త‌లైవర్‌ మెచ్చిన పా..రంజిత్

ఎవ‌రీ పా..రంజిత్ అనుకుంటున్నారా. మోస్ట్ వాంటెడ్ ఇండియ‌న్ డైరెక్ట‌ర్. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది ఫ్యాన్స్ క‌లిగిన ..త‌లైవ‌ర్ మ‌న‌సు దోచుకున్న యువ త‌మిళ డైరెక్ట‌ర్. సినిమా అన్న‌ది క‌మ‌ర్షియ‌ల్‌కు సంబంధించింది కాద‌ని దానికో సామాజిక బాధ్య‌త కూడా ఉంద‌ని గుర్తు చేసిన ద‌ర్శ‌కుడు. మానవీయ కోణంతో అమాన‌వీయ సంఘ‌ట‌న‌ల‌ను తెర మీద అద్భుతంగా చూపించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. 68 ఏళ్ల సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌నే కాదు ఆయ‌న ముద్దుల కూతురు సౌంద‌ర్య‌ను ఇంప్రెస్ చేశాడు పా. స్టోరీ మేకింగ్ అన్న‌ది ఈజీ ..కానీ దానిని సినిమాగా తెర‌కెక్కించ‌డం మాత్రం క‌ష్ట‌మైన ప‌ని. దానిని మ‌రింత సుల‌భ‌త‌రం చేశాడు..అందుకే నాకే కాదు నాన్న‌కు కూడా న‌చ్చేశాడు..అంటూ చెప్పింది సౌంద‌ర్య ఓ సంద‌ర్భంలో.
త‌మిళుల‌కు ప‌ట్టుద‌ల ఎక్కువ‌. ప‌ట్టింది సాధించే దాకా నిద్ర‌పోరు..వ‌ద‌ల‌రు కూడా. అలాంటి ప్రాంతం నుండి వ‌చ్చిన ద‌ర్శ‌కుడే రంజిత్‌. సూప‌ర్ స్టార్‌ను క‌ల‌వాలంటే ద‌మ్ముండాలి. ఆయ‌న కోసం ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు క్యూలో నిల్చుంటారు. ఎందుకంటే ఇపుడు కాక పోయినా ..కొన్నేళ్ల‌కైనా డేట్స్ దొరుకుతాయోమోన‌ని ..కానీ వారికి ద‌క్క‌ని ఛాన్స్ మ‌నోడికి ద‌క్కింది. ఇదంతా త‌న మీద త‌న‌కున్న న‌మ్మ‌కం. పా..ను త‌లైవా ద‌గ్గ‌ర‌కు చేర్చింది. క‌థ‌లు త‌యారు చేయ‌డం ..రాయ‌డం..హృద్యంగా అర్థ‌మ‌య్యేలా వివ‌రించ‌డం చాలా క‌ష్టం.
అస‌లు క‌థ‌లు ..పాత్ర‌లు మ‌న‌లోంచే వ‌స్తాయి. మ‌న చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణమే పాత్ర‌ల్లో క‌నిపిస్తాయి . ర‌జ‌నీ స‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లా..ఆయ‌న మౌనంగా ఉన్నారు. మునిలా..బాబాలాగా ఏదో ఆలోచిస్తున్నారు. క‌నుసైగ చేసి కూర్చోమ‌న్నారు. క‌థ చెపుతూ పోయా..టైం ఎలా గ‌డిచి పోయిందో తెలీదు..కానీ చీక‌టి కమ్ముకుంది..భ‌ళ్లున తెల్లారింది కూడా..చూస్తే స‌ర్..నేను మాత్ర‌మే గ‌దిలో మిగిలాం. అక్క‌డే త‌లైవా న‌న్ను ఓకే చేశారు.
ర‌జ‌నీ స‌ర్‌..స్పందించారు. నా భుజం త‌ట్టారు. వెన్ను త‌ట్టి ప్రోత్స‌హించారు. ఆ క‌థే ..కాలా..క‌బాళిగా సినిమాలుగా వ‌చ్చాయి. ఆయ‌నకు స్టేట‌స్‌, బ్రాండ్‌..ఇమేజ్‌..ను మేన‌రిజంకు ఎలాంటి భంగం వాటిల్ల‌కుండా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డారు పా. ఎంత‌లా అంటే త‌లైవా ఆశ్చ‌ర్య పోయేలా చేశారు. ఆడినా ఆడ‌క పోయినా ప‌ట్టించుకోవ‌ద్దు..కానీ క‌థ అలాగే ఉండాలి. ఇలాంటి స్టోరీలు ఎప్పూడూ రావు..అరుదుగా వ‌స్తుంటాయి.
నీ వెనుక నేనున్నా..నీకు ఎలా అనిపిస్తే అలా చేయి. కానీ నా ఇమేజ్ చూసి చేస్తే ద‌ర్శ‌కుడివి కాలేవు. నీవు ఏమ‌నుకుంటున్నావో..ఎలా తీయాల‌ని త‌పిస్తున్నావో అలానే కానివ్వు. ఎక్క‌డా ఆగ‌కు అన్న మాట‌లే రంజిత్‌ను అద్భుత‌మైన సినిమాగా తీసేలా చేశాయి. క‌బాళి మూవీ వంద‌ల కోట్ల మార్కెట్‌ను దాటేసింది. ఓవ‌ర్సీస్ వ‌సూళ్ల‌ను షేక్ చేసింది. మ‌లేషియా, సింగ‌పూర్‌, జ‌పాన్‌, శ్రీ‌లంక‌ల‌లో రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి.
కాలా నిరాశ ప‌రిచినా..తిరిగి మ‌రోసారి పా రంజిత్‌కు ఛాన్స్ ఇచ్చాడు సూప‌ర్ స్టార్‌. అదీ ఆయ‌న‌కున్న న‌మ్మ‌కం. ఇంకేం రంజిత్ త‌లైవా విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించేలా చేశాడు. పాత్ర‌ను తీర్చిదిద్దాడు. రాధా ఆప్టేతో న‌ట‌నను పిండుకున్నాడు. సామాన్య‌మైన వ్య‌క్తి డాన్‌గా ఎలా మారాడో చెప్పిన క‌థ‌. ర‌జ‌నీకాంత్ మేన‌రిజానికి జ‌నం ..జేజేలు ప‌లికారు. రంజిత్ కు అవార్డులు..ప్ర‌శంస‌లు ల‌భించాయి. కానీ పా పొంగి పోలేదు. ఎప్ప‌టిలాగే ఉన్నాడు. కొత్త క‌థ‌ను త‌యారు చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యాడు..పా..
1982 డిసెంబ‌ర్‌లో త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌న్మించారు. ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీ చెన్నైలో చ‌దివారు. సినిమా మీద మ‌క్కువ ముందునుంచే ఉంది రంజిత్‌కు. అత్త‌కాతి, మ‌ద్రాస్‌, క‌బాళి, కాలా, లేడిస్ అండ్ జెంటిల్ వుమెన్‌, ప‌రియేరుమ్ పెరుమాల్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు పా. స్క్రిప్ట్ రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ గా వినుతికెక్కారు. చిన్న వ‌య‌సులోనే సూప‌ర్ స్టార్‌తో క‌లిసి సినిమా తీసే ఛాన్స్ వ‌చ్చినందుకు అభినందించ‌క త‌ప్ప‌దు. సామాజిక బాధ్య‌త క‌లిగిన ఈ పా..మ‌రిన్ని ప్ర‌జ‌ల భావోద్వేగాల‌ను ప్ర‌తిఫ‌లించేలా సినిమాలు తీయాల‌ని కోరుకుందాం.

కామెంట్‌లు