సక్సెస్ ఫుల్ స్టార్టప్స్
సక్సెస్ ఇచ్చే కిక్ ఇంకెందులోనూ లభించదు. అందుకే దానికంత డిమాండ్. సొసైటీలో ఓ గుర్తింపు. ఓ భరోసా..అన్నిటా గౌరవం. అపజయానికి ఒక్క దారి..గెలుపునకు వేల దారులు. న్యూ ఐడియాస్‌తో సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా స్టార్ట్ చేసిన స్టార్టప్స్ కొన్ని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నాయి. వాటిలో కొన్ని . రోగాలతో సతమతమయ్యే వారు ఎందరో. ఇప్పటికే హెల్త్ రంగం కోట్లకు పడగలెత్తింది. ఉన్న కొద్దిపాటి డబ్బులతో మెరుగైన వైద్యం చేయించు కోవాలంటే ఎక్కడికి వెళ్లాలి. ఇలాంటి ఆలోచనే ఓ డాక్టర్‌కు వచ్చిందే. అదే కేర్‌మొట్టోగా రూపొందింది. తక్కువ ఖర్చు. పారదర్శకమైన సర్వీస్. అందుబాటులో డాక్టర్లు, నాణ్యమైన మందుల పంపిణీ.. అవసరమైతేనే సర్జరీలు. 24 గంటల పాటు అత్యవసర సేవలు. ఆన్‌లైన్‌లో వైద్యులతో ముఖా ముఖి. ఇదంతా డాక్టర్ నిరంజన్‌కు వచ్చిన ఐడియా. ఇపుడు ఆయన స్టార్టప్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
వేలాది మంది రోజూ రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ఎన్నో సమస్యలు. ప్రయాణంలో ఎన్నో అవస్థలు. ఎవ్వరికి చెప్పుకోవాలో తెలీదు. దీనిని గమనించాడు వికాస్ . ఏకంగా అందరికీ ఉపయోగ పడేలా ఇండియన్ రైల్ సోషల్ యాప్ ను తయారు చేశారు. ఒక్కసారి ఆ యాప్‌ను మనం డౌన్లోడ్ చేసుకుంటే చాలు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పటి నుంచి రైలు ఎక్కి..దిగే దాకా హాయిగా జర్నీ చేసేలా ప్లాన్ చేశాడు. ఇపుడీ స్టార్టప్ కాసులు కురిపిస్తోంది.
టూరిటీ - తక్కువ టైంలో ఎక్కువగా పాపులర్ అయ్యిదీ టూరిటీ స్టార్టప్. కొత్త ప్రదేశాలకు వెళతాం. అక్కడ మనలాంటి వారు ఎందరో. మన కమ్యూనిటీ ఎక్కడుందో మనకు తెలియదు. టూర్ ఆపరేటర్స్ మన బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు లాగేసుకుంటారు. ఎక్కడి నుంచో వచ్చి ఏదో చూడాలనుకుని ..చివరకు ఇబ్బందులు ఎదుర్కుంటూ తిరిగి ప్రయాణమవుతాం. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు టూరిటీ ముందుకు వచ్చింది. ఈ స్టార్టప్ వేలాది టూరిస్టుల పాలిట కల్పతరువుగా మారింది.
డాక్టర్లు..రోగుల మధ్య వారధి..ఓర్వోజ్ . ఏదో ఒక రోగం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. హాస్పిటల్స్‌కు వెళ్లకుండా ఉండలేం. అక్కడికి వెళ్లాక ఏ డాక్టర్ ఏం చేస్తారో తెలియదు. సవాలక్ష అనుమానాలు..పైగా టెస్టుల పేరుతో నిలువు దోపిడీ. పలుకరించే వారుండరు. మన రోగం వాళ్లకు ఓ వరం. దీనిని దగ్గరుండి గమనించారు.. రమేష్ ముదునూరి. ఎవరి ప్రమేయం లేకుండానే డాక్టర్లు..పేషంట్స్‌కు మధ్య డైరెక్టు లింకు ఏర్పాటు చేశాడు. ఇపుడు వేలాది మంది దీని ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నారు.
తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యం - అదే హెల్త్ సూత్ర. సాయి కృష్ణ మదిలో మెదిలిన ఐడియా ఇది. రోజూ వారీగా మనం తీసుకునే ఆహారమంతా కలుషితమే. మందుల వినియోగంతో తయారైన కూరగాయలే. వీటన్నింటికి పరిష్కారమే బార్లీ, రాగులు, ఇతర న్యూట్రిషన్ డైట్‌ను కంట్రోల్ చేసేలా రూపొందించాడు సాయి. ఇపుడు వెల్త్ కంటే హెల్త్ ముఖ్యమంటాడు మనోడు. ఈ స్టార్టప్ కు మంచి డిమాండ్ వుంటోంది.
కథల ఖార్ఖానా - కహానియా - ఏ బ్యూటిఫుల్ స్టోరీ మేకింగ్ గుడ్ ఇన్సిపిరేషన్ . కథలు కదిలిస్తాయి. కల్లోల పరుస్తాయి. జీవితాన్ని ప్రజెంట్ చేస్తాయి. ఎక్కడ వెదికినా ఇంగ్లీష్ లో లెక్కలేనన్ని లభిస్తాయి. కానీ దేశ వ్యాప్తంగా కనెక్టివిటీ ఉండాలంటే ఏం చేయాలి..రీజినల్ స్టోరీస్‌కు ప్రయారిటీ ఇవ్వాలి. ఇదే ఐడియాతో ఏర్పడ్డ స్టార్టప్ కహానియా. దీనిని పల్లవ్ బాజ్‌పురి, దేవేంద్ర గోన. ఎందరో క్రియేటివిటీ కలిగిన రైటర్స్, పోయట్స్ కు ఇదో ఫ్లాట్ పాంగా ఉపయోగపడేలా చేశారు. మోస్ట్ పాపులర్ స్టార్టప్ గా ఇండియాలో పేర్కొనబడింది.
ఈకిన్‌కేర్ - హెల్త్ రంగంలో మరో స్టార్టప్. డిజిటల్ ఫ్లాట్ ఫాం వేదికగా దీనిని రూపొందించారు కిరణ్ కల్‌కుంట్ల. ఇన్మరేషన్ టెక్నాలజీని ఉపయోగించు కోవాలన్నదే దీని ఉద్ధేశం. తక్కువ సమయంలో మెడికల్ పరంగా వచ్చే అనుమానాల్నింటిని నివృత్తి చేయడం . ఈకిన్ కేర్.
హైదరాబాద్ బ్రాండ్‌ను మరింత పటిష్టవంతం చేసే స్టార్టప్ గా పేరొందింది ..హలో కర్రీ. నగరంలో ఎవరినీ కదిలించినా దీని గురించి చెబుతారు. అంతగా పాపులర్ అయ్యిందీ స్టార్టప్. ఇది క్విక్ సర్వీస్ రెస్టారెంట్. మీరు ఎక్కడున్నా పర్వాలేదు. జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోరుకున్న ఏ ఐటంనైనా కోరుకుంటే చాలు ..క్షణాల్లో హలో కర్రీ పలకరిస్తుంది. మీరిచ్చిన ఆర్డర్స్‌ను మీ చేతుల్లో పెడుతుంది. ఇపుడు ఇదో హాట్ టాపిక్.
కమ్ముట్ - ఇదో దూరాన్ని తగ్గించే స్టార్టప్ - హైదరాబాద్‌లో ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ సమస్యలే. ఎప్పుడు ఇంటికి వెళతామో ..ఎప్పుడు ఆఫీసుకు చేరుకుంటామో తెలియదు. మెట్రోలున్నా..బస్సులు ఉన్నా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. దీనిని గమనించారు..ప్రశాంత్ గారపాటి, జొన్నలగడ్డ హేమంత్, కాచవరపు సందీప్‌లు షటిల్ బస్ సర్వీసులు ప్రారంభించారు. తక్కువ టైంలోనే ఎక్కడికైనా వెళ్లే ఏర్పాట్లు చేశారు. నగరంలో 20 చోట్ల పాయింట్లు గుర్తించారు. దాని ద్వారా ఎంచక్కా జర్నీ చేయొచ్చు.
మై డెంటిస్ట్ ఛాయిస్ - అంతా కల్మషమే. ఆహారంలో కల్తీ. మందులతో తయారైన కూరగాయలు, వస్తువులతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. కలుషిత నీళ్లను తాగిన వారంతా దంత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ డెంటల్ హాస్పిటల్‌కు వెళ్లినా డబ్బులు అధికంగా ఖర్చవుతున్నాయి. దీనిని గమనించిన పి. శివప్రసాద్ మై డెంటిస్ట్ చాయిస్ స్టార్టప్ ను స్థాపించాడు. 500 డెంటల్ కాలేజీలు, 3 లక్షల మంది రోగులు, డాక్టర్లను ఈ ఫ్టాట్ ఫాంకు తీసుకు వచ్చారు. అపోలో వైట్ డెంటల్, పార్థ డెంటల్ ఆస్పత్రులు ఈ స్టార్టప్‌లో భాగస్వాములుగా ఉన్నాయి.
ఎండ్ లెస్ రోబోటిక్స్ - దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన స్టార్టప్ ఇది. ఐదు మంది ఇంజనీర్లు దీనిని తయారు చేశారు. బిట్స్ పిలానీ - ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా రూపొందించారు. ఆటోమేషన్ ప్రొడక్ట్ష్‌కు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. లక్ష డాలర్ల ఫండ్ ఇప్పటికే దీనికి కేటాయించారు. వీటి బాటలోనే మెడినిఫి, టిన్ మెన్, జిఫి, నౌఫ్లాట్స్, జిప్పర్, మైడ్రీం స్టోర్, పే నియర్, వయోలిట్ స్ట్రీట్, ఓజోన్ టెల్..స్టార్టప్‌లు మిగతా వాటికి ధీటుగా సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి