హైదరాబాదా..మజాకా - జోరు మీదున్న కుర్రాళ్లు
తమిళ దర్శకుడు బాలచందర్ గుర్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో కమల్ హాసన్ నటించిన పాట ఎందరో హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పటికీ జోష్‌తో ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతులోంచి జాలు వారిన ..కుర్రాళ్లోయ్ ..కుర్రాళ్లు..అంటూ ఆ పాట ఇప్పటికీ అలరిస్తోనే ఉంది. టెక్నాలజీ పుణ్యమా అంటూ మనోళ్లు ఊపు మీదున్నారు. డిఫరెంట్ ఐడియాలతో ప్రపంచం నివ్వెర పోయేలా చేస్తున్నారు. ఎక్కడో ఓ చోట ఆగిపోకుండా ..ప్రతిక్షణం న్యూ లుక్స్‌తో తమ వైపు ఓ లుక్ వేసేలా ట్రై చేస్తున్నారు. ఐటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆలోచనలు జనరేట్ అయ్యేందుకు స్టార్టప్స్‌ను స్టార్ట్ చేస్తూ బెస్ట్ ఆంట్రప్రెన్యూర్స్‌గా మార్కెట్ రంగంలో సై అంటున్నారు. ముఖ్యంగా మన తెలుగు వారి సత్తా దిగంతాలను తాకుతోంది. హద్దే లేకుండా పోతోంది.
తెలంగాణ పోరడు గుర్తున్నాడా..సామ ఫణీందర్ రెడ్డి. జర్నీ చేస్తున్నప్పుడు ఎదురైన కష్టాలు అతడిని డిఫరెంట్‌గా ఆలోచించేలా చేశాయి. బస్సెక్కిన మనోడు ఏకంగా అభీబస్ ఏర్పాటుతో కోట్లాది రూపాయల కంపెనీగా మార్చేశాడు. జస్ట్ చిన్న ఐడియా. సొసైటీకి ఏదో చేయాలన్న కసి. అతడిని ప్రేరేపించింది. రగిలి పోయేలా చేసింది. కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ అభీ బస్ ప్రత్యక్షంగా వందలాది మందికి ..పరోక్షంగా వేలాది మందికి బతుకునిస్తోంది. దీనిలో ఫణీంద్రతో పాటు చరణ్ పద్మరాజు, సుధాకర్‌లు భాగస్వామ్యులుగా ఉన్నారు.
తక్కువ టైంలో ఎక్కువ లాభం..హైదరాబాద్ బేస్డ్ ఆన్‌లైన్ కంపెనీగా రూపొందిన స్విగ్గీ లక్షలు కొల్లగొడుతోంది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్స్ ఇస్తే ఠంఛనుగా మన ఇంటి వద్దకు క్షణాల్లో ఎక్కడున్నా సరే అందజేయడం దీని ప్రత్యేకత. సర్వీస్ ఈజ్ ఫస్ట్. మనీ ఈజ్ లాస్ట్ అన్నది వీరి ట్యాగ్ లైన్. స్విగ్గీని నందన్ రెడ్డి, శ్రీహర్ష మాజెస్టీ, రాహుల్ జైముని దీని వ్యవస్థాపకులు. ఇలాగే సందీప్ కాచవరపు, చరణ్ తోట, హేమంత్ , సృజయ్, ప్రశాంత్ గణపతిలకు తట్టిన ఐడియా కోటి కొల్లగొట్టింది. వారు ఏర్పాటు చేసిన కొమ్ముట్..మొబైల్ బేస్డ్ మినీ బస్ షెటిల్ సర్వీస్‌ను స్టార్ట్ చేశారు హైదరాబాద్‌లో. చిన్న టైంలో పాపులర్ అయింది.
ఎన్ని మార్పులు వచ్చినా జర్నలిజం చెక్కు చెదరలేదు. టెక్నాలజీ డామినేట్ చేస్తున్నా ప్రింట్, మీడియా, సోషల్ మీడియా..డిజిటల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతూ వేలాది మందికి ఉపాధి కల్పించేలా చేస్తోంది. ప్రత్యక్షంగా..పరోక్షంగా దీనిపై ఆధారపడి బతుకుతున్నారు. పల్లవి బైజూరీ, సందీప్ పొనగండ్ల కేవలం జర్నలిజం బేస్డ్ గా స్టార్ట్ చేసిన సద్దాహక్ కొద్ది కాలంలో టాప్ టెన్‌లో నిలిచింది. మోస్ట్ బ్యూటిఫుట్ ఐడియాగా పాపులర్ అయింది.
డిఫరెంట్‌గా ఆలోచిస్తే సక్సెస్ సాధించొచ్చని వీరిని చూస్తే తెలుస్తుంది. ఆన్ లైన్లో వ్యాపారం చేసే వారికి, వస్తువులు కొనుగోలు చేస్తున్న వారికి ప్రయోజనం కలిగించేలా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలోంచి వచ్చిందే గ్రాబ్ ఆన్. ఆన్ లైన్లో కూపన్లు, డీల్స్ సర్వీస్ దీని ముఖ్య ఉద్ధేశం. ఈ ఐడియా వర్కవుట్ అయింది. ఎం.వి. భాను ప్రసన్న రాజు దీని వ్యవస్థపాకులు. స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు..ఇంత సక్సెస్ అవుతుందంటారు..రాజు. ఆదిత్య వూచి ఆధ్వర్యంలో రూపొందిన జిప్పర్ మోస్ట్ పాపులర్ స్టార్టప్. సాంప్రదాయ అడ్రెస్ కంటే ..8 డిజిట్ కోడ్స్ ను డిఫరెంట్ గా తయారు చేశారు.
వెరీ వెరీ స్పెషల్ సమోసా - ఇదేదో ఫుడ్ ఐటం అనుకుంటే పొరపాటే. భాగ్యనగరంలో రూపొందిన స్టార్టప్. ఇదో సోషల్ మెస్సెంజర్ యాప్. అభిలాష్ ఇమ్మెళ్ల, పాములపాటి అభిమన్యు. కూర రాహుల్ రెడ్డిలు దీని వ్యవస్థపాకులు. వేలాది మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇండియాలో పెళ్లళ్లకు ఎక్కడలేని డిమాండ్. కుటుంబ బాంధవ్యాలను కలిపే అద్భుతమైన వేదిక. తెలుగు రాష్టాల్లో మ్యారెజెస్‌కు ప్రయారిటీ ఎక్కువ. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పేరుతో వెంకటేశ్, ప్రణవ్ మెహ్‌తాల ఐడియాలోంచి రూపుదిద్దుకున్నదే ఎఫ్‌పీ..ఫ్లాట్‌పోబల్. వీరికి రోజుకు వందలాది ఆర్డర్స్ వస్తున్నాయి. ఫోటోగ్రఫి ఉపాధి చూపించే మార్గంగా మారింది.
హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇండియాలో ప్రముఖ కంపెనీలను ఆకర్షించడం గ్రేట్ కదూ. జె.ఏ. చౌదరి, సంతాను పాల్, మధు మూర్తి రోణంకిలు కలిసి టాలెంట్ స్పింట్ పేరుతో స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. స్కిల్ డెవలప్‌మెంట్, టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా ఏర్పాటు చేశారు. నిరుద్యోగాన్ని నిర్మూలించడం. చదువుకున్న వారిని గుర్తించడం. వారికి టెక్నాలజీకి అనుగుణంగా కోర్సులు అందించడం. అంతిమంగా స్కిల్ అందించడం..ఉపాధి కల్పించడం ఈ స్టార్టప్ ఉద్దేశం. ఇది కూడా తక్కువ టైంలో పాపులర్ అయ్యింది. కాసులు కొల్లగొడుతోంది. రాజు భూపతికి వచ్చిన ఐడియా కోటి రూపాయలను దాటేసింది. అదే హల్లో కర్రీ. క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్..ఇండియన్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. స్పీడ్‌గా వీరు ఫుడ్ ఐటమ్స్‌ను చేరవేస్తారు.
కుల్ ప్రీత్ కౌర్, సురేష్ కుమార్‌లు కలిసి స్టార్ట్ చేసిన షాప్ పైరేట్ హైదరాబాద్‌లో పేరు సాధించింది. ఆన్ లైన్ కూపన్లు, డీల్స్ సర్వీస్ దీని ప్రత్యేకత. కూల్ సర్వీస్..నమ్మకం దీని స్పెషాలిటీ. మోస్ట్ ఫెవరబుల్ స్టార్టప్ ఇది. జిఫ్ఫీ స్టార్టప్ తెలుగు వారి లోగిళ్లను షేక్ చేస్తోంది. ఆన్ లైన్లో డాక్టర్‌లు, సెలూన్లు, ఇతర హెల్త్ సర్వీసులు, వెల్ నెస్ రిలేటెడ్ సర్వీసెస్‌ను అందిస్తూ నోట్లు కొల్లగొడుతోంది. చెన్నుపాటి కీర్తి కిరణ్, పుష్కర్ సోనీలు దీని ఫౌండర్స్. జిఫ్ఫీ ఇపుడు అందరికి ఇష్టమైనదిగా మారింది. అనురాగ్ రాథోర్, ప్రమోద్ కుమార్‌లు జిఫీ స్టార్టప్ ను ప్రారంభించారు. వెబ్ , మొబైల్ ఎనేబుల్డ్ షేరింగ్ సర్వీస్ దీని స్పెషాలిటీ. ఇది కూడా విజయవంతమైంది. హైదరాబాదీ కార్తిక్ వెంకట్ స్టార్ట్ చేసిన మై డ్రీం స్టోర్ పాపులర్ అయింది. ఆన్‌లైన్ స్టోర్ దీని ప్రత్యేకత.
ఈవెంట్ లిస్టింగ్, ప్రమోషన్, టికెటింగ్ ఫ్లాట్‌ఫాం ప్రధాన సర్వీసుగా చెన్నప్పనాయుడు దారపనేని ఆధ్వర్యంలో వచ్చిన మేరా ఈవెంట్స్ స్టార్టప్ కొత్త పుంతలు తొక్కుతూ దూసుకెళుతోంది. రిస్క్ లేకుండా, మధ్యవర్తుల బాధ తప్పేలా ..ఉన్న చోటనే అన్నీ అందేలా దీనిని తీర్చిదిద్దారు నాయుడు. ఈ ఐడియా వర్కవుట్ అయి..లక్షలు సంపాదించేలా చేసింది. కిరణ్ కుమార్ గాలి, కిషోర్ కుమార్, నిర్మల జ్యోతిలు కలిసి స్థాపించిన నంబర్ మాల్ మరో స్టార్టప్. ఇది తక్కువ టైంలో కంపెనీగా మారింది. దీని స్పెషాలిటీ ఆన్‌లైన్ లో సర్వీస్ అందించడం. బిల్ పేమెంట్స్, టికెట్ బుకింగ్, ఇతర సర్వీసులు చిరు వ్యాపారులతో కలిసి పనిచేస్తోంది. మధుకర్ స్టార్ట్ చేసిన కస్టమ్ ఫర్నీష్ స్టార్టప్ పాపులర్ అయింది. కస్టమ్ మేడ్ ఫర్నీచర్ దీని ప్రత్యేకత. ఒకే వేదికపై ఈ కామర్స్ వెబ్ సైట్‌ల ద్వారా బెస్ట్ డీల్స్‌ను డీల్ చేయడం మై స్మార్ట్ ప్రైజ్ స్టార్టప్. దీనికి కూడా ఇపుడు డిమాండ్ పెరిగింది. సీతాకాంత రే, సులక్షన్ కుమార్ లు దీని ఫౌండర్స్.
షార్టెస్ట్ టైంలో ఊహించని సక్సెస్ స్వంతం చేసుకున్న స్టార్టప్ లెర్న్ సోషల్ . ఆన్ లైన్‌లో లెర్నింగ్ యాక్సెస్‌ను అందజేస్తోంది. ఇది పక్కా ఈ లెర్నింగ్ మార్కెట్ ప్లేస్‌ను ఆక్రమించింది. రాజు వనపాల దీని ఫౌండర్. మోస్ట్ పాపులర్ హైదరాబాద్ స్టార్టప్‌గా వినుతికెక్కింది. హేమంత్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వచ్చిన ఇమాజినేట్ టెక్నాలజీ స్టార్టప్. విర్చువల్ రియాలిటీ దీని స్పెషాలిటీ. ఇవన్నీచిన్న చిన్న ఐడియాలుగా తయారై పెద్ద కంపెనీలుగా రూపాంతరం చెందాయి. మీకూ లెక్కలేనన్ని ఐడియాలు వస్తూ వుంటాయి. ఏదైనా సొసైటీకి ఉపయోగపడేదిగా ఉంటే..తక్షణమే స్టార్టప్ గా ట్రై చేయండి. టెక్నాలజీ..సర్వీస్..క్రెడిబిలిటి ఉంటే సక్సెస్ అందుకోవచ్చు. డబ్బుల కోసం వేచి చూడాల్సిన పనంటూ ఉండదు. జస్ట్ ట్రై చేయడమే మిగిలింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి