చెరగని సంతకం - జేపీ జీవితం
ఎందరో త్యాగాల ..బలిదానాల ..పోరాటాల ఫలితమే ఇవాళ్టీ ఇండియా. దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన నేతల్లో ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా పేరు పొందారు. కొన్ని తరాల పాటు ఈ దేశాన్ని ఒంటి చేత్తో పరిపాలన సాగించిన ఆమెకు చుక్కలు చూపించిన వారిలో జయప్రకాశ్ నారాయణ్ ఒకరు. లోక్‌పాల్‌గా, సర్వోదయ నాయకుడిగా ..ఎలాంటి మచ్చలేని నాయకుడిగా ఆయనకు పేరుంది. ఇందిర గాలి వీస్తున్న క్రమంలో ఆయన ఒక్కరే తట్టుకుని నిలబడ్డారంటే ఎంత శక్తివంతమైన వ్యక్తి అయి ఉండాలో ఆలోచించాలి. ఇండియా అంటేనే ఇందిర..ఇందిర అంటేనే ఇండియా అన్న రీతిలో ఇందిరాగాంధీ ఐరన్ లేడీగా పరిపాలన సాగించారు.
ఆమె చెబితే అదే శాసనం..అదే చట్టం. ఆమెనే ప్రభుత్వం. అడుగులకు మడుగులు వత్తే వాళ్లను అందలం ఎక్కించింది. తనకు ఎదురు నిలిచిన వాళ్లను నామ రూపాలు లేకుండా చేసింది. అంతగా పాలనలో పట్టు సాధించింది. వందలాది మందికి రాజకీయ భవిష్యత్‌ను ప్రసాదించింది. ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేసింది. అదే సమయంలో ఒంటెత్తు పోకడలు పోవడం..పవర్‌ను పక్కదారి పట్టించడంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆమె వాటిని ఉక్కుపాదంతో అణిచి వేశారు. గవర్నర్ల వ్యవస్థను నిర్వీర్యం చేశారు.
భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు. ప్రజలకు స్వేచ్ఛ అంటూ లేకుండా చేశారు. దేశం నలువైపులా ఇందిర పేరు మార్మోగింది. ఎక్కడ చూసిన ఇందిరమ్మనే. అంతగా తనను తాను ప్రమోట్ చేసుకున్నారు. అపారమైన పరిపాలన అనుభవం కలిగిన నాయకురాలిగా తనను తాను మల్చుకున్నారు. పక్క దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. యుద్ధానికి సై అన్నారు. ఆర్మీకి సర్వాధికారాలు ఇచ్చారు. టోటల్‌గా పాలనను తన చెప్పుచేతుల్లో ఉండేలా చేసుకున్నారు.
ఇదంతా ఇందిరకు సంబంధించిన కథ. ఆమె గురించి తెలుసుకోక పోతే..లోకం మెచ్చిన నేతగా..జనం ఆరాధించిన నాయకుడిగా జయప్రకాష్ నారాయణను మనం అర్థం చేసుకోలేం. శక్తివంతమైన నాయకురాలిగా చెలామణి అవుతున్న కాలంలోనే జేపీ తట్టుకుని నిలబడ్డారు. భారత జాతీయ కాంగ్రెస్ , జనతాపార్టీలను ఆయన స్థాపించారు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. సర్వోదయ ఉద్యమానికి ఊపిరి పోశారు. జనం ఆరాధించే ..విలువలకు కట్టుబడిన నాయకుడిగా జేపీ వినుతికెక్కారు.
1970 సంవత్సరం ..ఈ దేశానికి ఓ పీడకల. ఇందిర విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా..సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చిన నేతగా జేపీ చిరస్మరణీయమైన నాయకుడయ్యాడు. అంతా ఆయనను గౌరవ సూచకంగా లోక్ నాయక్ గా పిల్చుకుంటారు. జార్జి ఫెర్నాండెజ్, అటల్ బిహారీ వాజ్ పేయి, లాంటి నేతలు ఆయన శిష్యులే. నేటి తరం నేతలు జైపాల్ రెడ్డి, తదితరులకు ఆయన ఆరాధ్యుడు. 113వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా ప్రకటించింది. అమెరికాలో ఎనిమిదేళ్ల పాటు చదివాడు.
ప్రపంచాన్ని తన రచనలు, బోధనలతో విప్లవాలకు నాందీ పలికిన కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే ఎం.ఎన్. రాయ్ రచనలకు ప్రభావితుడయ్యాడు. 1920 కస్తూరిబాగాంధీ అనుచరురాలు ప్రభావతీదేవిని పెళ్లి చేసుకున్నారు. యుఎస్ నుండి ఇండియాకు వచ్చాక నెహ్రూ పిలుపు మేరకు ఐఎన్ ఎస్‌లో చేరాడు. మహాత్మగాంధీకి ప్రియమైన శిష్యుడయ్యాడు. 1932లో జైలుకు వెళ్లాడు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించి ముందుండి నడిపించాడు. ఇండిపెండెన్స్ వచ్చాక జేపీ ఆచార్య, నరేంద్రదేవ్, బాసవన్ సింగ్ లతో కలిసి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు. సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. బీహార్, యుపీలలో ఈ పార్టీ తీవ్రమైన ప్రభావం చూపించింది.
1954లో జేపీ రాజకీయాల నుండి వైదొలిగారు. ఆచార్య వినోబాభావే సర్వోదయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తన భూమినంతా పేదల పరం చేశాడు. హజారీబాగ్‌లో ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. 1960 చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి బీహారు రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించారు. జేపీ నాయకత్వం వహించిన విద్యార్థి ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. ఈ సమయంలోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవానికి జేపీ పిలుపునిచ్చాడు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని ఇందిర గాంధీని దోషిగా పేర్కొంటూ అలహాబాదు హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఇందిర వెంటనే రాజీనామా చేయాలని జేపీ డిమాండ్ చేశారు. దీనిని గమనించిన ఇందిర 1975లో అత్యవసర పరిస్థితిని విధించింది. జేపీతో పాటు వందలాది నేతలు జైలుకు వెళ్లారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇందిర ఎమర్జెన్సీని తొలగించి..ఎన్నికలకు పిలుపునిచ్చింది.
ఇందిరకు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటిని జయప్రకాశ్ నారాయణ్ కూడగట్టారు. ఓ వైపు ఆరోగ్యం క్షీణించినా..లెక్క చేయకుండా ఆమె ఆగడాలను ప్రజలకు తెలియ చెప్పాడు. ఆయన మార్గదర్శకత్వంలో జనతాపార్టీ రూపుదిద్దుకున్నది. కొన్నేళ్లుగా అరాచక పాలన సాగిస్తున్న ఇందిరను..కాంగ్రెస్‌ను గద్దె దింపింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రేసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. ఇదంతా జేపీ చలవే.
భారత దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడిన నాయకుడిగా జేపీ 1979లో తుది శ్వాస విడిచారు. జాతి యావత్తు ఆ మహోన్నతమైన నాయకుడికి నివాళి అర్పించింది. జేపీ అమర్ రహే అంటూ నినదించింది. 1998లో కేంద్ర సర్కార్ అత్యున్నతమైన భారతరత్న అవార్డును జేపీకి ప్రకటించింది. మేగసేసె అవార్డు కూడా ఆయనకు దక్కింది. ఎమర్జెన్సీని తట్టుకుని నిలబడిన నేతగా..కోట్లాది ప్రజలను ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన నాయకుడిగా జేపీ నిలిచి పోతారు. లక్షలాది మంది ఆయన భౌతిక కాయం వెంట నడిచారు.
ఎందరో నేతలు ఈ దేశంలో జన్మించారు. వచ్చారు..వెళ్లారు..కానీ జేపీ లాంటి నిబద్ధత కలిగిన రాజకీయ నేతను నేను చూడలేదు. అందుకే ఆయనంటే నాకు వల్లమాలిన అభిమానం. అంతేనా ఆయన నాపై ఎనలేని ప్రభావం చూపారు. కమ్యూనిస్టుగా, సోషలిస్టుగా, ప్రజాస్వామ్యవాదిగా..చివరకంటా విలువలే ప్రాతిపదికగా బతికన వ్యక్తిగా నన్ను ఆయన ప్రబావితం చేస్తూనే ఉంటారంటారు.. జగమెరిగిన పొలిటికల్ లీడర్ ..సూదిని జైపాల్ రెడ్డి. కాదనలేం..జన్ కీ నేత..జేపీ..కదూ..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి