నైపుణ్యాభివృద్ధిలో ఏపీనే టాప్
మోడీ ఏ సమయంలో ఇండియాకు ప్రధాని అయ్యాడో కానీ స్కిల్ అనే పదం వైరల్‌గా మారింది. సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లింది. ప్రతి ఒక్కరికి చదువుకుంటే చాలదు..వారు ప్రత్యేకమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాల్సిందే. లేకపోతే ఈ కాలంతో పరుగెత్తలేం. అవకాశాలను అందుకోలేం. జాతీయ స్థాయిలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేసింది కాషాయ ప్రభుత్వం.
ఛాయ్ పే చర్చ పేరుతో ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ ఛాయ్ వాలా ఎక్కడికి వెళ్లినా..ఏ దేశంలో పర్యటించినా హమారా భారత్ మహాన్ హై అంటూ నినదించారు. ఐటీ రంగంలో ఇండియన్స్ దే హవా అని..వారు లేకపోతే ఈ రంగం ఒడిదుడులకు లోనై ఉండేదని ఒకానొక సందర్భంలో పేరొందిన ఐటీ ఎక్స్‌పర్ట్ పేర్కొనడం గమనార్హం.
మోడీ పిలుపుతో అన్ని రాష్ట్రాలు స్కిల్ ఇండియా జపం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎన్ ఎస్ డీసీ పేరుతో కుప్పలు తెప్పలుగా సెంటర్లు వెలిశాయి. లక్షలాది మంది విద్యార్థులకు నైపుణ్యం అలవడుతోంది..ఉపాధి లభిస్తోంది. సమాజానికి అవసరమైన ..ఉపయుక్తమైన..బతుకు దెరువు కల్పించే కోర్సులనే డిజైజ్ చేసింది ఈ సంస్థ . ప్రతి ఒక్క విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్ధేశంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
ప్రతి చోటా కోర్సులు, మెటీరియల్, శిక్షణ, భోజనం, రవాణా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఐటీ అంటేనే హైదరాబాద్ గా పేరొందిన తెలంగాణలో సైతం ఇక్కడి సర్కార్ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. ఐడియాలు కలిగిన వారికి సపోర్ట్ చేస్తూనే ఆంట్రప్రెన్యూర్స్‌గా తయారు అయ్యేలా చర్యలు చేపట్టింది. ఏకంగా ఐటీ పరిశ్రమలకు వెసలు బాటు కల్పిస్తూ చట్టాలను సవరించింది. వితిన్ వీక్‌లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేలా పాలసీని ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం.
ఏకంగా టెక్కీల కోసం ..ఔత్సాహికుల కోసం..కొత్త కొత్త ఐడియాలతో ఉత్సాహం మీదున్న వారి కోసం టీ హబ్ ను ఏర్పాటు చేసింది. అక్కడ అన్ని సౌకర్యాలతో ఉండేలా చూసింది. దీంతో న్యూ ఐడియాలతో కంపెనీలు వస్తున్నాయి. ఫేస్ బుక్, గూగుల్, అమెజాన్, తదితర కంపెనీలు ఇక్కడే కొలువు తీరాయి. ఇదిలా ఉంటే నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకు పోతోంది. ఓ వైపు మోడీ సర్కార్ అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ఏపీలో సక్సెస్ ఫుల్‌గా నడిపిస్తున్నారు.
గుడ్ అడ్మినిస్ట్రేటర్‌గా ..నిరంతరం ఐటీ జపం చేసే ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు నాయుడు ఏపీని మరో సింగపూర్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఎక్కడ చూసినా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరు ఉద్యోగం లేకుండా ఉండకూడదంటూ అద్భుతమైన కోర్సులు రూపొందించారు. ప్రత్యేకంగా ఐటీ సెక్టార్‌ను ఏర్పాటు చేశారు.
ఆటోమొబైల్, టెలికాం, లాజిస్టిక్స్, ఎమర్జెన్సీ, హెల్త్, బిజినెస్, ఏవియేషన్, ఐటీ, తదితర రంగాలన్నిట్లో పరిణతి సాధించేలా, ప్రతిభను కనబరిచేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రతిభకు సానబెట్టడం, నైపుణ్యాన్ని గుర్తించడంలో ఏపీ తనకు సాటి లేరంటూ ముందుకు దూసుకెళుతోంది. ఈ విషయాన్ని ఇండియన్ స్కిల్ రిపోర్టు తాజాగా వెల్లడించింది. పని చేసేందుకు అత్యంత అనువైన ప్రాంతం ఏపీనేనంటూ తెలిపింది. తెలంగాణ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని ఐటీ శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. చంద్రబాబు ముందు చూపు..లోకేష్ ఉత్సాహంతో ఐటీ దూసుకెళుతోంది. చాలా కంపెనీలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఎంఓయులు కుదుర్చుకున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. యువతీ యువకులు వారు చదువుకుంటున్న కోర్సులతో పాటు ఇతర నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా ఏపీఎన్ ఎస్‌డీసీ సక్సెస్ అయ్యిందని పేర్కొంది. మహిళల్లో నైపుణ్యం విషయంలో 47 శాతం నుండి 48 శాతానికి పెరగడం కూడా ఉత్సాహాన్ని నింపింది. కాలేజ్ కనెక్ట్ పేరుతో ఏపీ ఐటీ శాఖ ఇంటరాక్ట్ అవుతోంది.
మొత్తం మీద నైపుణ్యాభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం ఒకింత బలాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు. టెక్నాలజీని గుర్తించడం..సమాజానికి అన్వయించడం. కొత్త దనాలను ఆవిష్కరించడం..వాటి ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడం ఇదే నా ముందున్న లక్ష్యం అంటారు డైనమిక్ సీఎం చంద్రబాబు. కొత్త కంపెనీలు ఏర్పాటు కావాలి. అప్పుడే కొలువులు వస్తాయి. ఉపాధి పెరుగుతుందంటారు. టెక్నాలజీ పరంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంతో అన్ని ఫార్మాట్‌లలో పోటీ పడాలంటే భిన్నమైన నైపుణ్యాలను నేర్చు కోవాలంటారు బాబు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి