యంగ్ క్రికెటర్లా ..మజాకా ..!
ప్రపంచాన్ని క్రికెట్ ఫీవర్ ఊపేస్తోంది. చిన్న పిల్లల నుంచి వయస్సు మళ్లిన పెద్దల దాకా కోట్లాది మంది క్రికెట్ లేకుండా ఉండలేక పోతున్నారు. దాని లోని మజాను ఆస్వాదిస్తున్నారు. ఐపీఎల్ పుణ్యమా అంటూ వందలాది మంది క్రికెటర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా యువతకు ప్రయారిటీ దొరుకుతోంది. జీ గ్రూపు సంస్థల ఛైర్మన్ సుభాష్ చంద్ర ఏ ముహూర్తాన టీ -20 క్రికెట్ టోర్నీకి శ్రీకారం చుట్టాడో కానీ..టెస్ట్ క్రికెట్..వన్డే క్రికెట్ ఫార్మాట్ దాటుకుని టీ 20 ఫార్మాట్ దుమ్ము రేపుతోంది. వరల్డ్ క్రికెట్‌ను షేక్ చేసేస్తోంది.
ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎంపిక కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇపుడు ఆ బాధ తప్పింది యువతీ యువకులకు. భారత జట్టు వరల్డ్ లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన జట్టుగా పేరు సంపాదించింది. ఏ ఫార్మాట్‌లోనైనా ఆడే క్రికెట్ ఆటగాళ్లను బీసీసీఐ తయారు చేస్తోంది. క్రికెటర్లు అందుబాటులో లేరన్న అపవాదు నుండి బయట పడింది.
ఇండియన్ క్రికెట్‌కు మంచి రోజులు వచ్చాయి. ఆల్‌రౌండర్‌గా ఉన్న కపిల్‌దేవ్ ఆధ్వర్యంలో వరల్డ్ కప్‌ను సాధించాక..క్రికెట్ ఫీవర్ దేశాన్ని ఊపేసింది. 1983 నుండి నేటి దాకా ఎక్కడ చూసినా..ఏ గల్లీకి వెళ్లినా క్రికెట్ కనిపిస్తుంది. పిల్లల నుండి పెద్దలు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మెరికల్లాంటి క్రికెటర్లను ఇండియా ప్రపంచానికి అందించింది. మోహిందర్ అమర్‌నాథ్, గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, గంగూలీ, రాహుల్ ద్రవిడ్, సంజయ్ మంజ్రేకర్, కుంబ్లే..నవ్‌జ్యోతిసింగ్ సిద్దూ, రమణ్ లాంబా లాంటి వాళ్లు ఫాంతో ఆకట్టుకున్నారు. ఎనలేని విజయాలు ఈ దేశానికి అందించారు. దాయాది పాకిస్తాన్‌కు చుక్కలు చూపించారు.
గ్రేట్ ఇండియన్ క్రికెటర్..ది వాల్‌గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ యూత్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వచ్చినప్పటి నుండి ఇండియాలోని యంగ్ క్రికెటర్ల దశ మారింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రతి రాష్ట్రం నుండి ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా వాల్ కష్టపడుతున్నారు. దమ్మున్న క్రికెటర్లుగా తీర్చిదిద్దుతున్నారు. యోధాను యోధులుగా అన్ని ఫార్మాట్‌లలో ఆడేలా..ఆల్‌రౌండర్లను తయారు చేస్తున్నారు. ఐపీఎల్ -10లో యువ క్రికెటర్లు కోట్లాది భారతీయులనే కాదు ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్‌ను స్వంతం చేసుకున్నారు. అలాంటి వారిలో 10 మంది క్రికెటర్లు మరింత ప్రతిభ కనబరుస్తూ మనసు దోచుకున్నారు.
ఆ పది మంది క్రికెటర్లు అత్యద్భుతమైన పర్‌ఫార్మెన్స్ ప్రదర్శించారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రిషబ్ పంత్ 43 బాల్స్ ఎదుర్కొని 97 పరుగులు చేసి గెలుపులో కీలక భూమిక పోషించారు. గుజరాత్ లయన్స్ జట్టుకు చుక్కలు చూపించారు. ఈ 20 ఏళ్ల కుర్రాడు క్రికెట్‌లో అడుగు పెట్టడం విషాదంతో మొదలైంది. మైదానంలోకి వచ్చే కంటే ముందే తండ్రిని పోగొట్టుకున్నాడు. ఆ విషాదాన్ని లోపటే దాచుకుని అద్భుతంగా ఆడాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొని 57 పరుగులు సాధించారు. వికెట్ కీపర్‌గా రాణించాడు. ఐసీసీ క్రికెట్ ఛాంపియన్ షిప్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో 14 మ్యాచ్‌లు ఆడిన రిషబ్ పంత్ ఓవర్ ఆల్‌గా చూస్తే 165 శాతంతో స్ట్రైక్ రేట్‌తో ముందు వరుసలో నిలిచాడు పంత్.
రాహుల్ త్రిపాఠి అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌గా పేరొందారు ఈ టోర్నీలో. యంగెస్ట్ క్రికెటర్. 26 ఏళ్ల ఈ క్రికెటర్ 10 మ్యాచ్‌లు ఆడి 353 రన్స్ చేశాడు. బీసీసీఐ దృష్టిని ఆకర్షించాడు. రాబిన్ ఊతప్ప తర్వాతి ప్లేస్‌లో త్రిపాఠి 152 స్ట్రైక్ రేట్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ ను దాటి ఈ ఫీట్ సాధించాడు రాహుల్.
ఈ టోర్నీలో ఎక్కువగా మనసు దోచుకున్న క్రికెటర్ ఎవరంటే రషీద్ ఖాన్. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ కుర్రాడు గుడ్ ఫర్‌ఫార్మెన్స్‌తో దుమ్ము రేపాడు. లక్ష్మణ్ కోచ్‌గా ఉన్నసన్‌రైజెస్ హైదరాబాద్ జట్టు ఇతడిని టోర్నీ కోసం ఏరికోరి ఎంచుకుంది. వారి నమ్మకాన్ని నిలబెట్టాడు. పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని ఈ క్రికెటర్ మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు సాధించాడు. గుజరాత్ లైన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులకే 3 వికెట్లు కూల్చి ఆశ్చర్య పోయేలా చేశాడు. ఇతని ఎకనామీ రేట్ 6.67 గా ఉంది.
యంగెస్ట్ క్రికెటర్ నితీష్ రానా గుర్తున్నాడా..ఈ టోర్నీకే అతడి ఆట హైలెట్ గా నిలిచింది. ఢిల్లీ సెలెక్టర్లు అతడిని ఎంపిక చేసుకోలేక పోగా..ముంబయి ఇండియన్స్ జట్టు ఇతడిపై కన్నేసింది. 23 ఏళ్ల ఈ కుర్రాడు ముంబయి జట్టుకు కీలకంగా వ్యవహరించాడు. వరుసగా మూడు ఆఫ్ సెంచరీలతో దుమ్ము రేపాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 29 బంతుల్లో ఆఫ్ సెంచరీతో రఫ్ఫాడించాడు.
గుజరాత్ లయన్స్‌కు వ్యతిరేకంగా 53 పరుగులు, కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 13 మ్యాచ్‌లు ఆడిన రాణా 333 పరుగులు సాధించాడు. 126 స్ట్రైక్ రేట్ సాధించి బెస్ట్ క్రికెటర్‌గా ఆకట్టుకున్నాడు.
సంజు శాంసన్ గుర్తున్నాడా. మోస్ట్ వాంటెడ్ క్రికెట్ ప్లేయర్‌గా పేరు సంపాదించాడు మనోడు. ఇండియాలోనే కాదు ఏకంగా వరల్డ్ మొత్తంగా ఫ్యాన్స్ ఉన్న క్రికెటర్‌గా పేరుంది. ఈ కేరళ కుర్రాడిని తీర్చిదిద్దింది మాత్రం రాహుల్ ద్రవిడే. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మనోడు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ టోర్నీలో దుమ్ము రేపాడు. ఏకంగా ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు. నిల్చున్న చోటనే సిక్సర్స్‌ను ఈజీగా ఆడేయగల సత్తా ఈ కుర్రాడికి ఉంది. కేరళ క్రికెట్ అసోసియేషన్ ఇతడిని ఎంపిక చేసి రంజీ ట్రోఫీలో ఆడించేలా చూశారు. ఈసారి టోర్నీలో ఈ 22 ఏళ్ల కుర్రాడు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిద్యం వహించాడు.
13 మ్యాచ్‌లు ఆడి 386 పరుగులు సాధించాడు. ఏకంగా ఓ సెంచరీతో పాటు రెండు ఆఫ్ సెంచరీలు కొట్టాడు. ఒపెనర్‌గా ఆడే ఈ ఆటగాడు గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 31 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 209 పరుగుల తేడాతో డిల్లీ గెలుపొందింది.
140 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేసి ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాడు బాసిల్ థంపి. విరాట్ కొహ్లి, క్రిస్ గేల్, ధోనీ లాంటి బడా ఆటగాళ్లకు తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. పెవిలియన్‌కు పంపించాడు. 23 ఏళ్లున్న ఈ కుర్రాడు కేరళకు చెందిన ఆటగాడు. 12 మ్యాచ్‌లు ఆడిన ఈ క్రికెటర్ 11 వికెట్లు పడగొట్టాడు. చికెన్ పాక్స్ వ్యాధి కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేక పోయాడు ..యంగ్ క్రికెటర్ శ్రేయాస్ ఐయ్యర్. సన్ రైజెస్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ సాధించాడు.
22 ఏళ్ల ఈ క్రికెటర్ 57 బంతులు ఎదుర్కొని 96 పరుగులు చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఫాస్టెస్ట్ గా రన్ రేట్‌ను దాటేసింది. అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. 11 మ్యాచ్‌లు ఆడిన ఈ కుర్రాడు 306 పరుగులు చేశాడు. 143 స్ట్రైక్ రేట్‌తో ముందు వరుసలో నిలిచాడు.
సందీప్ శర్మ గుర్తున్నాడు..ఇతని కెరీర్‌లో ఐదో ఐపీఎల్ టోర్నీ ఇది. 23 ఏళ్లున్న ఈ క్రికెటర్ ..13 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు పడగొట్టాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో మనోడు అద్భుతంగా ఆడాడు. బంతిని మెలికలు తిరిగేలా చేసి బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. అక్సర్ పటేల్ బెస్ట్ ఆల్ రౌండర్. 14 మ్యాచ్‌లు ఆడిన ఈ క్రికెటర్ 227 పరుగులు చేశాడు. 140 స్ట్రైక్ రేట్ తో దుమ్ము రేపాడు.
ఈ టోర్నీలో వెరీ వెరీ స్పెషల్ ఈ హైదరాబాద్ కుర్రాడు. పేద కుటుంబం నుండి వచ్చిన ఈ క్రికెటర్ అద్భుతమైన బౌలర్. 23 ఏళ్లున్న ఈ ఆటగాడు 10 వికెట్లు తీసుకుని ఔరా అనిపించాడు. సన్‌రైజ్ హైదరాబాద్ జట్టు 2.6 కోట్లకు వేలంపాటలో కొనుగోలు చేయడం రికార్డ్. ఈ యంగ్ క్రికెటర్లకు దేవుడిగా అవతరించాడు రాహుల్ ద్రవిడ్. ఆయన పుణ్యమా అని ఇలాంటి మెరికల్లాంటి యంగర్స్ క్రికెట్‌కు ప్రాణం పోస్తున్నారు. ఇండియాకు మంచి పేరు తీసుకు వస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి