రసకందాయం..ఏపీ రాజకీయం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు ఇప్పట్లో జరుగక పోయినా ఏదో ఒక సమస్యతో రాష్ట్రం నిత్యం దేశ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కుతోంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి మొదటి నుండి వివాదాస్పదమవుతోంది. ఇది ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. దేశ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతగా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పేరు పొందినా ఇప్పుడు ఆయన యెనలేని తిప్పలు పడుతున్నారు.
ఓ వైపు మిత్ర పక్షమైన బీజేపీ ని ఏమీ అనలేక రాష్ట్ర ప్రత్యేక హోదా విషయంలో అటు కాపు సామాజిక వర్గాన్ని నిలువరించక లేక పోయారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఇంకో వైపు లోకేష్ పూర్తిగా అన్నిట్లో ఆజమాయిషీ ఉండటం కూడా ఇబ్బందిగా మారింది. మహిళా సదస్సు విజయవంతం అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా అభ్యన్తరం వ్యక్తమైంది. అయినా దీనిని అలుసుగా తీసుకుని రోజా పరిధి దాటి డీజీపీపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.
ఇలాంటి వ్యాఖ్యల వల్ల సమాజంలో చులకన అయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఒకే ..అలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అటు అధికారంలో వున్నా ఇటు ప్రతిపక్షంలో వున్నా సరే మంచిది కాదు . అహో ఓహో అంటూ బాబు ఊదరగొడుతున్నా ఈరోజు వరకు నిర్దిష్టమైన ప్రణాళిక అంటూ లేకపోవడం ప్రజల పాలిట శాపంగా మారిందన్న ఆరోపణలున్నాయి.
కేంద్రం స్థాయిలో ప్రధానమంత్రితో స్నేహంగా ఉండటమే కాదు మంత్రివర్గంలో సైతం భాగస్వామ్యం వున్నా ఆశించిన ప్రత్యేక హోదాపై ఒక క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు చంద్రబాబు. అన్నిటిని మేనేజ్ చేసే సత్తా వున్నా ఈ విషయంలో ఆయన కొంత వెనుకంజ వేశారనే చెప్పాలి. విదేశీ పర్యటనలు చేయడం .. పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించినా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలంటూ హామీలు గుప్పించిన తెలుగు తమ్ముళ్లు పవర్ లోకి వచ్చేసరికల్లా మరిచి పోయారు .
అపారమైన వనరులు , సముద్ర తీరం , పరిశ్రమలకు అనువైన వాతావరణంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాలు ఉన్నా వాటిని తమ వైపు మరల్చు కోవడంలో వెనుకలోనే ఉన్నారని చెప్పాలి.ఇక కేంద్రం ఇచ్చిన 2వేల కోట్లు కూడా తాత్కాలిక భవనాలకు ఖర్చు చేశారు. 2018నాటికి శాశ్వత పరిపాలనా భవనాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇంకా ఏడాదిలో సాద్యమవుతుందా? నారాయణ అనుభవ రాహిత్యమో.. అధికారుల అలసత్వమో అసలు భూములకు సంబంధించిన సమస్యలే పరిష్కారం కాలేదు.
ప్రధాని వచ్చి శంకుస్థాపన చేశారు.. ఆతర్వాత చంద్రబాబు మరోసారి సీడ్ కేపిటల్‌కు పూజలు చేశారు. అరుణ్‌జైట్లీ వచ్చి ప్రభుత్వం భవనాలకు రాయి వేశారు. శంకుస్థాపనలు, పూజలతో మూడేళ్లు గడిచాయి. ఇంకా పదవీకాలం రెండేళ్లు ఉంది. రెండేళ్లలో వారి పనితీరు.. మరోదపా అధికారానికి మార్గాలు పరుస్తుంది. కానీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఏపీలో కాపుల సమస్య బాబుకు నిద్ర లేకుండా చేస్తోంది. మరో వైపు నోట్ల వ్యవహారం ఇంకా నానుతూనే వున్నది . ఎంత వెంకయ్య నాయుడు వెన్నుదన్నుగా వున్నా అటు మోడీ మాత్రం ఈ మధ్యన మౌనం వహించడంతో బాబు ఒకింత అసహనానికి లోనవుతున్నారు.
ఇక .. అధికార పార్టీ పాలన గాడి తప్పుతోందని , అవినీతి , అక్రమాలకు కేరాఫ్ గా మారాయంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మాటలతో దాడులకు దిగుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. అయినా బాబు మాత్రం తగ్గటం లేదు . జగన్ పైకి తన వారితో కౌంటర్ ఇప్పించేలా చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు రాకపోయినా ఆయన మాత్రం తన వేడిని మాత్రం ఇంకా పెంచుతూనే వున్నారు .
ఇటీవల బస్సు ప్రమాద సంఘటనపై ఆయన సందడి చేశారు. అయినా అటు సర్కార్ ఓ కమిటీ వేసి మౌనంగా వున్నది. అయితే జగన్ కు ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలని కోరిక ఎక్కువైనట్టున్నది . ప్రతిపక్ష స్థాయి నేతకు ఉండాల్సింది అవగాహన. పూర్తి స్థాయిలో పట్టు కలిగి ఉండటం కూడా అవసరమే. ఇక బీజేపీ మాత్రం చూసీ చూడనట్టు ఉంటోంది.
పవన్ రూటే సపరేట్
అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్యలో జనసేన పతాకం రెపరెపలాడుతోంది . ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ తన మాటల తూటాలు పేలుస్తున్నారు . పవన్ తీరుతో బాబు , వెంకయ్య కొంత ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తోంది . వచ్చే సారి జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన ముందస్తుగానే ప్రకటించారు . ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు . వేలాది మంది అభిమానుల బలం కలిగిన పవన్ వల్ల కొంత మేర ఓటు బ్యాంకు చీలే అవకాశం వుంది .
అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్యలో జనసేన పతాకం రెపరెపలాడుతోంది . ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ తన మాటల తూటాలు పేలుస్తున్నారు . పవన్ తీరుతో బాబు , వెంకయ్య కొంత ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తోంది . వచ్చే సారి జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన ముందస్తుగానే ప్రకటించారు . ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు . వేలాది మంది అభిమానుల బలం కలిగిన పవన్ వల్ల కొంత మేర ఓటు బ్యాంకు చీలే అవకాశం వుంది .
భూముల కేటాయింపు , తెలుగు తమ్ముళ్ల దుందుడుకు ధోరణి కొంత మైనస్ కాగా .. అధికారం లోకి రాక ముందే తానేమిటో మాటల్తో చూపిస్తున్న జగన్ శైలి వివాదాస్పదం అవుతోంది . అయితే గ్రామ స్థాయి నుండి పార్టీ కేడర్ కలిగి ఉన్న టీడీపీ కొంచం జాగ్రత పడక తప్పదనే చెప్పాలి . ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు ముగ్గురి మధ్యన తిరుగాడుతున్నాయి . ఇక వేచి చూడటమే మిగిలి ఉంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి