ఆటోమొబైల్ రంగంలో బుల్లి కార్ల‌దే హ‌వా ! - మార్కెట్‌ను షేక్ చేస్తున్న క్యూట్

వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆటోమొబైల్ రంగంలో కార్ల‌కు ఉన్నంత డిమాండ్ ఇంకే దానికి లేదు. రోజుకో డిజైన్‌, మోడ‌ల్‌తో కార్ల కంపెనీలు త‌మ సేల్స్‌ను పెంచుకునేందుకు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా శ్ర‌మిస్తే వ‌చ్చిన ఐడియానే కారు త‌యారీ. ఏ ముహూర్తాన ఫోర్డ్ కారును త‌యారు చేశాడో కానీ ఇపుడు ప్రపంచంలో ఏమూల‌కు వెళ్లినా ఏదో ఒక కారు ద‌ర్శ‌న‌మిస్తూనే ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రి కుటుంబంలో కారు అన్న‌ది ఒక భాగ‌మై పోయింది. అంత‌లా పాపుల‌ర్ అయింది.
చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అన్న‌ట్టు కుటుంబ అవ‌స‌రాలే కాకుండా ఆఫీసుకు వెళ్లాల‌న్నా..ఇంకెక్క‌డికైనా ప‌నిమీద ప్ర‌యాణం చేయాలంటే కారు వుండాల్సిందే. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేష‌న్ కార్డు, బ్యాంకు ఖాతా, డెబిట్ , క్రెడిట్ కార్డులు ఎలా మ‌న రోటిన్ లైఫ్‌లో భాగం అయ్యాయో అలాగే కారు కూడా ఓ పార్ట్‌లా త‌యారైంది.
అమెరికా, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, న్యూజిలాండ్‌, ఇండియా, చైనా, బ్యాంకాక్‌, సింగ‌పూర్‌, మ‌లేషియా..ఇలా చెప్పుకుంటూ వెళితే ప్ర‌తి కంట్రీలో ఏదో ఒక కారు మార్కెట్‌లోకి వ‌స్తూనే వుంటుంది..కార్ల ప్రియుల మ‌న‌సు దోచేస్తూనే వుంటుంది. ఆటోమొబైల్ రంగంలో కార్ల వాటా 60 శాతానికి పైగా ఉంటుందంటే అర్థం చేసుకోవ‌చ్చు..వీటికి ఎంత డిమాండ్ ఉందో. బ్రాండెడ్ కార్లు స్టేట‌స్ సింబ‌ల్స్‌గా మారడంతో వీటికి మ‌రంత ప్ర‌యారిటీ పెరిగింది.
మొద‌ట్లో ఫోర్డ్ కంపెనీ కార్లను త‌యారు చేసింది. మార్కెట్‌లో 90 శాతం ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత ఫోర్డ్‌కు పోటీగా చాలా కంపెనీలు కార్ల‌ను త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టాయి. హ్యూందాయి, టాటా, స్కోడా, బెంజ్‌, వోక్స్ వ్యాగ‌న్‌, హోండా, మ‌హీంద్ర‌, మారుతీ సుజుకీ లాంటి కంపెనీలు క‌స్ట‌మ‌ర్స్ అభిరుచుల‌కు అద్దం ప‌ట్టేలా మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. మినిమం 2.80 ల‌క్ష‌ల నుండి 30 కోట్ల దాకా ధ‌ర‌లున్న కార్లు సంద‌డి చేస్తున్నాయి.
ఇండియాలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి , పేద ప్ర‌జ‌లే ఎక్కువ‌. కారు కొనుగోలు చేయ‌డం, వాటిలో ప్ర‌యాణించాల‌న్న కోరిక భార‌తీయుల్లో అధికం. కానీ కొనాలంటే ఇల్లు గుల్ల కావాల్సిందే. రోజు బ‌త‌క‌డ‌మే గ‌గ‌నం. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకుని అత్యంత త‌క్కువ ధ‌ర‌లోనే అన్ని సౌక‌ర్యాలు వుండేలా కార్ల‌ను త‌యారు చేయాల‌న్న ఆలోచ‌న ఇండియ‌న్ కార్ల కంపెనీలకు వ‌చ్చింది.
ఎలాగైనా స‌రే కార్ల మార్కెట్లో త‌మ వాటా ద‌క్కించుకునేందుకు చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ లేదు. ఇప్ప‌టికే డీజిల్‌, పెట్రోల్ మంట మండుతోంది..మార్కెట్‌లో కార్ల‌ను కొనుగోలు చేసే వారు త‌క్కువ‌య్యారు. ఓలా, ఊబ‌ర్ లాంటి కంపెనీలు అద్దెకు ఇవ్వ‌డం, కంపెనీల‌తో ఒప్పందాలు కుదుర్చుకోవ‌డం ..క‌స్ట‌మ‌ర్లు, ఉద్యోగ‌స్తుల‌ను దించ‌డం చేయ‌డంతో కార్ల సేల్స్ గ‌ణ‌నీయంగా ప‌డిపోయాయి.
ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా కొంత ఇబ్బంది వుందంటూ ఇండియ‌న్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు అభ్యంత‌రం చెప్పింది. నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ..టాటా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. కేవ‌లం ల‌క్ష‌న్న‌ర లోపే టాటా నానో పేరుతో మార్కెట్‌లో సంద‌డి చేసింది. ఎందుక‌నో మ‌ధ్య‌లో విర‌మించుకుంది. ఆశించినంత ఆద‌ర‌ణ క‌స్ట‌మ‌ర్ల నుండి ల‌భించ‌లేదు.
ఇంజ‌న్ వెనుక వైపు ఉండ‌డం, కూర్చూనే సీట్లు సౌక‌ర్యంగా లేక పోవ‌డం, పెట్టిన డ‌బ్బుల‌కు స‌రిప‌డా సంతృప్తి ల‌భించ‌క పోవ‌డంతో మార్కెట్ వాటాలో కోల్పోయింది. ఇప్ప‌టికే ఇండియా వ్యాప్తంగా మారుతీ సుజుకీ కార్ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. ఇత‌ర దేశాల కార్లు ల‌గ్జ‌రీ పీపుల్స్‌ను టార్గెట్ చేస్తే..మారుతీ మాత్రం ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌లేదు. ఇండియ‌న్ మార్కెట్‌ను షేక్ చేస్తూనే ఉంది.
ఇందిరాగాంధీ హ‌యాంలో సంజీవ్ గాంధీ మారుతీ 800ను ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకు వ‌చ్చేలా చేశాడు. ఆనాటి నుండి నేటి దాకా మారుతీ ప్ర‌భుత్వానికి న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌గా పేరు సాధించింది. రాజీవ్ గాంధీ హ‌యాంలో మారుతీ జెన్ వ‌చ్చింది. ఇండియన్ ఆటోమొబైల్స్ రంగాన్ని ఒక కుదుపు కుదిపేసింది. అంత‌గా పాపుల‌ర్ అయ్యిందీ జెన్‌.
ఓ కుటుంబం ప్ర‌యాణం చేసేలా, త‌క్కువ ఆయిల్ ఖ‌ర్చు అయ్యేలా..ఎక్కువ మైలేజీ, కంఫ‌ర్ట‌బుల్ జ‌ర్నీ ఉండ‌డంతో జ‌నం జెన్ కారు తీసుకునేందుకు బారులుతీరి నిల‌బ‌డ్డారు. ఆ త‌ర్వాత మారుతీ స్విఫ్ట్‌, డిజైర్‌, ఇలా ప్ర‌తి మోడ‌ల్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. పెట్టిన డ‌బ్బుల‌కు రీసేల్ వాల్యూ ఉండ‌డంతో కార్ల ప్రియులు మారుతీకి ఓటు వేస్తున్నారు.
ఇండియా అంటేనే బ‌జాజ్‌..హ‌మారా బ‌జాజ్‌..ఆటోల రంగంలో రారాజుగా పేరు సంపాదించింది ఈ కంపెనీ. ఎక్క‌డికైనా వెళ్లే వీలు ఆటోల్లో క‌లుగుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా బుల్లి కార్ల‌కు డిమాండ్ ఉంటోంది. ఇండియ‌న్ మార్కెట్‌లో త‌మ వాటా ద‌క్కించుకునేందుకు బ‌జాజ్ క్వాడ్రిసైకిల్ పేరుతో సంద‌డి చేస్తోంది. తొలిసారిగా క్యూట్‌గా మ‌న‌సు దోచేస్తోంది. క్వాడ్రిసైకిల్ విభాగంలో రోడ్డెక్కిన తొలి భార‌తీయ కారు బ‌జాజ్ ఆర్ ఈ 60 క్యూట్ పేరుతో చిన్న కారును మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. దీనికి మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంది.
ఇంజ‌న్ 218 సీసీ, సింగిల్ సిలిండ‌ర్‌, 20 బి హెచ్‌పీ ప‌వ‌ర్‌, ముందు డిస్క్ బ్రేక్‌, వెనుక డ్ర‌మ్ బ్రేక్‌, నాలుగు సీట్ల సామ‌ర్థ్యం, 397 కేజీల బ‌రువు, 70 కిలోమీట‌ర్ల వేగం, లీట‌రుకు 35 కిలోమీట‌ర్ల మైలేజీతో దీనిని త‌యారు చేశారు. ప‌ర్యావ‌ర‌ణం ప‌రంగా ఎలాంటి ప్ర‌మాదం లేదు. బ‌జాజ్ క్యూట్ కారుకు ఇటీవ‌లే మోక్షం ల‌భించింది. ఈ కారు వ‌స్తే పెద్ద కార్లకు పోటీ అవుతుంద‌ని కొంత వ్య‌తిరేక‌త ఎదురైంది. ఇపుడు మాత్రం మార్కెట్‌ను ముంచెత్తుతోంది క్యూట్‌. దీని ధ‌ర అంద‌రికీ అందుబాటులో ఉండేలా చేశారు బ‌జాజ్‌. కేవ‌లం 60 వేల‌తో ల‌భించేలా దీనిని త‌యారు చేశారు.
హ‌మారా బ‌జాజ్‌..హ‌మారా స్కూట‌ర్‌, హ‌మారా ఆటో ..ఇదే నినాదంతో బ‌జాజ్ కంపెనీ త‌న హ‌వాను కొన‌సాగించేందుకు..ఆటోమొబైల్ రంగంలో చ‌రిత్ర సృష్టించేందుకు సై అంటోంది. చూస్తేనే ప్ర‌యాణం చేయాల‌న్న క్యూట్‌తో షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. నానో లాగా ఫెయిల్యూర్ అవుతుందా లేక మారుతీ లాగా స‌క్సెస్ ఫుల్‌గా కార్ల ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాల్సిందే.

కామెంట్‌లు