హోటల్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఓయో
చూస్తే కుర్రాడు. పట్టుమని 25 ఏళ్లు నిండని యువకుడు. అతడు కొట్టిన దెబ్బకు వరల్డ్ హోటల్స్ ఇండస్ట్రీ కుదుపులకు లోనైంది. ఈ డైనమిక్ లీడర్‌కు వచ్చిన ఐడియా ముందు తాజ్, ఒబెరాయ్ గ్రూపులు తల్లడిల్లుతున్నాయి. మార్కెట్ వాటాను అంతకంతకు పెంచుకుంటూ ..తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ ముందుకు సాగుతున్న అతడే మన ఇండియన్ రితీష్ అగర్వాల్. మనోడు ఏ ముహూర్తాన ప్రారంభించాడో కానీ బిజినెస్‌లో తలపండిన వాళ్లను కునుకు లేకుండా చేస్తోంది.
ఆతిథ్య రంగంపై కొన్నేళ్ల పాటు గంప గుత్తగా గుప్పిట్లో వుంచుకున్న ఆయా హోటల్స్ గ్రూప్‌లకు దిక్కు లేకుండా చేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఓయో పేరు మార్మో్మ్రోగుతోంది. అతడికి వచ్చిన ఐడియా వేలాది మందికి జీవనోపాధిని కల్పించేలా, కునారిల్లిన హోటల్స్ యజమానులకు ఆదాయాన్ని సమకూర్చేలా చేస్తోంది.
కింది స్థాయి నుండి పై స్థాయి వరకు సౌకర్యవంతంగా ఉండేలా ..దేశంలో ఎక్కడికి వెళ్లినా గదులు దొరికేలా ఏర్పాటు చేయడం. సకల సౌకర్యాలను కల్పించడం. సర్వీస్ పరంగా సంతృప్తి కరంగా ఉండేలా తీర్చిదిద్దడంలో ఓయో అన్ని గ్రూపు కంపెనీల కంటే ముందంజలో ఉంటోంది. ఓయో ప్రతి కేపిటిల్ సిటీలే కాకుండా పేరున్న నగరాలు, పర్యాటక స్థలాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, టూరిజం కేంద్రాలు..ఇలా ఉన్న హోటల్స్‌తో అనుసంధానం చేసుకుంది ఓయో. ఆగమేఘాల మీద అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే వారు హాయిగా జర్నీ చేస్తున్నారు.
ఆతిథ్యమే కాకుండా ఫ్లయిట్ టికెట్ల విషయంలో ఓయో సహకరిస్తుంది. మినిమం నుండి మాగ్జిమం దాకా ధరలు ఉండేలా ఓయో జాగ్రత్త పడుతోంది. దీని వల్ల లాభం ఎలా వస్తుందని అనుకుంటున్నారా..ఇక్కడే రితీష్ అగర్వాల్ తెలివి దాగి ఉన్నది. ఆయా హోటల్స్‌తో ఒప్పందం కుదుర్చు కోవడం వల్ల ఓయోకు లాభం. కస్టమర్ష్ ఎంటర్ అయినప్పటి నుండి తిరిగి వెళ్లే దాకా అన్నీ ఈ సంస్థే దగ్గరుండి సర్వీసు అందజేస్తుంది. ఓనర్స్‌కు..ఓయోకు మధ్య ఒప్పందం..భారీ ఆదాయాన్ని సమకూర్చేలా చేస్తోంది.
గూగుల్ ప్లే స్టోర్ లో ఓయో యాప్‌కు 4.5 రేటింగ్ దక్కింది. వేలాది మంది దీనిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. చిన్నగా స్టార్ట్ అయిన ఓయో ఇపుడు ఇండియాను ఆక్రమించేసింది. హోటల్స్ పేర్లు మారి పోయాయి. ప్రతి చోటా ఓయో బ్రాండ్ కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సాఫ్ట్ బ్యాంక్ ఫౌండర్ మసయోషి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఓయోలో పెట్టేందుకు రితీష్ అగర్వాల్‌తో ఒప్పందం కుదుర్చున్నాడు. ఇదే హోటల్స్ రంగంలో బిగ్ డీల్‌గా పేర్కొనవచ్చు. అయిదు సంవత్సరాల కిందట 19 ఏళ్ల వయస్సులో రితీష్ అగర్వాల్ ఓయోను ఏర్పాటు చేశాడు. ఇండియాలో హోటల్స్ చెయిన్ సిస్టంలో ప్రథమ స్థానం ఇతడిదే.
మారియట్ గ్రూప్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కోటి 20 లక్షల గదులను కలిగి వుంటే ..హిల్టన్ హోటల్స్ గ్రూప్ సంస్థ 8 లక్షల 40 వేల రూమ్స్ ఉండగా , రితీష్ ఓయో గ్రూప్ 2 లక్షల 30 వేల గదులను స్వంతం చేసుకుని రికార్డ్ బ్రేక్ చేసింది. ఇండియాతో పాటు చైనా, మలేషియా, నేపాల్, యుకె, యుఏఇ, ఇండోనిషియా దేశాల్లో సైతం ఓయో పాగా వేసింది. ప్రపంచంలో చిన్న రూములు కలిగిన హోటల్సే ఎక్కువ. అందుకే వాటి మీద కాన్ సంట్రేషన్ చేశా. చిన్న రూములే నా బలం. ఇండియన్స్ మెంటాలిటీ ఎక్కడికి వెళ్లినా ఒక్కటే. తక్కువ ధరలకే అన్నీ దక్కాలి. అందులో గదులు కూడా. సర్వీసులు అందించడం విషయంలో లేటెస్ట్ టెక్నాలజీని జోడించారు.
చైనాలో 25 శాతం వాటాను దక్కించుకున్నారు. అక్కడ 400 మంది ఇండియన్స్ మేనేజర్స్ గా పనిచేస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటారు. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా..ఎక్కడికి వెళ్లినా ఓయో ఇంటి వాతావరణం ఉండేలా చూస్తుంది. వేలాది మంది ట్రైనింగ్ పొందిన వారు సేవలందిస్తారు. ఇదే నా వెనుక వున్న బిగ్ సక్సెస్ అంటారు వినమ్రంగా రితీష్ అగర్వాల్.
చిన్న గదితో ప్రారంభమైన ఓయో ఇపుడు ప్రపంచ మార్కెట్‌లో 20 శాతానికి పైగా వాటాను దక్కించుకుని బిలియన్ డాలర్లను దాటేసింది. బిగ్ సక్సెస్ సాధించిన ఇతడిని చూసి బిజినెస్ టైకూన్స్ ..ఇంకేం ఐడియాతో ముందుకు వస్తాడోనని జడుసుకుంటున్నారు. ఇది మనోడికున్న పవర్. సో..యువతీ యువకులు స్మార్ట్ ఫోన్లతో కుస్తీ పట్టకుండా ..కాస్తంత తెలివికి పదును పెడితే రూపాయలే కాదు డాలర్లు మీ చేతుల్లో వాలే ఛాన్స్ ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి