ఐటీ నగరానికి వన్నె లద్దుతున్న డిజైనర్
హైదరాబాద్ వెలిగి పోతోంది. ముత్యాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, కలర్ ఫుల్ గాజులకు పెట్టింది పేరు భాగ్యనగరం. ఏ ముహూర్తాన కులీ కుతుబ్ షా ఈ అద్భుత నగరాన్ని నిర్మించాడో కానీ ..నాలుగు వందల ఏళ్లయినా నేటికీ ఈ పట్టణం చెక్కు చెదర లేదు. గంగా జమునా తెహజీబ్ అన్న పేరును సార్థకం చేసుకుంటోంది. భిన్న సంస్కృతుల మేలు కలయిక ఈ నగరం. ఎక్కడికి వెళ్లినా నియాన్ లైట్లు దర్శనమిస్తున్నా ..ప్రకృతి పరంగా అందరికీ సౌకర్యంతవంతమైన సిటీగా పేరుగాంచింది.
పేదలు, ధనికులు ..అన్ని కులాలు అన్ని మతాలు కలగలిసి పోయిన సమూహానికి కేరాఫ్ ఇది. లక్షలాది మంది ప్రజలు ఒకే గొంతుకై బతుకుతున్న తీరు ఈ ప్రాంతానికే చెల్లింది. 50 రూపాయలకు ఏం వస్తుంది అన్న ప్రశ్నకు..అంతెందుకు 5 రూపాయలతో కడుపు నింపుకునే సౌకర్యం కూడా ఈ నగరంలోనే ఉన్నది. పేదలకు కొండంత అండగా..ధనికులకు ఆదరణీయమైన స్థలంగా వినుతికెక్కింది.
ప్రపంచీకరణ పుణ్యమా అని దేశాల సరిహద్దులు చెరిగి పోయాయి. ప్రాంతాల మధ్య కల్చర్ డెవలప్ అయ్యింది. హైదరాబాద్ ఇన్మర్మేషన్ టెక్నాలజీకి హబ్‌గా విరాజిల్లుతోంది. లెక్కలేనన్ని ఐటీ కంపెనీలు, వ్యాపార పరంగా డాలర్లను కురిపిస్తోంది. అటు చూస్తే సైబరాబాద్ ఇటు చూస్తే చార్మినార్, ఆ పక్కన జీఎంఆర్ ఎయిర్ పోర్టు, జింఖానా గ్రౌండ్..చౌమహల్లా ప్యాలెస్, ఎల్‌బీ స్టేడియం, చిన్నజీయర్ ఆశ్రమం, అవుటర్ రింగ్ రోడ్ ..ధమ్ బిర్యానీ, ఛాయ్ సమోసా కు పెట్టింది పేరు. ఫ్యాషన్ రంగంలో ఈ నగరం వెలిగి పోతోంది. లెక్కలేనన్ని డిజైనర్స్ ఇక్కడ తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు.
శారీస్, బ్లౌజెస్, కుర్తాస్, పైజామాలు..లేడీస్ కు సంబంధించిన డిజైన్లకు విపరీతమైన మార్కెట్ ఈ నగరంలో ఉంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ విషయంలో స్టార్టప్ లుగా..కంపెనీలుగా సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్నాయి. వేలాది పెళ్లిళ్లు , లెక్కలేనన్ని ఫంక్షన్లు , సభలు, సమావేశాలు , బర్త్ డేలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా కోకొల్లలు ప్రతి రోజూ జరుగుతూనే వుంటాయి. కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తోంది. స్పెషల్‌గా పెండ్లిళ్లకు సంబంధించి విపరీతమైన డిమాండ్ నెలకొన్నది. ఈ సమయంలో దీప్తి గణేష్ డిజైనింగ్ రంగంలో ఫేమస్ డిజైనర్‌గా వినుతికెక్కింది. కాటన్ శారీస్, బ్లౌజులు, ఇతర డ్రెస్సెస్‌పై డిఫరెంట్ లుక్స్‌తో ..ఆకట్టుకునే రీతిలో డిజైన్లతో దీప్తి ఎక్స్‌పర్ట్‌గా తక్కువ టైంలో సక్సెస్ సాధించింది.
ఆమె క్రియేటివిటీకి డబ్బులు రావడం ప్రారంభమయ్యాయి. కస్టమర్లు పెరిగారు. కూకట్‌పల్లిలో మొదటగా దీప్తి గణేష్ డిజైనర్ స్టూడియో పేరుతో స్టూడియోను ఏర్పాటు చేసింది. క్లయింట్ల డిమాండ్ పెరగడంతో ఫేమస్ బిజినెస్ పీపుల్ ఎక్కువగా ఉన్న బంజారా హిల్స్‌కు మార్చేసింది. తన ఓన్ లేబుల్‌తో న్యూ లుక్స్, ట్రెండ్స్‌కు అనుగుణంగా ఫ్యాషన్ జోడించి స్టూడియోను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పెళ్లి కూతుళ్లను తయారు చేయడం, యువతుల కలలకు రూపం కట్టడం, మెస్మరైజ్ కు గురి చేసేలా డిజైన్లతో ఆకట్టుకోవడం దీప్తి గణేష్ ఎక్స్‌పర్ట్.
బ్లౌజెస్, బ్రైడల్, కిడ్స్, మెన్స్ వియర్, శారీస్, యాక్సెసరీస్, ఆభరణాలు ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా..అందరికి అందుబాటులో ఉండేలా స్టూడియోను ఏర్పాటు చేసింది. ఇక్కడికి వచ్చాక ఇంకెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే డిజైనర్లను తీర్చిదిద్దింది. స్వంతంగా ఆలోచించడం..వాటికి మెరుగులు దిద్దడం..ఇదే సక్సెస్‌కు ప్రతీక అంటారామె.దీప్తితో పాటు గణేశ్, రాచెల్ వార్‌మెన్, మోనికా ప్రిచెర్‌లు ఈ స్టూడియోకు ప్రాణం పోస్తున్నారు. దీప్తి ఐడియాస్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు వరల్డ్ వైడ్‌గా ..వస్తున్న ఫ్యాషన్..ట్రెండ్స్‌ను గుర్తించి మార్కెట్ లో తనకంటూ స్పెషల్ బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
దీప్తి గణేష్ డిజైనర్ స్టూడియో ఇపుడు హైదరాబాద్‌కే తలమానికంగా నిలిచింది. డిజైనర్లు తమ కలలకు మెరుగులు అద్దుతున్నారు. ప్రత్యక్షంగా..పరోక్షంగా ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. కాసులు కురిపించేలా చేస్తోంది. పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులు, యూత్‌కు ఈ స్టూడియో ద్వారా సేవలు పొందడం ఓ స్టేటస్ సింబల్. అన్ని హంగులతో..కొత్త సొబగులతో..న్యూ లుక్స్‌తో ఫ్యాషన్ పరంగా కొత్త లోకాన్ని ఆవిష్కరిస్తున్న ఈ స్టూడియోను నిర్వహిస్తున్న దీప్తి గణేష్‌కు అభినందనలు చెప్పాల్సిందే. మీకూ ఈ స్టూడియో ద్వారా సేవలు పొందాలంటే..08142420088/9848671986లలో లేదా దీప్తిగణేష్.కామ్‌ను సందర్శిస్తే చాలు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి