వికాసం విజయానికి సోపానం

గొప్ప గొప్ప వ్యక్తులు ..అత్యున్నతమైన స్థానాలను అధిరోహించిన వాళ్ళు . కార్పొరేట్ దిగ్గజాలు ..కంపెనీలను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న వాళ్ళు .. ఒక్క రోజులోనే గెలుపును అందుకోలేదు . వాళ్ళు సాధారణమైన మనుషులే . అంతా మనలాంటి వాళ్ళే . కానీ మనం ఒక దానిని ఒకే కోణంలో ఆలోచిస్తే వాళ్ళు మాత్రం భిన్నంగా ఆలోచించారు . అందరికంటే మెరుగ్గా వున్నారు . 
అదీ మనకు వాళ్లకు వున్నా తేడా .

మరి వాళ్ళ లాగా కావాలంటే ఏం చేయాలి . విజయానికి దగ్గరి దారులంటూ ఏమీ లేవు . కష్టపడాలి . అలుపన్నది లేకుండా సాగి పోవాలి . ఓ గమ్యాన్ని నిర్దేశించుకోవాలి . ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసు 
కోవాలి . అందు కోసం సరైన ప్రణాలికను రూపొందించు కోవాలి . అదే తొలి మెట్టు . గెలుపు కూడా ఓ యుద్ధం లాంటిదే . యుద్ధంలో చావటమో చంపటమో ఉంటాయి . ఇక్కడ కూడా ఆయుధాలు అంటూ
ఏమీ వుండవు . కానీ శ్రమించే తత్వమే నీ ఆయుధం . ఒకే చోట కూర్చుంటే ఏం ఒనగూరుతుంది .

కాలాన్ని కోల్పోవటమే తప్పా . అందుకే ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండాలి . గొప్ప గొప్ప వ్యక్తులు ..అత్యున్నతమైన స్థానాలను అధిరోహించిన వాళ్ళు ..కార్పొరేట్ దిగ్గజాలు ..కంపెనీలను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న వాళ్ళు .. ఒక్క రోజులోనే విజయాన్ని అందుకోలేదు . 
వాళ్ళు సాధారణమైన మనుషులే . మనలాంటి వాళ్లే . కానీ మనం ఒకదానిని ఒకే కోణం లో ఆలోచిస్తే వాళ్ళు మాత్రం భిన్నంగా ఆలోచిస్తూనే తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు .

దానినే ఫాలో అయ్యారు . విజేతలు ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూ కూర్చోరు . తమను తాము ముంచు ప్రేమించుకోవడం చేశారు . అక్కడే అసలైన గెలుపు పాఠం దాగి ఉంది . ఇందులో ఎలాంటి జిమ్మిక్కులు లేదా మ్యాజిక్కులు ఏవీ లేవు . ఉన్నదంతా ఒక్కటే కాలాన్ని ఒడిసి పట్టు కోవటం . అంటే కాల విలువను గుర్తించటం . దానిని అందుకునే ప్రయత్నం చేయడం . ఇలా అందివచ్చిన అవకాశాన్ని ఓ మెట్టుగా వాడుకోవడం . అక్కడి నుంచి వెనుకకి తిరిగి చూడక పోవటం ఇదే సక్సెస్ 
మంత్రం .

వికాసం వికసించాలంటే ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి . పూర్తిగా మనం మీద మనకు ఆధిపత్యం ఉండాలి. మన మీద మనకు కంట్రోల్ ఉండేలా ఎప్పటికప్పుడు తీర్చిద్దిద్దుకోవాలి . గాలి కబుర్లు .. గోబెల్స్ ప్రచారాలకు దూరంగా ఉండాలి . శత్రువులు ఎవరో .. మిత్రులు ఎవరో తెలుసు కోవాలి . ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలి .

గెలుపు ఓటములు సహజం . అలా అని ప్రయత్నం చేయకుండా కూర్చోవటం బద్దకాన్ని . అంతకంటే జీవితం పట్ల భాద్యత లేని తనాన్ని తెలియ చేస్తుంది . విజయం దరిదాపులను తాకాలంటే దమ్ము ఉండాలి . శ్రమను ఆయుధం చేసుకోవాలి . అప్పుడే అనుకున్నది సాధ్యమవుతుంది . అది పది కాలాల పాటు నిలబడుతుంది . గెలుపంటే గాలిలో దీపం కాదు అది చెమట చుక్కల సమ్మేళనం .

వందలాదిమంది ఒకే సమయంలో .. ఏక కాలంలో కలిసి శ్రమించటం . కోట్లాది జనం ఒక్కటై నినదించిన స్వరం లాంటిది . ప్రతి కదలికను పసిగట్టాలి . డేగ కళ్ళతో పరిశీలించాలి . ఒక్కోసారి గెలుపు మన 
దగ్గరకు వస్తుంది . మరోసారి రాకుండా నిలిచి పోతుంది. అన్నిటిని ఒడిసి పట్టుకోవాలి . ఏ సమయంలో ఏది వాడాలో ఏ కాలంలో దేనిని పట్టుకోవాలో తెలుసు కోవటమే విజయం .

కాలాన్ని గుర్తించిన వాళ్ళే యోధులు . కాలపు అంచులను తాకుతూ మెలమెల్లగా బతుకు నిచ్చెన మెట్లను ఆసరాగా చేసుకుని పైకి ఎగసిన వాళ్లనే గెలుపు తలుపు తడుతుంది . వారి కోసం వేచి చూస్తుంది .
పక్షి పైకి ఎగురుతుంది . కరెంట్ తీగల మీద వాలి పోతుంది .. వీచే గాలిని దాటుకుని ముందుకే వెళుతుంది . మనం కూడా పక్షులను స్ఫూర్తిగా తీసుకోవాలి. దానికి మించిన పాఠం ఇంకెక్కడ దొరుకుతుంది . కళ్ళ ముందు కనిపించే వాటిని తదేకంగా చూడండి . మీలో మీకు తెలియకుండా ఓ ఆలోచన పుడుతుంది . అది మిమ్మల్ని ఒక్కోసారి మెస్మరైజ్ చేసే స్థాయికి తీసుకు వెళుతుంది .

అలాగే గాలిపటం దారం లేకుండాస పైకి ఎగురలేదు . ఆలోచన లేకుండా మనం బతకలేం . బుద్ధి వికసించాలన్నా .. మనో ధైర్యం కలగాలన్నా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి . అది లోలోపతి శరీరాన్నే కాదు బాహ్య ప్రపంచాన్ని సైతం మార్చ గలిగేలా మన ప్రవర్తన .. మన వ్యక్స్తిత్వం రూపు దిద్దుకోవాలి .అప్పుడు మనిషి వికసిస్తాడు పువ్వులా .. విజయం వరిస్తుంది పూల వనంలా ..!

కామెంట్‌లు