పతంజలి ప్రభంజనం - మార్కెట్‌లో సంచలనం - రాందేవ్ బాబా దెబ్బకు ఠారెత్తిన కంపెనీలు
యోగా గురువుగా సుప్రసిద్ధులైన రాందేవ్ బాబా దెబ్బకు వరల్డ్ మార్కెట్ కుదుపులకు లోనవుతోంది. బడా బడా కంపెనీలకు సాధ్యం కాని విజయాన్ని ఆయన నమోదు చేసుకున్నారు. తన పేరునే బ్రాండ్ గా మార్చుకుని విదేశీ కంపెనీలకు కంటి మీద కునుకే లేకుండా చేస్తున్నారు. ఆయన జీవితం అనూహ్యంగా పతంజలిని ప్రేమించడంతో స్టార్ట్ అయ్యింది. ఎక్కడికి వెళ్లినా యోగానే . పతంజలి పేరు లేకుండా ఈ గురు ఏ పనీ చేయరు.
అంతలా ఆయన పూర్వ ఆధ్యాత్మిక, ఆయుర్వేద నిపుణుడైన పతంజలితో కనెక్ట్ అయ్యారు. భారత్ అంటే యోగా..యోగా అంటేనే రాందేవ్ బాబా గుర్తుకు వచ్చేలా చేశారు. కార్పొరేట్ దిగ్గజాలు, బిజినెస్ పీపుల్స్, ఐటీ , హార్డ్ వేర్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీల అధిపతులు, పొలిటికల్ లీడర్లు ఇలా ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయేలా రోజుకో ట్విస్ట్ ఇస్తూ దూసుకు పోతున్నారు ఈ బాబా.
రాందేవ్ బాబా ఏది చేసినా సంచలనమే. ఎక్కడికి వెళ్లినా ప్రభంజనమే. వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు యోగాలో సుశిక్షుతులై ఉండాలన్నదే తన అభిమతమని..ఇండియాను యోగా భారత్ చేయాలన్నదే తన లక్ష్యమని అంటారు. బాబా అద్బుతంగా మాట్లాడతారు. ఏది చెప్పినా అందులో భారతీయత ఉండేలా జాగ్రత్త పడతారు.
యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తీసుకు వచ్చారు. విదేశీయులకు ఇపుడు రాందేవ్ ఆదరణీయ గురువు. నమ్మకమైన నడిపించే నాయకుడు కూడా అంటే నమ్మగలమా. యోగాసనాలతో ఆయన రూపొందించిన వీడియాలు యూట్యూబ్‌లో కోట్లాది మందిని ఇష్టపడేలా చేస్తున్నాయి. ఇపుడు బాబా బ్రాండ్ విలువ అమెరికా అధ్యక్షుడితో సమానంగా ఉన్నది. ఇది మొత్తం మార్కెట్‌ను పునరాలోచించేలా చేస్తోంది.
రాందేవ్ బాబా ఇండియన్ మార్కెట్‌ను ఎంచుకున్నారు. దీని వెనుక ఆయనకు నమ్మకమైన ..ఆత్మకంటే ఎక్కువగా నమ్మే..అభిమానించే..ఆరాధించే బాలకిషన్ ఉన్నారు. ఈ యోగా గురుకు వరల్డ్ వైడ్‌గా ఒక ప్రత్యేకతను ఉట్టిపడేలా తీర్చిదిద్దింది మాత్రం అతడే. యోగాకు గురువే కాదు ఆ రంగానికి రాజు కూడా. వేదం ..యోగా..ఆధ్యాత్మికత..భారతీయత ఇదే రాందేవ్ విజన్. ఇంకేముంది ఆయన యోగా కోసం భారత ప్రధాని, ప్రెసిడెంట్..ఫారిన్, ఇండియన్ బిజినెస్ మెన్స్, ప్లేయర్స్, కంపెనీల ఛైర్మన్లు, సీఇఓలతో పాటు మహిళలు ఆయనకు ఫ్యాన్స్ అయి పోయారు. ఆయన ఏది చెబితే ఆ యోగాసనాలను చేసేస్తున్నారు. ఇపుడు బాబా అంటేనే ఇండియాలా గా మార్చేసుకున్నారు.
రాందేవ్ బాబాకున్న ఫాలోయింగ్‌ను గుర్తించిన బాలకిషన్..1997లో చిన్నగా ఫార్మసీ దుకాణాన్ని స్టార్ట్ చేశారు. అందులో తనకు ఇష్టమైన ఆయుర్వేద, ఆధ్యాత్మిక గురు పతంజలి పేరుతో ప్రారంభించారు. దానిని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌గా రిజిష్టర్ చేశారు. భారతీయ వస్తువుల మార్కెట్‌లో 80 శాతం వాటాను దక్కించుకుని రికార్డులను తిరగ రాసింది. బాబాకు ఉన్న ఫాలోయింగ్..అభిమానులు లక్షల్లో పతంజలిని స్వంతం చేసుకున్నారు.
తక్కువ ధర..అద్భుతమైన ప్యాకింగ్, టైమింగ్, నాణ్యత విషయంలో రాజీ పడక పోవడం ఇది పతంజలికి ఉన్న బలం. సూది మొన నుండి భారతీయులకు కావాల్సిన ప్రతి వస్తువును పతంజలి తయారు చేస్తోంది. 5000 వేల రూపాయలతో ప్రారంభమైన పతంజలి మందులే కాదు అన్ని వస్తువులను విక్రయిస్తూ25000 వేల కోట్ల టర్నోవర్ సాధించేంత దాకా వెళ్లింది.
ఇండియన్ మార్కెట్‌ను విదేశీ కంపెనీలు ముంచెత్తాయి. భారతీయులను ఆకర్షిస్తూ బోల్తా కొట్టించాయి. అలాంటి వాటికి మార్కెట్‌లో చోటు లేకుండా చేసే స్థాయికి పతంజలి చేరుకుంది. అమెరికా, చైనా, ఇంగ్లండ్, సింగపూర్, మలేషియా, అరబ్ కంట్రీస్..ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని దేశాల ప్రొడక్ట్స్ కు దిక్కే లేకుండా చేశారు మన రాందేవ్ బాబా. ఎక్కడికి వెళ్లినా..ఇండియాలోని ప్రతి మారు మూల పల్లెకు పతంజలి వస్తువులు చేరుకున్నాయి. యోగాతో పాటు మందులు, తినుబండారాలు, రోజూ వాడే ప్రతి వస్తువులు పతంజలి దుకాణంలో లభిస్తాయి. ఈ విక్రయాలపై కొన్ని ఆరోపణలు లేక పోలేదు. కానీ వీటన్నింటిని బాబా , బాలకిషన్‌లు తట్టుకుని నిలబడ్డారు.
మల్టీనేషనల్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇండియాలో పేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. వీరి వాటా దాదాపు 85 శాతానికి పైగా వుంటుంది. వీరితో పాటు మిగతా 12 శాతం మంది ఉన్నత వర్గాల ప్రజలు కూడా పతంజలి వస్తువులు కొనేందుకు ఎగబడుతున్నారు. పతంజలి మార్కెట్‌లో రానంత వరకు యూనిలివర్, ప్రాక్టర్ అండ్ గాంబిల్, నెస్ట్‌లే, కాల్గేట్, పాల్మోలివ్, జాన్సన్ అండ్ జాన్సన్, షాంపూలు, బిస్కట్లు, నెయ్యి, నూడుల్స్, చెప్పులు, ఫినాయిల్స్, బ్రష్‌లు..ఇలా ప్రతి ఒక్క దానిపై ఈ కంపెనీలదే ఆధిపత్యం. వీటన్నింటికి ఒకే ఒక్క దెబ్బకు పతంజలి వస్తువులతో కూల్చేశారు..కోలుకోలేకుండా చేశారు.
పతంజలి రోజు రోజుకు ఇండియన్ మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంటూ పోయింది. ఏకంగా 2016 - 2017 సంవత్సరంలో 10000 వేల వార్షిక టర్నోవర్ సాధించి రికార్డు సృష్టించింది. 2017 - 2018 సంవత్సంలో అది 25000 వేల కోట్ల మార్కెట్‌ను స్వంతం చేసుకుంది. తన రికార్డును తానే తిరగ రాసింది..పతంజలి . ఇపుడు భారత పతాకంతో పాటు పతంజలి వస్తువులు తళకళలాడుతున్నాయి. 5000 మంది డిస్ట్రిబ్యూటర్లు, 15000 వేల స్టోర్స్, 100 మెగా మార్ట్స్‌తో బిగ్గెస్ట్ మార్కెటింగ్ కంపెనీగా పేరు నమోదు చేసుకుంది. రాందేవ్ బాబా, బాలకిషన్‌ల దెబ్బకు బడా విదేశీ కంపెనీలు దిగిరాక తప్పడం లేదు.
పతంజలితో ఇపుడు ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్, హైపర్ సిటీ, స్టార్ బజార్ జత కట్టాయి. 1600 కోట్లతో నోయిడాలో ఫుడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. 1200 కోట్ల రూపాయలతో అస్సాంలో వస్తువులు తయారు చేసే కంపెనీలను స్థాపించారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు, పాలకులు , అధికారులు చేయలేని పనిని ఒకే ఒక్క బాబా చేయగలిగాడు. ఇది కూడా చరిత్రే. ప్రత్యక్షంగా..పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా చేశాడు బాలకిషన్, బాబాలు.
2016లో ప్రపంచ వ్యాప్తంగా ఎదుగుతున్న వ్యాపారవేత్తలలో రాందేవ్ బాబాకు 27వ స్థానం లభించింది. పతంజలికి సిఇఓగా ఉన్న ఆచార్య బాలకిషన్ ఫోర్బ్్స వంద మంది రిచెస్ట్ పీపుల్స్‌లలో 48వ పొజిషన్‌లో నిలిచారు. భారతీయత తన సంస్కృతిలోనే బతుకుతోంది. మేం తయారు చేసే ప్రతి వస్తువు భారతీయతను కలిగి ఉంటుంది. పేదలు, మధ్యతరగతి వారే ఎక్కువ. వారి కొనుగోలు శక్తి తక్కువ. అందుకే వారికి అందుబాటులో ఉండేలా..నాణ్యత తగ్గకుండా వస్తువులు తయారు చేస్తున్నాం. చాలా తక్కువ మార్జిన్ తీసుకుంటాం. అదే మా మార్కెట్ స్ట్రాటజీ.
తక్కువ ధరకు వస్తుందంటే చాలు ..జనం ఎగబడి కొంటారని అనుకోవడం భ్రమ. మేం నాణ్యతలో రాజీ పడం..ధరలో కూడా. అదే మా సక్సెస్ అంటారు ఆచార్య బాలకిషన్. టాలెంట్ ఎక్కడున్నా గుర్తించి గౌరవిస్తాం. వారికి మంచి వేతనాలు, గౌరవ ప్రదమైన జీవితాన్ని ప్రసాదిస్తాం. అంతకంటే ఏం కావాలి. ఈరోజు మాదే..రేపు కూడా మాదేనంటారు..బాబా..బాలకిషన్‌లు.
ఇండియా అంటేనే భారత్. భారతీయులన్నా..వారు తయారు చేసిన వస్తువులన్నా చీదరించుకునే విదేశీయులకు ఇపుడు పతంజలి చుక్కలు చూపిస్తోంది. పాలకులు చేయలేని పనిని ఈ బాబా చేసి చూపించారు. ఇంతకన్నా ఏం కావాలి. బాబా, బాలకిషన్‌లు కొట్టిన దెబ్బకు మార్కెటే కాదు పాలకులు కోలుకోలేక పోతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి