నిన్న సెక్స్ వర్కర్లు..నేడు బతుకులో విజేతలు
సమాజం వాళ్లను మనుషులుగా చూడాలంటే ఒప్పుకోదు. తాము తప్పు చేసినా పర్వాలేదు..కానీ ఎదుటి వాళ్లను ఆశించడం..అవకాశం చిక్కితే లోబర్చు కోవడం..కోరుకోవడం షరా మామూలే. దేశానికి స్వతంత్రం వచ్చినా..ఇంకా వేశ్యా వృత్తి కొనసాగుతూనే వుంది. తెలిసో తెలియకో ఈ రొంపిలోకి వచ్చిన వారు..ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం, వారిని వ్యాపార వస్తువులుగా చూడడంతో ఇది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కామాటిపుర, రెడ్‌లైట్ ఏరియా లాంటి నగరాలు వీరికి కేంద్రాలు. ఇదో పరిశ్రమ లాగా తయారైంది. వీరిని అడ్డం పెట్టుకుని, వీరి రక్తమాంసాలతో ఫక్తు వ్యాపారం చేస్తూ బ్రోకర్లు, దగుల్భాజీలు లక్షలు పోగేసుకుంటున్నారు. వారి శరీరాలతో ఆటాడుకుంటున్నారు. వారికి బతుకు లేకుండా చేస్తున్నారు. ఒక్కసారి వీరిపై ఆ ముద్ర పడితే చాలు సమాజం ఒప్పుకోదు.
విపత్కరమైన..అత్యంత దుర్భరమైన పరిస్థితులకు లోనై దిక్కుతోచని స్థితిలో శరీరాలను అమ్ముకుంటున్న వీరికి ఓ మనసుందని ..వారికి ఓ జీవితం ఉంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది. సెక్స్ వర్కర్లు గా ఇప్పటికే పనిచేస్తున్నారు. అలాంటి వారిలో కొందరు మాత్రం తమకంటూ ఓ ఐడెంటిటి ఉండాలని కోరుకోవడం గ్రేట్. వేశ్యావాటిక నుండి స్వేచ్ఛా వాయులు పీల్చే వ్యక్తులుగా మారడం ఓ చరిత్ర. వీరిలో ఒకరు ఏకంగా ఉన్నత స్థాయి చదువు కోసం ఇతర దేశానికి వెళ్లడం విస్మరించలేని వాస్తవం. దీని వెనుక కఠోరమైన శ్రమ వుంది. ఎంత సేపు శరీరాలను అమ్ముకోవడమేనా..విటులను సంతృప్తి పర్చడమేనా..ఇదేనా జీవితం..ఇందు కోసమేనా బతికి ఉన్నది. ఏదో చేయాలి..ఏదో సాధించాలి. నాలాంటి వారు ఎందరో చిరునామా లేని చావులకు లోనవుతున్నారు. చెప్పుకోలేని రోగాలకు గురవుతున్నారు. వారిలో మార్పు తీసుకు రావాలి. మలినం అన్నది శరీరాలకే కానీ..మనసుకు కాదంటూ ..చదువొక్కటే వెలుగు ఇస్తుందని నమ్మారు.
శ్వేతా కట్టి - ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈమె అందరి లాంటి మహిళే. కానీ అనుకోకుండా రెడ్ లైట్ ఏరియాలో చిక్కింది. పినతండ్రి నుండి లైంగిక వేధింపులకు గురైంది. అన్నింటిని భరించింది శ్వేతాకట్టి. ఇన్ని బాధలను తట్టుకుంటూనే ప్రైవేట్‌గా చదువుకుంది. న్యూయార్క్ లోని బ్రాడ్ కాలేజీలో చదువుకునేందుకు స్కాలర్‌షిప్ సంపాదించింది. సైకాలజీలో మాస్టర్స్ చేసింది. ఇపుడు వేలాది మంది సెక్స్ వర్కర్లలో మార్పు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తోంది కట్టి. కుటుంబీకులు వేశ్యా వృత్తి రొంపిలోకి దించారు. ఇది కూడా ఓ వృత్తే. ఓ స్వచ్ఛంద సంస్థ నాలో ఉన్న పట్టుదలను గుర్తించింది. నేను చదువుకునేలా సహకారం అందించింది. దీంతో నేను చదువు కోగలిగాను. ప్రతిష్టాత్మకమైన యుఎస్ కాలేజీలో చదువుకునే స్థాయికి ఎదిగాను. ఎక్కడి కామాటిపుర..ఎక్కడి ముంబయి..ఎక్కడి రెడ్ లైట్ ఏరియా..తల్చుకుంటేనే దుఖం కలుగుతుంది అంటోంది. ఇది కల కాదు నిజం. నాలాగా ఎందరో రాలిపోతున్నారు. నలిగి పోతున్నారు. విటుల కోర్కెలు తీర్చలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దేశంలో ఉన్నామా అని ఒక్కోసారి అనుమానం కలుగుతుంది అంటారు శ్వేత.
సెక్స్ వర్కర్ టు సోషల్ వర్కర్ - లతా మానే ఇపుడు సెక్స్ వర్కర్లకు ఓ భరోసా. కర్ణాటకకు చెందిన లత .1955లో ముంబయికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. భర్త ఆమెకు తెలియ కుండానే వేశ్యా వాటికకు అమ్మేశాడు. ఒక ఏడాది గడిచాక వదిలేశాడు. ముంబయి రెడ్ లైట్ ఏరియాలో ఆరేళ్ల పాటు సెక్స్ వర్కర్ గా పనిచేసింది. తన శరీరాన్ని అమ్ముకుంది. బెదర లేదు..వెనక్కి తగ్గలేదు. ఇదే సమయంలో విటుల్లో ఒకరు నచ్చడంతో మళ్లీ పెళ్లి చేసుకుంది. ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చింది. వాడు వదిలేశాడు. లత ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన మంచి లైఫ్ ఇచ్చేందుకు ఓ ఎన్‌జీఓ ముందుకు వచ్చింది. దీంతో ఆమె జీవితం మారిపోయింది. సోషల్ యాక్టవిస్ట్‌గా ఇపుడు వేలాది మంది సెక్స్ వర్కర్లలో మార్పు తీసుకు వచ్చేందుకు ట్రై చేస్తోంది. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. 2013లో ముంబయిలో స్వచ్ఛ్ అభియాన్ ప్రాజెక్టులో చురుకుగా పనిచేసింది. హెల్త్ సెక్టార్‌లో ప్రజలను చైతన్యవంతం చేయడంలో కీలక భూమిక పోషించింది. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) లతా మానేను బెస్ట్ వర్కర్‌గా సత్కరించింది.
అనల..అబల కాదు సబల - ఆమె అందరిలాగే కలలు కన్నది. కానీ అనుకోకుండా ముంబయి రెడ్ లెట్ ఏరియాలో చిక్కుకుంది. ఆశలు ఆవిరయ్యాయి. ఈ సమయంలో ఇంకొకరుంటే ఆత్మహత్య చేసుకోవడమో లేక చావడమో చేస్తారు. కానీ కామాటిపురకు చెందిన అనల సెక్స్ వర్కర్‌గా కొన్నేళ్ల పాటు పనిచేసింది. అవే ముఖాలు..అవే శరీరాలు..ఉన్న శరీరాన్ని అప్పగించడం..వచ్చిన కొద్దిపాటి డబ్బులతో బతకడం. రోటిన్..కానీ ఏదో ఆశ..ఏదో సాధించాలన్న కసి..దీనిని గుర్తించి ప్రోత్సహించింది..ఒయాసిస్ అనే ఓ స్వచ్ఛంధ సంస్థ. ఆమె మామూలు మనిషిగా మార్చేసింది. కార్యకర్తగా సంస్థలోకి తీసుకుని ..తనలాంటి వారికి భరోసా కల్పించేలా శిక్షణ ఇచ్చారు. దీంతో ఆమెలో అనుకోని మార్పు చోటు చేసుకుంది. వేశ్య వాటికలో బందీలైన వారిని విముక్తి చేసే పనిలో నిమగ్నమైంది అనల. ఇపుడు ఆమె అబల కాదు సబల అని నిరూపిస్తోంది.
సో..కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది..వాటిని తట్టుకుని నిలబడితే ..మనుషులనే కాదు ..సమాజాన్ని మార్చవచ్చని వీరు నిరూపిస్తున్నారు. వీరికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏం చేయగలం కదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి