ఇండియన్ యూత్ ఐకాన్ - ఏపీ కుర్రాడు నాగ శ్రవణ్
స్మార్ట్ ఫోన్లలో నిత్యం సహవాసం చేస్తూ..విలువైన కాలాన్ని గుర్తించకుండా ..లైఫ్‌ను కోల్పోతున్న యువత ఇతడిని చూసి నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాగ శ్రవణ్ కిలారు నేటి యువతీ యువకులకు..సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ దేశ భవితవ్యం వీరిపైనే ఉందని చెబుతున్నాడు. ఇంతకీ కిలారు సాధించిన కథేమిటో తెలుసుకుందాం. సేవ్ డెమోక్రసీ పేరుతో ఈ యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇండియాను చుట్టి వచ్చారు. సైకిల్‌పై జర్నీ స్టార్ట్ చేశాడు. ఒన్ మిలియన్ యూత్ అంటే 10 లక్షల మందికి పైగా యువతీ యువకులు శ్రవణ్‌ను అనుసరిస్తున్నారు. వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాడు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తున్నాడు. అన్ని వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు లోక్‌పాల్ పరిధిలోకి రావాలని నినదిస్తున్నాడు.
యువగల్ం - మార్చ్ ఆఫ్ మిలియన్ డ్రీమ్స్ పేరుతో వందలాది కిలోమీటర్లు తిరిగాడు. 2017లో కేంద్ర ప్రభుత్వంతో బెస్ట్ యంగెస్ట్ యూత్ అవార్డు స్వంతం చేసుకున్నాడు. రాబోయే ఎన్నికల్లో జనం చైతన్యవంతం కావాలంటూ ..వెయ్యి కిలోమీటర్లు తిరిగారు. ఆయన వెంట స్వచ్ఛందంగా వలంటీర్లు ఉన్నారు. ఇదంతా కేవలం వంద రోజులలో సాధ్యమైంది. నాగ శ్రవణ్ 17 ఏళ్ల వయసులో వుండగానే సామాజిక సేవా కార్యక్రమాలపై మక్కువ పెంచుకున్నాడు. ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. అవినీతి రహిత సమాజమే అంతిమ ధ్యేయమంటూ ..లోక్‌పాల్ ను బలోపేతం చేయాలని కోరాడు. తనతో పాటు కొంతమందిని తయారు చేసుకున్నాడు. వారికి లోక్‌పాల్ పై శిక్షణ ఇచ్చాడు.
ఏపీయే కాదు దేశమంతటా ఆక్టోపస్‌లా అవినీతి విస్తరించి పోయింది. దీనిని నివారించాలంటే ముందు ప్రజలు చైతన్యవంతం కావాలి. యూత్ డాలర్స్ డ్రీమర్స్‌గా మారారు. వీరందరిలో మార్పు రావాలంటే ..కొంత శిక్షణ అవసరమవుతుంది. లోక్‌పాల్ మూవ్‌మెంట్ కు నాలాంటి వారు మద్ధతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాను. 40 వేల మందికి పైగా విద్యార్థులను కలిశా. దీని ప్రాముఖ్యత గురించి వివరించా. 20 వేల మందితో సంతకాలు సేకరించాం. పార్లమెంట్‌లో లోకపాల్ బిల్లుకు మద్ధుతుగా విజయవాడలో భారీ ఎత్తున యువతతో ప్రదర్శన చేపట్టారు.
ఈ సమాజం నా ఒక్కడి వల్ల మారుతుందన్న నమ్మకం లేదు. కానీ నాతో పాటు పది మంది కలిస్తే తప్పక మార్పు వస్తుందన్న నమ్మకం మాత్రం నాకుంది. ఇదే నన్ను ఈ ప్రజాప్రయోజనకర కార్యక్రమానికి సన్నద్ధం చేసేలా చేసింది ..అంటారు నాగ శ్రవణ్ కిలారి. చదువు కోసం బెంగళూరు వెళ్లిన శ్రవణ్ అక్కడ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో పట్టు సాధించారు. అక్కడ యూత్‌తో కలిసి రైజ్ అనే స్వచ్ఛంధ సంస్థను స్థాపించాడు. అతడి లక్ష్యం ఒక్కటే ..అవినీతి రహిత సమాజం కోసం. అక్కడ కూడా పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టాడు. ఆర్టీఐ చట్టం ఎంత బలమైనదో చెప్పాడు. ఆర్జీలు పెట్టాడు. 2014లో విజయవాడలో కూడా ఇదే తరహా సమస్యలను పాయింటవుట్ చేశాడు. పౌర సమాజం చైతన్యవంతం కానంత వరకు సమస్యలు పేరుకుపోతూనే ఉంటాయని అంటాడు నాగ్.
దీంతోనే ఆగిపోలేదు మనోడు. లోక్‌పాల్ కోసం వర్క్ షాపులు చేపట్టాడు. ప్రతి వర్క్ షాప్‌లో 500 మంది యువతీ యువకులు ఉండేలా చూశాడు. పెద్ద ఎత్తున క్యాంపెయిన్ ఏర్పాటు చేశాడు. మనం ఎన్నుకుంటున్న ప్రజా ప్రతినిధులు మన గురించి ఏం చేశారో చూడండి. మనకు ఏం కావాలో వారు అడగడం లేదు. పన్నులు కడుతున్నాం. మరి మన వాటా ఎక్కడుందో తెలుసుకోలేక పోతున్నాం. అందుకే ఆర్టీఐని వాడుకోవాలి. మనం చైతన్యవంతం కావాలి అంటాడు..కిలారి. అతడి చేసిన ఈ చిన్నపాటి ప్రయత్నం ఇపుడు మహా వృక్షమై ఎదిగింది. రాబోయే ఎన్నికల్లో యూత్‌కు అతడొక ఐకాన్‌గా నిలుస్తానడంలో సందేహం లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి