దేశమంతటా భగవత్‌మాన్ స్మరణ
ఎవరీ భగవత్‌మాన్ అనుకుంటున్నారా. బెస్ట్ కమెడియన్. మోస్ట్ పవర్‌ఫుల్ స్పీకర్. ఆరేటర్. మెంటార్. ట్రైనర్. సింగర్. అంతకంటే పాపులర్ పొలిటికల్ లీడర్. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మనోడు పంజాబి. ఎవర్‌గ్రీన్ నవ్వు. సెటైర్లు..పంచ్‌లు..ప్రాసలు..కవిత్వం..పాటలతో దుమ్ము రేపుతున్నాడు. ఇలాంటి వారు దేశంలో ఎందరో ఉండి వుండవచ్చు. కానీ భగవత్ మాన్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ మ్యాన్. బెస్ట్ పార్లమెంటేరియన్ కూడా. పార్లమెంట్ సాక్షిగా మోడీ సర్కార్‌పై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ప్రసంగించిన తీరును చూసి ఈ దేశం యావత్తు ఆశ్చర్యానికి లోనైంది.
ఆయన ఎవ్వరి గురించి వకల్తా పుచ్చుకోలేదు. బీజేపీ చేస్తున్న ఆగడాల గురించి మాన్ అంకెలతో సహా బయట పెట్టారు. మోడీపై ప్రశ్నల బాణాలను సంధించారు. లైవ్‌లో చూసిన వారంతా ఔరా ..ఇలాంటి నేతలు ఈ దేశానికి కావాలని కోరుకున్నారంటే ..మాన్‌కు ఎంతటి ప్రయారిటీ లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ మాన్ ఏం మాట్లాడారంటే..రైతుల పక్షాన నిలబడ్డారు. వారు చేసుకున్న ఆత్మహత్యల గురించి నిలదీశారు. ప్రజాకోర్టులో బోనులో నిలబెట్టినంత పని చేశారు.
ఒక్కసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు..తరాలకు సరిపడా ఆస్తులను పోగేసుకుంటున్న ప్రబుద్దులున్న ఈ సమయంలో ఇలాంటి ప్రజాప్రతినిధి ఉండడం ఒకింత ఆనందం కలిగిస్తుంది. 1973 సంవత్సరం అక్టోబర్ 17న పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. ప్రస్తుతం సంగ్రూర్ పార్లమెంట్ సభ్యులుగా 2014లో ఎంపీగా 2,00,000 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పంజాబీ భాషలో అద్భుతమైన రీతిలో ప్రజెంటేషన్ ఇవ్వడంలో తనకు తానే సాటి. ఇంటర్ కాలేజీ నుండే కమెడియన్‌గా పేరు పొందారు. పాటియాలోని పంజాబ్ యూనివర్శిటీ నుండి గోల్డ్ మెడల్ పొందారు. స్వంతంగా స్క్రిప్ట్ రాసుకుని ..ప్రదర్శించే నేర్పు..ఓర్పు భగవత్‌మాన్ స్వంతం. ఎన్నో ప్రోగ్రామ్స్ రూపొందించారు. టెలివిజన్‌లో పాపులర్ అయ్యారు. స్టార్ ప్లస్ టీవీలో మాన్ నిర్వహించిన ప్రోగ్రాం అంచనాలు మించి వ్యూవర్స్‌ను మూటగట్టుకుంది. ఇది మాన్ కున్న పవర్ .
కుల్ఫీ గర్‌మా గరం..పేరుతో ప్రారంభమైన కార్యక్రమం పంజాబ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో రికార్డులు తిరగ రాసింది. ఆ తర్వాత 26 కామెడీ స్కిట్స్..డ్రామాలు..పేరు తీసుకు వచ్చాయి. నాలుగు ఆల్బమ్స్ విడుదల చేశాడు. 13 సినిమాల్లో నటించాడు మాన్. 2011లో పంజాబ్ పీపుల్స్ పార్టీలో చేరాడు. ఆ పార్టీ ఆధ్వర్యంలో బరిలో ఉన్నా గెలవలేక పోయారు. 2014 ఏడాది మార్చి 11న ఈ బెస్ట్ కామెడియన్ ..భగవంత్‌మాన్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుండి నేటి దాకా వెనుదిరిగి చూడలేదు. విస్తృతంగా పర్యటించాడు. ఎంపీగా పోటీ చేశాడు.
భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రతిపక్షాలను కోలుకోలేకుండా చేశాడు. చరిత్ర తిరగ రాశాడు. రికార్డు బ్రేక్ షేక్ చేశాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయాడు..మాన్.
భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రతిపక్షాలను కోలుకోలేకుండా చేశాడు. చరిత్ర తిరగ రాశాడు. రికార్డు బ్రేక్ షేక్ చేశాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయాడు..మాన్.
సకల సమస్యలపై మాన్ ఎక్కు పెట్టాడు. ప్రశ్నలతో సంధించాడు. ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టాడు. ప్రజల పక్షాన నిలబడ్డాడు. రైతుల గొంతుకై ఆక్రోశించాడు. ఏకంగా పార్లమెంట్ సాక్షిగా మోడీతో పాటు కమలనాథులు తలొంచుకునేలా చేశాడు. నోట్ల రద్దుతో ప్రజలను బిక్షగాళ్లుగా మార్చారని, రైతులు చనిపోతే..మోడీ ఇతర దేశాలకు బయలుదేరి వెళ్లారని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. నిలదీశాడు..నిగ్గదీసి అడిగాడు..భగవంత్‌మాన్..పంజాబీ పౌరుషాన్ని మరోసారి రుచి చూపించాడు. పుట్టుకతో కళాకారుడైన ఈ ఇండియన్ మాన్..వారెవ్వా అనుకునేలా చేశాడు. తన రాష్ట్రం..తన మట్టి గర్వపడేలా ఈ జాతి అంతా తన వైపు మళ్లేలా చేసుకున్నాడు..మన మాన్.
ఇపుడు ఇండియా ఇలాంటి ఉత్సాహవంతులైన..ప్రజల పట్ల ప్రేమ కలిగి..సమస్యలపై స్పందించి..నిగ్గదీసి నిలదీసే దమ్మున్న లీడర్లు కావాలి. లంగలు..లఫంగలు..బఫూన్లు ఏలుతున్న పాలకులకంటే ..మాన్ లాంటి వ్యక్తి మనకూ వుంటే బావుండేది ..ఇది నా మాట కాదు..అందరి మాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి