అడవి కోసం అతివల ఉద్యమం..దిగొచ్చిన ఒడిస్సా ప్రభుత్వం ..!

వాళ్ల దగ్గర ఆయుధాలు లేవు..మందీ మార్బలం లేదు. బతికేందుకు ఏ ఆధారం లేదు..ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి లిక్కర్ ఫ్యాక్టరీకి పచ్చ జెండా ఊపింది. భూములు లాక్కోవాలని చూసింది. జిల్లా అధికార యంత్రాంగం వారిపై పోలీసులను ఉసిగొల్పింది. ఇంత జరిగినా వారు చెక్కు చెదరలేదు. కొన్నేళ్లుగా ..తరతరాలుగా తమకు కూడు పెడుతున్న ఈ చెట్లను..అడవిని విడిచి వెళ్లమంటూ భీష్మించుకు కూర్చున్నారు. మా ప్రాణాలు తీసుకోండంటూ వారు చెట్లను హత్తుకున్నారు. కోర్టును ఆశ్రయించినా అన్యాయమే మిగిలింది. ఆ అతివల..అడవి బిడ్డల ఆత్మవిశ్వాసం ముందు సర్కార్ తలొంచింది. ఇదంతా నిన్నే జరిగిన కన్నీటి కథ..అంతులేని వ్యధ. సుందర్ లాల్ బహుగుణ గుర్తున్నారా..చిప్కో ఉద్యమానికి ఆద్యుడు. ప్రపంచం మెచ్చిన సామాజిక..పర్యావరణ వేత్త. చివరి వరకు అడవులను కాపాడుకోవాలంటూ జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. ఈ అడవిబిడ్డలు చేసిన సాహసం మరోసారి ఆయనను తలుచుకునేలా చేశాయి. ఇక కథలోకి వెళితే. ఒడిసా రాష్ట్రంలోని దెంకనాల్ జిల్లా బలరాంపూర్ గ్రామస్తులు అడవిపైనే ఆధారపడి బతుకుత...