కోట్లు కుమ్మరిస్తున్న ఇన్‌షార్ట్స్
స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ ఒక్క రోజులోనే కరోడ్‌పతిలుగా తెర మీదకు వస్తున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం..వరల్డ్ వేవ్స్ ను గుర్తించడం తక్కువ టైంలో యాప్‌ను తయారు చేయడం ..మరిన్ని సౌకర్యాలు పొందు పర్చడంతో వేలల్లో..లక్షల్లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ప్రింట్, మీడియా, సోషల్ మీడియా , డిజిటల్ మీడియా రంగాలు ఎన్నడూ లేనంతగా ప్రచారంలోకి వచ్చాయి. ఢిల్లీ ఐఐటీలో చదువుకుంటున్న ముగ్గురికి వచ్చిన ఐడియాతో రూపొందించిన యాప్ కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది. కేవలం 60 పదాలతో కూడిన వార్తలను అప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా అప్‌డేట్ చేయడంతో ఊహించని రీతిలో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది.
ఇన్‌షార్ట్స్ ..ఈ న్యూస్ యాప్ లో హాట్ హాట్ టాపిక్స్ తో పాటు సక్సెస్ స్టోరీస్ ఇందులో పొందు పరిచారు. అజహర్, దీపిట్, అనునే కలిసి యాప్ క్రియేట్ చేశారు. ఈ యాప్ పేరుతో ఫేస్‌బుక్‌లో పేజీ క్రియేట్ చేశారు. ఇన్‌టైంలోనే లక్షలాది మంది దీనిని లైక్ చేయడం..డౌన్లోడ్ చేసుకోవడం తో కాసులే కాసులు. మేం ఈ సమాజాన్ని ఎలాగూ మార్చలేం అంటారు అజహర్. జస్ట్..ఉన్నది ఉన్నట్లు వార్తలను, స్టోరీస్‌ను చిన్న పదాల్లో తెలియ చెప్పడమే ..మేం చేస్తున్నది. ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదంటారు ఈ మిత్రద్వయం. న్యూస్ ఫీడ్..రీడింగ్ తో భారీ రేటింగ్‌ను ఇన్ షార్ట్స్ స్వంతం చేసుకుంది. ఆకట్టుకునే హెడ్ లైన్స్..క్యాచీ వర్డ్స్..స్పందించేలా వార్తలు..ఇవ్వన్నీ ఈ యాప్‌లో చోటు చేసుకున్నాయి.
ఈ ఇన్‌షార్ట్స్‌ను తక్కువ టైంలోనే 5 లక్షల నుంచి 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం..ఎక్కువగా గూగుల్‌లో సెర్చింగ్ చేయడం వీరి క్రెడిబిలిటికి..క్రియేటివిటికి దక్కిన గౌరవంగా భావించాలి. 24 మిలియన్ల ఫండ్ సమకూరింది ఈ యాప్‌కు . ఫ్యూచర్‌లో మరింత రేంజ్‌కు ఎదుగుతుందనే నమ్మకం కలగడంతో సచిన్ బన్సాల్, టైగర్ గ్లోబల్ కంపెనీలు ఇందులో పెట్టుబడి పెట్టాయి. ఇపుడు ఇన్ షార్ట్స్ లో పెట్టిన విలువ 600 కోట్లకు చేరింది. విచిత్రమేమిటంటే ఈ ముగ్గురి వయసు కేవలం 24 ఏళ్ల లోపే. ప్రతిరోజు డిస్కషన్ టైంలో ఏం చేయాలన్న దానిపై చర్చోప చర్చలు జరిగాయి. అందులో భాగంగా వచ్చిన ఐడియాకు ప్రతిరూపమే ఇన్ షార్ట్స్.
ఇన్‌స్టంట్ ఫుడ్ లాంటిదే కేవలం 60 పదాల లోపే అప్ డేట్ న్యూస్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. ఇంత తక్కువ సమయంలో వరల్డ్ వైడ్‌గా పాపులర్ అవుతుందని అనుకోలేదంటారు వీరు. వార్తలు..వాస్తవాలు..సినాప్సిస్ తో క్యాచీగా ఉండేలా న్యూస్ ఇస్తున్నారు. ఇదే ఈ యాప్ స్పెషాలిటీ. జస్ట్ ఎఫ్‌బీ పేజీలో 2015లో చర్చకు పెట్టాం. వేల మంది ఇంటరాక్ట్ అయ్యారు. యాప్‌కు మిలియన్ల జనం ఫిదా అయ్యారు. ఇపుడది సంబ్రమాశ్చర్యానికి గురయ్యేలా చేసింది. న్యూస్ ఈజ్ వెపన్ అని మా యాప్‌ను చూస్తే తెలుస్తుంది. మా ఆఫీసులో అందరికి పాల్గొనే అవకాశం ఉంటుంది. తమ ఆలోచనలను నిరభ్యంతరంగా ఇక్కడ ప్రస్తావించే వీలు వుంటుంది. దీని ద్వారా ఎన్నో ఐడియాలు స్టార్టప్‌లుగా మారే వీలుంది. కోట్లు ఇవాళ రావచ్చు..కానీ మేం ఎక్కడా రాజీ పడలేదు. జస్ట్ న్యూసే కదా అని తేలిగ్గా తీసుకోలేదు. న్యూస్‌ను న్యూస్‌గా చూశాం. ఉన్నది ఉన్నట్టు అందించే ఏర్పాటు చేశాం. అదే ఇన్‌షార్ట్స్ వెనుక ఉన్న సక్సెస్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి