క్రికెట్ లెజెండ్‌ను విస్మరించిన కాంగ్రెస్ - అజహరుద్దీన్ అవసరం లేదా ..!
దేవుడు ఇచ్చిన అత్యద్ధుత వరం అతడు. ఆ మణికట్టు మాయాజాలం మనల్ని కట్టి పడేస్తుంది. బహుషా ఆ చేతుల్లో ఏదో మంత్రం వుంది. అది మనల్ని కట్టి పడేస్తుంది. ఇలాంటి వాళ్లు కొందరే వస్తారు. చరిత్ర సృష్టిస్తారు. మధ్యతరగతి కుటుంబాలలో ఉండే భావోద్వేగాలే అతడి ఆటలోను..మైదానంలోను..జీవితంలోను ప్రతిఫలించింది. ఈ దేశం గర్వించేలా అత్యుత్తమైన విజయాలు అందించిన ఆటగాడిగా ఆయన పేరు సంపాదించారు. అదే సమయంలో ఎన్నో గెలుపులు మరెన్నో కప్పులు..పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచంలోని ప్రతి క్రికెట్ ఆటగాడు కోరుకునే ..నోబెల్ బహుమతిగా భావించే విస్డన్ అవార్డును స్వంతం చేసుకున్నాడు.
అపజయాలు పలకరించినా..బ్యూటిఫుల్ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టన్‌గా, మెరికలాంటి ఫీల్డర్ గా పేరు సంపాదించుకుని..చివరకు లైఫ్ ఇచ్చిన కిక్‌ను ఎంజాయ్ చేయలేక ..అనుకోకుండా మ్యాచ్ ఫిక్సింగ్ వలలో చిక్కుకుని మోయలేని మచ్చను ఆపాదించుకుని ..జీవితకాలపు నిషేధం నుంచి నిర్దోషిగా బయట పడిన ఆ ఆటగాడు ..హైదరాబాద్‌కు చెందిన ..మోస్ట్ ఇంప్రెస్సివ్ ,,రిస్టీ బ్యాట్స్‌మెన్ మహమ్మద్ అజహరుద్దీన్. ఈ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను ఎక్కని ఎత్తులు లేవు..చూడని లోతులు లేవు. ఒకప్పుడు బతికేందుకు ఇబ్బంది పడ్డ ఈ క్రికెటర్ ..ప్రపంచాన్ని తన మణికట్టు మాయాజాలంతో కోట్లాది అభిమానుల మనసు దోచుకున్నాడు. అంతేనా ఇప్పటికీ ఇంగ్లండ్ ఫ్యాన్స్ అతడి కోసం వెయిట్ చేసేలా తనను తాను మల్చుకున్నాడు.
క్రికెట్ కెప్టన్‌గా పలు ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లకు సారధ్యం వహించాడు. అటు టెస్ట్ క్రికెట్ లోను ..ఇటు క్లిష్టమైన వన్డే క్రికెట్ ఫ్లాట్ ఫాంలను ఈజీగా ..అవలీలగా మేనేజ్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని గ్రౌండ్లలో భారత్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అజహరుద్దీన్ హయాంలో అంటే 1990 కాలమంతా గోల్డెన్ ఇయర్స్‌గానే భావించాలి. ఆసియా కప్, షార్జా కప్, ప్రపంచ కప్, లెక్కలేనన్ని టెస్టులు, వన్డే మ్యాచ్‌లు ఇలా ప్రతి ఫార్మాట్‌లో ఇండియా ఒక వెలుగు వెలిగింది. ఒకానొక దశలో అతడికి ..ఆయన సారధ్యం వహించిన జట్టుకు ఇండియన్ గవర్నమెంట్ కంటే అధికంగా ప్రాముఖ్యత లభించింది. ఎక్కడికి వెళ్లినా అభిమానులు నీరాజనాలు పలికారు. జేజేలు అందించారు. అంతగా పాపులర్ అయ్యాడు ..ఈ భాగ్యనగరం కుర్రాడు.
ఇండియన్ క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ముంబయి, ఢిల్లీ, కొల్‌కత్తా, కర్ణాటక శాసించాయి. ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మెన్ జట్టు పగ్గాలు చేపట్టాక దేశంలోని ప్రతి స్టేట్ నుండి ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం దక్కేంది. ప్రపంచం మెచ్చిన బెస్ట్ క్రికెట్ కామెంటేటర్ హర్ష బోగ్లె ఏకంగా అతడి పేరుతో బయోగ్రఫీ రాశాడు. లక్షలాది ప్రతులు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఆటలో ..మాటల్లో..నడకలో..నడతలో అన్నింటా మధ్యతరగతి జీవితమే కనిపిస్తుంది. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించు కోకుండా అజ్జూ భాయ్ తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోయాడు. ఇండియన్ సెలబ్రెటీగా ఓ వైపు కోట్లాది రూపాయలు..కావాల్సినన్ని కార్లు..బంగలాలు..ఇలా చెప్పుకుంటూ పోతే కరోడ్‌పతిగా మారాడు. బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ డేవిడ్ గోవర్, కర్ణాటక నుండి గుండప్ప విశ్వనాథ్‌ను తలపించేలా మణికట్టుతోనే పరుగుల వరద పారించాడు. టెస్టులో, వన్డేల్లో భారత్‌కు లెక్కలేనన్ని విజయాలు అందించాడు.
ఉన్నట్టుండి ఈ విజేతను కారుమబ్బులు కమ్ముకున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. రుజులు దక్కాయి. ఏ ప్రపంచమైతే అతడిని సక్సెస్ ఫుల్ క్రికెటర్‌గా కీర్తించిందో అదే లోకం ఇతడిని వెలి వేసింది. నా అన్నవాళ్లకు దూరమయ్యాడు. లోలోపట కుమిలి పోయాడు. అతడితో ఆడిన వాళ్లు..అతడి అద్భుతమైన ఆటను ఆరాధించిన అభిమానులు..ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు జీర్ణించుకోలేక పోయారు. ఇది నిజం కాదని..ఇరికించారంటూ వాపోయారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎన్నో గెలుపుల్ని అందించిన అజహరుద్దీన్‌పై లైఫ్ బ్యాన్ విధించింది. దీనిని సవాల్ చేస్తూ అజహర్ కోర్టును ఆశ్రయించాడు. ఎలాంటి ఆధారాలు రుజువు చేయలేక పోవడంతో..ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మెన్ నిర్దోషి అంటూ హైకోర్టు ప్రకటించింది. గత్యంతరం లేక బీసీసీఐ లైఫ్ బ్యాన్ ఎత్తివేసింది. అయినా ఆ మరకలు అలాగే ఉండిపోయాయి.
వెలివేసిన ఈ లోకం మళ్లీ అజ్జూభాయ్‌ను ఆదరించడం ప్రారంభించింది. చీకటి కాలంలో అజహరుద్దీన్‌కు మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ అండగా నిలిచారు. నవ్‌జ్యోతి సింగ్ సిద్దూ ఏకంగా తనకు స్వంత అన్నయ్యగా అభివర్ణించాడు. ఎవ్వరు ఎన్ని ఆరోపణలు చేసినా సరే మోస్ట్ బ్యూటిఫుల్ బ్యాట్స్‌మెన్..గ్రేట్ కెప్టెన్..వండర్ ఫుల్ ఫీల్డర్..లవ్లీ..రిస్టీ ప్లేయర్..అతడు.. ఎవ్వరైనా ఈ క్రికెట్‌లో రావచ్చు..ఏలొచ్చు..ఎన్ని మార్పులు వచ్చినా సరే..ఇలాంటి ఆటగాడిలా ఆడడం ఎవ్వరి తరం కాదంటాడు ..సిద్ధూ భాయ్. మహమ్మద్ అజహరుద్దీన్ ఫీనిక్స్ పక్షిలాగా తిరిగి పైకి లేచాడు.
ప్రాణప్రదమైన కొడుకును రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్నాడు. సంగీతా బిజ్‌లానితో కలిసి ఉన్నాడు. నిర్దోషిగా బయటకు వచ్చిన అజహరుద్దీన్‌ను బీసీసీఐ స్వాగతం పలికింది. లివింగ్ లెజెండ్స్ ను సత్కరించింది. ముంబయిలో ఘనంగా ఏర్పాట్లు చేసింది. అక్కడ తలపండిన క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. కానీ ఈ హైదరాబాదీ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టేసరికల్లా మీడియా చుట్టుముట్టింది. అతడికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఇది అతడికున్న ఫాలోయింగ్. మళ్లీ అజ్జూ భాయ్ ని కపిల్‌దేవ్ హత్తుకున్నాడు. గవాస్కర్, వెంగ్‌సర్కార్, సచిన్, గంగూలీ, రాహుల్ ద్రవిడ్..ఇలా చెప్పుకుంటూ ఇండియాకు ఎనలేని విజయాలు అందించిన వారంతా..అతడితో కరచాలనం చేశారు.
దేశంలోని అన్ని పార్టీలు అజహరుద్దీన్‌ను తమ వైపు ఆహ్వానించాయి. ఆయన కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. మురాదాబాద్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వేలాది మంది అజ్జూభాయ్ అంటూ నినాదాలు చేశారు. చిన్న పిల్లాడిలా మనోడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఆపార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాడు. మోడీ హవా దెబ్బకు మనోడు కూడా గత ఎన్నికల్లో ఓడిపోయాడు. కానీ తెలంగాణలో టీపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలందిస్తున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పోటీ చేయాలని బరిలో నిలిచాడు. ఆ ప్యానెల్ అతడిని వద్దనుకుంది. కోర్టుకు వెళ్లాడు. ఆయనకే అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఇటీవల జరిగిన చర్చల్లో కాంగ్రెస్ హైకమాండ్ దేశంలో జరిగే ఎన్నికల క్యాంపెయినర్ల లిస్టులో అజహరుద్దీన్ పేరు చేర్చింది. ఇప్పటికీ అజ్జూ భాయ్‌కు ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. హైదరాబాద్‌లో మంచి పట్టు వుంది. రోడ్ షోలు, సభలు , సమావేశాల్లో పాల్గొనేలా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ప్లాన్ చేసింది. మేడ్చెల్‌లో బహిరంగ సభ నిర్వహించారు. కానీ అజహరుద్దీన్‌ను విస్మరించడం చాలా మందిని బాధ పడేలా చేసింది. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన టీం ఈ మాజీ క్రికెట్ దిగ్గజం సేవలను వాడుకుంటే పార్టీకి..ఆయనకు మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి