కోట్లాది మహిళలకు కొండంత అండ - పీసేఫ్ స్ప్రే
ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు అతడు ఆరాధకుడిగా మారారు. అతను బాబా కాదు..పొలిటికల్ లీడర్ కాదు..ప్లేయర్ అంతకన్నా కాదు. మనలాంటి వ్యక్తే అతడే వికాస్ బగారియా. మోస్ట్ వాంటెడ్ ఇండియన్ ఆంట్రప్రెన్యూర్‌గా పేరు పొందారు. ఇండియాలో మహిళల పరిస్థితి మరీ దారుణం. ఎక్కడికైనా వెళ్లాలంటే భయపడతారు. పురుషలకు ఉన్నంత స్వేచ్ఛ బాలికలు, స్త్రీలకు ఉండదు. ప్రతి నెల నెలా వచ్చే నెలసరి సమస్యలు ఇబ్బంది పెడుతుంటే..గైనిక్ ప్రాబ్లమ్స్..యూరినరీ ఇన్ఫ్‌క్షన్స్..ఇలా చెప్పలేని రోగాలకు లోనవుతారు. 70 శాతానికి పైగా వీరంతా బాధితులే. ఎక్కడైనా పబ్లిక్‌గా టాయిలట్స్‌కు వెళ్లాలంటే శుభ్రంగా ఉండవు. దీని వల్ల పురుషులకంటే వుమెన్స్‌కే ప్రాబ్లమ్స్. మార్కెట్లో ఎన్నో మందులు, పిచికారీ చేసేందుకు ప్రొడక్ట్స్ లెక్కలేనన్ని ఉన్నాయి.
కోట్లల్లో ఆన్‌లైన్‌లో వ్యాపారం జరుగుతోంది. లైజాల్, హర్‌పీక్, ఫినాయిల్స్ ఇలాంటివి ఉన్నాయి. పేద, మధ్యతరిగతి మహిళలే కాక ఉన్నత వర్గాలకు చెందిన వారు, బిజినెస్ ఉమెన్స్ ..ప్రతి మహిళకు ప్రతిరోజు ఎదురయ్యే సమస్యే. త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో, ఇళ్లల్లో, పబ్లిక్‌లో అన్నింటా ఇదో జీవన్మరణ సమస్య. కొన్నేళ్ల పాటు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, స్వచ్ఛత పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాయి. జనంలో మార్పు రావడం లేదు. బస్టాండ్లలో, రైళ్లల్లో, హోటళ్లలో టాయిలెట్స్ వాడడం వల్ల హైజినిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటి బారిన 90 శాతానికి పైగా గురవుతున్నారు. యూరినరీ ప్రాబ్లమ్స్ అత్యధికంగా మహిళలకే వస్తాయి.
లక్షలాది మంది మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న ఈ చిత్రమైన సమస్యలకు పరిష్కారాన్ని కనుగొన్నాడు..మనోడు..అతడే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వికాస్ బగారియా. వృత్తి రీత్యా ఆంట్రపెన్యూర్, మెంటార్, ట్రైనర్..బెస్ట్ ఆరేటర్ కూడా. జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్‌లో ఎంసీఎ చేశాడు బగారియా. ఆంట్రపెన్యూర్‌గా ఎన్నో స్టార్టప్‌లకు ప్రాణం పోశాడు. ఓ సారి ఆయన భార్య జర్నీ సందర్బంగా టాయిలెట్‌కు పోవాల్సి వచ్చింది. జస్ట్ 10 మినిట్స్ వ్యవధిలోనే ఆమె యూరినరీ ఇన్‌ఫెక్షన్‌కు గురైంది.
తన బాధను చెప్పుకోలేక ..డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఇదంతా టాయిలెట్స్ శుభ్రంగా లేక పోవడం. డబ్బులున్న తన భార్యకే ఇలా వుంటే..రోజూ వేలాది మంది ఇళ్లల్లో, వివిధ అవసరాల నిమిత్తం..పనుల కోసం..ఉద్యోగాల కోసం జర్నీ చేస్తుంటారు. మరి వీరందరు ఇలాంటి ప్రాబ్లంను ఎదుర్కొంటున్నారని బగారియా గ్రహించాడు.
రంగంలోకి దిగాడు. ఎందరినో సంప్రదించాడు. డబ్బున్న వాళ్లను కలిశాడు. కొంత ఫండింగ్ సపోర్ట్ చేయండి. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే సాధనం నా దగ్గర ఉందని చెప్పాడు. అయినా వారి నుండి స్పందన రాలేదు. నిన్ను నమ్మాలంటే..నీ ఐడియా వర్కవుట్ కావాలంటే నువ్వో ఐఐటీయన్ అయి వుండాలి లేదా ఐఐఎంలో ఉత్తీర్ణుడైనా కావాలని అని గేలి చేశారు. కానీ వాళ్లకు తెలీదు బగారియా మోస్ట్ టాలెంటెడ్..మెంటార్ అని..ఇక వెనుతిరిగి చూడలేదు.
రంగంలోకి దిగాడు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు అందరికీ అందుబాటులో ఉండేలా పీస్ప్రే ను రూపొందించాడు. దీనిని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మామూలు స్పే లాగానే ఉంటుంది. మహిళలు తమ బ్యాగుల్లో ఎక్కడికైనా తీసుకెళ్లేలా సౌకర్యంగా ఉంటుంది. 5 సెకండ్ల పాటు లావెట్రీని, బాత్రూంపై స్పే చేస్తే చాలు..ఎలాంటి వాసన ఉండదు. ఎలాంటి యూరినరీ ఇన్‌ఫెక్షన్స్ రావు.
ఆ నోటా ఈనోటా పీ స్ప్రే పాపులర్ అయ్యింది. టాయిలెట్ సీట్ శానిటైజర్ స్ప్రే గా ప్రసిద్ధి చెందింది. 2013లో లక్ష పీ స్ప్రే బాటిళ్లు అమ్ముడు పోయాయి. ఇదో రికార్డు. ఇప్పటిదాకా లక్షల్లో అమ్ముడవుతూనే ఉన్నాయి. 2017లో ఇండియాలోనే ఓ రికార్డు . అమ్మకాల్లో కొత్త చరిత్ర సృష్టించింది ఈ ప్రొడక్ట్. 2017లో వన్ మిలియన్ డాలర్లు ఫండింగ్ ద్వారా అందాయి. 2010లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆయన చదివారు. ఫోర్క్‌లిఫ్ట్, రిలయన్స్ రిటెయిల్, అమజాన్ , ఫ్లిఫ్‌కార్ట్ కంపెనీల నుండి భారీ ఆర్డర్స్ వచ్చాయి. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదటి కస్టమర్ మనోడికి.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా వికాస్ బగారియా తయారు చేసిన పీ స్ప్రే కోట్లాది మహిళలకు రక్షణ కవచంగా ఉపయోగ పడుతోంది. అనారోగ్య సమస్యల నుండి కాపాడిన అతడు మనందరి పాలిట కనిపించే దేవుడు..కాదంటారా..అనలేం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి