్కువ. జలుబు..దగ్గుకు ఇది అద్భుతంగా పని చేస్తుంది. అందుకే దీనికంతటి డిమాండ్. కార్పొరేట్ మందుల కంపెనీలు సాధించలేని సక్సెస్ ను ఈ మందు స్వంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోని ప్రతి నగరంలో జిందా తిలిస్మాత్ విరివిగా లభిస్తుంది. ఏ బిజినెస్ మేగ్నట్ సాధించలేని ఫీట్‌ను ఫారూఖీ కుటుంబం సాధించింది. దీనిపై బడా కంపెనీలు కన్నేసినా ఆ దరిదాపుల్లోకి వెళ్లలేక పోయాయి. దీని ఫార్మూలా వారికి మాత్రమే తెలుసు. అంతగా కొన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఐటీ అనే సరికల్లా హైదరాబాద్ ను చూపిస్తున్నారు. కానీ భారతదేశ చరిత్రలో..యునాని పరంగా జిందా తిలిస్మాత్ తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతటి...